LifeStyleVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/life-style-human-relationshipsdf873873-e627-4fcf-893a-b0c200a1023e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/life-style-human-relationshipsdf873873-e627-4fcf-893a-b0c200a1023e-415x250-IndiaHerald.jpgమనిషి ఎంత సంపాదించినా, ఏమి సాధించినా ఆనందానికి మించిన విజయం మరొకటి ఉండదు. భోగ భాగ్యాలతో తులతూగే జీవితం ఉన్నా, మనసుకు నచ్చినట్టు బ్రతికే స్వేచ్చ ఉన్నా సంతోషాన్ని ఆస్వాదించ లేని, ఆనందాన్ని రుచి చూడలేని జీవితం శూన్యం. జీవన ప్రయాణంలో కుటుంబం వ్యవస్థ అనేది ప్రధానమైనది, మనిషి మనుగడకు ఆధారమైనది.LIFE STYLE-HUMAN RELATIONSHIPS{#}Santosham;Wife"తెగే దాకా లాగితే"... బంధాలైనా తెగక మానవు ?"తెగే దాకా లాగితే"... బంధాలైనా తెగక మానవు ?LIFE STYLE-HUMAN RELATIONSHIPS{#}Santosham;WifeMon, 04 Oct 2021 12:00:00 GMTమనిషి ఎంత సంపాదించినా, ఏమి సాధించినా ఆనందానికి మించిన విజయం మరొకటి ఉండదు. భోగ భాగ్యాలతో తులతూగే జీవితం ఉన్నా, మనసుకు నచ్చినట్టు బ్రతికే స్వేచ్చ ఉన్నా సంతోషాన్ని ఆస్వాదించ లేని, ఆనందాన్ని రుచి చూడలేని జీవితం శూన్యం. జీవన ప్రయాణంలో కుటుంబం వ్యవస్థ అనేది ప్రధానమైనది, మనిషి మనుగడకు ఆధారమైనది. అయితే కుటుంబాన్ని నడిపే భార్య , భర్తలు ఇద్దరికీ హక్కులు, భాద్యతలు వుంటాయి. అలా వారు జీవనం కొనసాగిస్తున్న సమయంలో ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఊహించని పరిణామాలు చోటు చేసుకోవచ్చు. కానీ ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా అన్నిటినీ తట్టుకుని ఒకరికొకరు దైర్యం చెప్పుకుంటూ, ఒకరినొకరు అర్థం చేసుకుంటూ, ఒకరికొకరు తోడుగా ముందుకు సాగాలి.

అపుడే వారి దాంపత్యం మరింత బలపడుతుంది..అలాగే వారి కుటుంబం కూడా పదిలంగా ఉంటుంది. అలా కాకుండా నువ్వెంత అంటే నువ్వెంత అనుకుంటూ ఒకరి తప్పులను మరొకరు ఎత్తి చూపుతూ...ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కయ్యానికి కాలు దువ్వితే చివరికి వారి మధ్య సంతోషం కరువవుతుంది వారి బంధం భారమవుతుంది. తెగే వరకు లాగితే దారమే కాదు బంధమైనా సరే తెగక మానదు.  ఇద్దరిలో ఒకరైన సర్దుకుపోవాలి, ఎక్కడో ఒకచోట తగ్గి వారి బంధాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం చేయాలి. లేదంటే అప్పటి వరకు ఒకటిగా ఉన్న వారి జీవితం రెండుగా విడిపోతుంది..నిజమైన సంతోషం ఆవిరవుతుంది.

డబ్బు, స్టేటస్ లు విలాసవంతమైన జీవితాన్ని , సౌకర్యవంతమైన జీవితాన్ని ఇస్తాయేమో, కానీ బంధాలు అసలైన సంతోషాలను మనకి ఇస్తాయి. ఆ బంధాలను చివరివరకూ నిలుపుకోవడమే అసలైన విజయం అన్నారు పెద్దలు. విషయం ఏదైనా కలసి ఎదుర్కోవాలి, సామరస్యంగా సమస్యను పరిష్కరించుకోవాలి. అంతే కానీ సమస్యను మీ మాటలతో చేతలతో మరింత క్లిష్టతరం చేసుకుని సరిదిద్దుకో లేని సమస్యలు కొని తెచ్చుకోకూడదు. అవి మీ జీవితంలో సంతోషాలను పూర్తిగా లాక్కునే అవకాసం ఉంది.



స్ట్రాటజీ మారుస్తున్న పవన్.. వాళ్ళని తిప్పేస్తారు?

వకీల్ సాబ్ హీరోయిన్ కు పిలిచి అవకాశం ఇచ్చిన కుర్ర హీరో?

నిరుద్యోగులకు రిక్రూట్‌మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్న CRPF...

'సిటీ ఆన్ వాటర్'... అన్నీ నీటిపైనే !

రాజ‌మౌళిపై చిరంజీవి ఇంత అస‌హ‌నంతో ఉన్నారా... !

బోన‌స్ గా 78 రోజుల వేత‌నం

విదేశాల్లో ఉన్నా స‌రే.. వ‌దిలిపెట్టొద్దు..?

గుమ్మడికాయ గింజలను తింటున్నారా ? జాగ్రత్త !

డ్ర‌గ్స్ వెన‌క అదానీ ఉన్నారా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>