MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalpanaraife5ee39c-05e0-4236-b176-438e4b323b76-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/kalpanaraife5ee39c-05e0-4236-b176-438e4b323b76-415x250-IndiaHerald.jpgసినీ పరిశ్రమలో చాలా మంది నటీనటులు తళుక్కుమన్నారు. సినీ ఇండస్ట్రీలో లాభపడిన వాళ్లు ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్లూ ఉన్నారు. వందలకుపైగా సినిమాల్లో నటించి.. చివరకు అంత్యక్రియలకు డబ్బులు కూడా లేని దీనస్థితిలో చాలా మంది లోకాన్నే విడిచి వెళ్లారు. డబ్బులున్న నటీనటులకు సినీ పరిశ్రమలో పలుకుబడి ఉంటుంది.Kalpanarai{#}savitri;Syamala;Savithri;Cinemaనటి కల్పనా రాయ్ పరిస్థితి దారుణం.. అంత్యక్రియలప్పుడు..!నటి కల్పనా రాయ్ పరిస్థితి దారుణం.. అంత్యక్రియలప్పుడు..!Kalpanarai{#}savitri;Syamala;Savithri;CinemaMon, 27 Sep 2021 19:37:37 GMTసినీ పరిశ్రమలో చాలా మంది నటీనటులు తళుక్కుమన్నారు. సినీ ఇండస్ట్రీలో లాభపడిన వాళ్లు ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న వాళ్లూ ఉన్నారు. వందలకుపైగా సినిమాల్లో నటించి.. చివరకు అంత్యక్రియలకు డబ్బులు కూడా లేని దీనస్థితిలో చాలా మంది లోకాన్నే విడిచి వెళ్లారు. డబ్బులున్న నటీనటులకు సినీ పరిశ్రమలో పలుకుబడి ఉంటుంది. ఈ రంగుల ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదు. ఎంతో మంది నటీనటులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలిసిందే.


మహానటి సావిత్రి కూడా సినీరంగంలో ఒక మెళుకు మెరిసింది. చివరకు ఎవరూ లేని అనాథగా లోకాన్ని విడిచి వెళ్లింది. అంతటి మహానటికే కష్టాలు తప్పలేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఇలా ఆర్థికంగా ఇబ్బందులు పడి.. చివరికి ప్రాణాలు కోల్పోయిన వారిలో నటి కల్పనా రాయ్ కూడా ఒకరు. హాస్యనటిగా, ఆర్టిస్టుగా ఎన్నో సినిమాల్లో నటించారు. డబ్బులు తీసుకోకుండానే చాలా సినిమాల్లో నటించారు. సంపాదించిన డబ్బును కూడా ఖర్చు చేసేసేవారు. చివరకు అనారోగ్యం బారినపడినప్పుడు ఆస్పత్రి ఖర్చులకు, మందులను కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. దుర్భరమైన జీవితాన్ని ఆమె గడిపారు.


వయసు పైబడినా.. సినిమా అవకాశాలు తగ్గలేదు. పలు సినిమాల్లో కమెడియన్‌గా నటిస్తూ తనదైన ముద్రను వేసుకున్నారు. అనారోగ్యానికి గురైనప్పుడు దుర్భరమైన జీవితాన్ని గడిపారు కల్పనా రాయ్. అన్ని సినిమాల్లో నటించిన ఆమె తనకు వచ్చిన డబ్బుతో సేవా కార్యక్రమాల్లో ఖర్చు చేశారు. చివరి నిమిషంలో కల్పనా రాయ్‌కు సాయం చేసే వాళ్లే కరువయ్యారు. ఈమె మరణించిన తర్వాత మూవీ ఆర్టిస్టుల అసోసియేషన్ సంఘం అంత్యక్రియల కోసం రూ.10 వేలు ఇచ్చారు. ఈమె లాగే చాలా మంది నటీనటులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ కాలం వెల్లదీస్తున్నారు. మరో నటి పావలా శ్యామలా కూడా ఈ కోవకే చెందిన వారు. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతున్న శ్యామల కూడా ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడింది. చివరకు సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఆమెకు అండగా నిలబడ్డారు.




మ‌హేష్ చేసిన ఆ త‌ప్పును మ‌ళ్లీ కెలికి ట్రోల్ చేస్తున్నారే ?

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>