PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi188fcb12-0774-4ecf-9ce3-d286579491c9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/modi188fcb12-0774-4ecf-9ce3-d286579491c9-415x250-IndiaHerald.jpgకుల రాజకీయాలకు పెట్టింది పేరు ఉత్తర భారతం. ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో యాదవ కులం పెత్తనం కొనసాగుతోంది. ఇంకా చెప్పాలంటే... బీహార్‌లో కులాధిపత్యం బలంగానే ఉంటుంది. ఇప్పుడు అదే కుల రాజకీయం బీహార్‌లో అధికారంలో ఉన్న నితీశ్ కుమార్ పార్టీని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌కు దూరం చేసేలా ఉంది. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన కులగణన అంశం ఇప్పుడు నితీష్ సర్కారుకు ఆగ్రహం తెప్పిస్తోంది. సుప్రీంకోర్టుకు కుల గణన అంశంపై కేంద్రం తన విధానాన్ని స్పష్టం చేసిన తర్వాత సరిగ్గా మూడు రోజులకుNitish{#}Nitish Kumar;Bihar;Bharatiya Janata Partyబిహార్ క్యాస్ట్ పాలిటిక్స్..!బిహార్ క్యాస్ట్ పాలిటిక్స్..!Nitish{#}Nitish Kumar;Bihar;Bharatiya Janata PartyMon, 27 Sep 2021 15:51:32 GMTకుల రాజకీయాలకు పెట్టింది పేరు ఉత్తర భారతం. ప్రధానంగా బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో యాదవ కులం పెత్తనం కొనసాగుతోంది. ఇంకా చెప్పాలంటే... బీహార్‌లో కులాధిపత్యం బలంగానే ఉంటుంది. ఇప్పుడు అదే కుల రాజకీయం బీహార్‌లో అధికారంలో ఉన్న నితీశ్ కుమార్ పార్టీని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌కు దూరం చేసేలా ఉంది. కేంద్రం కొత్తగా తీసుకువచ్చిన కులగణన అంశం ఇప్పుడు నితీష్ సర్కారుకు ఆగ్రహం తెప్పిస్తోంది. సుప్రీంకోర్టుకు కుల గణన అంశంపై కేంద్రం తన విధానాన్ని స్పష్టం చేసిన తర్వాత సరిగ్గా మూడు రోజులకు బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన కామెంట్స్ చేశారు. అసలు కులగణన అంశాన్ని కేంద్రం మరోసారి పరిశీలించాలని... లేదంటే తీవ్ర పరిణామాలు తప్పవన్నారు నితీష్ కుమార్.

ప్రస్తుతం బీహార్ రాష్ట్రంలో ఒకటే అంశం తీవ్ర సంచనలంగా మారింది. కులగణన జరిగి తీరాల్సిందే అనే అంశం ప్రస్తుతం తీవ్ర చర్చకు దారి తీస్తోంది. అయితే ఈ అంశంపై కేంద్రం చెప్పిన సమాధానం విమర్శలకు తావిస్తోంది. కులగణన ఇప్పట్లో సాధ్యం కాదని కేంద్రం తేల్చి చెప్పింది. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకు కూడా వెల్లడించింది. అసలు బీహార్‌లో ప్రస్తుతం కులగణన ప్రారంభిస్తే... అది ఇతర రాష్ట్రాల్లో కూడా ప్రభావం చూపే అవకాశం ఉందనేది కేంద్రం ఆలోచన. ఇప్పుడు కులగణన ప్రారంభిస్తే.. దాని ప్రభావం ఇతర రాష్ట్రాల్లో రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుందనేది బీజేపీ భయం. దీంతో కులగణన సాధ్యం కాదని తేల్చేసింది. అయిత నితీష్ మాత్రం ఇప్పుడే చేపట్టాలని స్పష్టమైన వార్నింగ్ ఇచ్చేశారు. ఇప్పటికే ఈ అంశంపై అసెంబ్లీలో రెండు సార్లు తీర్మానం కూడా చేశారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినా కూడా... కేంద్రం నిర్లక్ష్యం చేస్తోందన్నారు నితీష్. ఇదే విషయంపై ఇప్పుడు  న్యాయ పోరాటం కూడా చేస్తామంటున్నారు బీహార్ సీఎం.





మోడీకి దూరం జ‌రుగుతున్న జ‌గ‌న్‌?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!

అ మంత్రిది వ్యభిచార శాఖ, ఆ స్పాలో వ్యభిచారం: జనసేన నేత సంచలనం

బిగ్ బాస్ - 5 : లహరి ఎలిమినేషన్ కి అసలు కారణాలు ఇవే..!!

బిగ్ బాస్ - 5 : సిరి విషయంలో షణ్ముక్ చేసిన మిస్టేక్ అదే..!!

ప‌వ‌న్‌క‌ల్యాణ్ చెప్పింది అర్థం కాలేదా?

ఆ ఘనతను సాధించిన ఏకైక హీరోగా ఎన్టీఆర్..!!

బాబు ప్ర‌పోజ‌ల్‌కు నో చెప్పిన టాప్ లీడ‌ర్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>