PoliticsSahithyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/heavy-rain-in-telugu-statesc54fafa8-df6b-4437-8fe6-b0a36b19a793-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/heavy-rain-in-telugu-statesc54fafa8-df6b-4437-8fe6-b0a36b19a793-415x250-IndiaHerald.jpgగులాబ్ తుఫాన్ ఇప్పుడు అధికారులను, ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడటంతో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావాలంటే కంగారు పడుతున్నారు. తుఫాన్ నేపధ్యంలో విద్యుత్ శాఖ కూడా అప్రమత్తం అయింది. విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. రోడ్ల వెంబడి ఉన్న విద్యుత్ పోల్ లను ఎట్టిపరిస్థితుల్లోనూ టచ్ చేయవద్దని ప్రజలను హెచ్చరించారు. నగరాల్లో, పట్టణాల్లో అపార్ట్మెంట్ సెల్లర్ లలోని కరెంట్ మీటర్లలోకి గనap{#}Kaikaluru;Uttarandhra;electricity;police;Varsham;Teluguగులాబ్ దెబ్బ: గుండెల్లో రైళ్ళు అంతే, ప్రజలు తీసుకునే జాగ్రత్తలు ఇవేగులాబ్ దెబ్బ: గుండెల్లో రైళ్ళు అంతే, ప్రజలు తీసుకునే జాగ్రత్తలు ఇవేap{#}Kaikaluru;Uttarandhra;electricity;police;Varsham;TeluguMon, 27 Sep 2021 11:17:40 GMTగులాబ్ తుఫాన్ ఇప్పుడు అధికారులను, ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడటంతో ప్రజలు ఇళ్ళ నుంచి బయటకు రావాలంటే కంగారు పడుతున్నారు. తుఫాన్ నేపధ్యంలో విద్యుత్ శాఖ కూడా అప్రమత్తం అయింది. విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. రోడ్ల వెంబడి ఉన్న విద్యుత్ పోల్ లను ఎట్టిపరిస్థితుల్లోనూ టచ్ చేయవద్దని ప్రజలను హెచ్చరించారు.

నగరాల్లో, పట్టణాల్లో అపార్ట్మెంట్ సెల్లర్ లలోని  కరెంట్ మీటర్లలోకి గనుక నీరు చేరితే సంబంధిత అధికారులకు తెలియజేయాలి అని అధికారులు ఒక ప్రకటన రెండు రాష్ట్రాల్లో విడుదల చేసారు. ఎక్కడైనా తెగిపడిన, వేలాడుతున్న విద్యుత్ వైర్లు ఉంటే విద్యుత్ అధికారులకు తెలియజేయాలి అని సూచించారు. ట్రాన్స్ఫార్మర్స్, బోర్ మోటర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకవద్దు అని రైతులకు విజ్ఞప్తి చేసారు అధికారులు. సిబ్బంది, అధికారులు అందరూ తగిన జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండాలి అని స్పష్టం చేసారు.

ఏపీలో కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా మారింది. కృష్ణాజిల్లా కైకలూరు మండలం ఆటపాక వద్ద తుఫాను ప్రభావంతో గత రాత్రి నుండి కురుస్తున్న వర్షాలు వల్ల జాతీయ రహదారిపై విరిగిపడ్డ చెట్టు ప్రజలను ఇబ్బంది పెడుతుంది.  కైకలూరు - ఆకివీడు మధ్య రాకపోకలు నిలిచాయని అధికారులు పేర్కొన్నారు... స్థానికులు ఇచ్చిన సమాచారంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టిన పట్టణ పోలీసు సిబ్బంది... చెట్టుని తొలగించారు. స్థానికులు సహాయం తో చెట్టును తొలగించిన  పట్టణ  ఎస్.ఐ షణ్ముఖసాయి మరియు సిబ్బంది... ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పోలీసులు  జోరు వర్షం లోను చేపట్టిన చర్యలతో ప్రజలు మళ్ళీ జాతీయ రహదారి వైపు వస్తున్నారు. ఉత్తరాంధ్ర లో కూడా పరిస్థితి చాలా దారుణంగా ఉందని తీరం వెంట పరిస్థితి దారుణంగా ఉందని చెప్తున్నారు.



హోంమంత్రి అమిత్ షా: మావోయిస్టులకు నిధులు అందకుండా చూడండి..!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!

అ మంత్రిది వ్యభిచార శాఖ, ఆ స్పాలో వ్యభిచారం: జనసేన నేత సంచలనం

బిగ్ బాస్ - 5 : లహరి ఎలిమినేషన్ కి అసలు కారణాలు ఇవే..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Sahithya]]>