PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chinarealestate-5caac5fc-8624-4c62-991c-3d98f6fcb0f9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chinarealestate-5caac5fc-8624-4c62-991c-3d98f6fcb0f9-415x250-IndiaHerald.jpgచైనా ఆర్థిక వ్యవస్థ నిజంగా బాగానే ఉందా ఊరికే మేకపోతు గాంబీర్యం ప్రకటిస్తూ ఉందా.. అనే అనుమానాలు వస్తున్నాయి. అక్కడ బడా సంస్థ ఎవర్ గ్రాండ్ పరిస్థితి చూడబోతే అంతే ఉంది. ఎన్నో రంగాలలో అడుగుపెట్టిన ఈ సంస్థ ఇప్పటికే అనేక బ్యాంకులు, ఆర్థిక వ్యవస్థల నుండి భారీగా అప్పులు చేసింది. కొత్త కాంట్రాక్టులు తెచ్చుకుంది. కానీ అవేమి పూర్తిచేయలేక చతికిలపడింది. దీనితో అటు అప్పులు కట్టలేక, ఇటు ఆస్తులను కూడగట్టుకోలేక చేతులెత్తేయడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్ పై పడుతుంది. దానిని నమ్ముకొనిchinarealestate{#}vegetable market;Coronavirus;Car;American Samoa;Indiaచైనాలో ఆర్థిక వ్యవస్థ.. చితికిపోయినట్టేనా.. !చైనాలో ఆర్థిక వ్యవస్థ.. చితికిపోయినట్టేనా.. !chinarealestate{#}vegetable market;Coronavirus;Car;American Samoa;IndiaMon, 27 Sep 2021 21:08:00 GMT
ఈ ప్రభావం ప్రపంచ మార్కెట్ పై పడుతుంది. దానిని నమ్ముకొని పెట్టుబడి పెట్టిన వాళ్ళు బిక్షగాళ్లు అయి పోతున్నారు. భారత్ సహా పలు దేశాలు ఈ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఉన్నారు. దీని ప్రధాన విభాగం రియల్ ఎస్టేట్. ఇప్పటికే కరోనా సంక్షోభంతో ప్రపంచం అల్లాడిపోతుంటే ఇది మరొకటి అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే భారత్ లో ఈ ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు అంటున్నారు. ఒకప్పటి అమెరికా సంస్థ లెమన్ బ్రదర్స్ సంక్షోభం తరువాత ఇదే అతిపెద్ద సంక్షోభం కాబోతోందని ఆర్థిక వేత్తలు అంటునాన్రు.

ఇప్పటికే ఆ సంస్థ కట్టించి ఇస్తామన్న ఇళ్ళు ఇక అయ్యే దారే కనిపించకపోవడంతో వినియోగదారులు సంస్థ కార్యాలయం వద్దకు భారీగా చేరి  ఆందోళన చేపడుతున్నారు.  ఈ సంస్థ ఆయా బ్యాంకులకు 30వేల కోట్ల డాలర్ల మేరకు చెల్లించాల్సి ఉంది. ఈ సంస్థ చైనాలోనే అతిపెద్దది. దాదాపు 280 నగరాలలో సంస్థ 1300 ప్రాజెక్టులు ప్రారంభించింది. దేశంలోనే రెండు శాతం వాటా ఈ సంస్థ సొంతం. ఇక ఈ సంస్థ రియల్ ఎస్టేట్ సహా ఎలక్ట్రిక్ కార్ యూనిట్, టూరిజం, డిజిటల్ ఆపరేషన్స్, ఇన్సూరెన్స్, ఆరోగ్యం వంటి పలు రంగాలలో ప్రవేశించింది.  ఆయా ప్రోజెక్టుల ప్రకారం దాదాపు 15 లక్షల మందికి ఇళ్లు నిర్మించి ఇవ్వాల్సి ఉంది. వారందరు ముందస్తు చెల్లింపులు చేసినవారే. ఇక ఇళ్లు కట్టడం తరువాత సంగతి, కనీసం సంస్థలో పనిచేస్తున్న రెండు లక్షల మందికి జీతాలు చెల్లించే స్థితిలో కూడా లేరు.

ఈ సంక్షోభంతో చైనాలో లక్ష కోట్ల డాలర్ల మేర ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. చైనా లో కేవలం రియల్ ఎస్టేట్ 29 శాతం జీడీపీ ని సమకూరుస్తుంది. ఇంత కీలకమైన రంగం కొన్నాళ్లుగా కుదేలు అయిపోతుంది. దీనితో ఎవర్ గ్రాండ్ సంస్థ కూలిపోవాల్సి వచ్చింది. ఇప్పటికే అక్కడ 20 శాతం ఇళ్ల విక్రయాలు తగ్గిపోగా, ఖాళీగా 6.5 కోట్ల ప్రాపెర్టీలు ఉన్నట్టు తెలుస్తుంది.  చైనా ఆర్థిక వ్యవస్థ చితికిపోతుంది కాబట్టే భారత్ కూడా తగలబడిపోవాలని, ఉన్నది ఖర్చుపెట్టి ఆఫ్ఘన్ ను తాలిబన్ చేతిలో పెట్టిందనే అనుమానాలు కూడా వ్యతకు చేస్తున్నారు నిపుణులు.


కూకట్పల్లి హత్య కేసులో కొత్త ట్విస్ట్..తెలిస్తే షాకవుతారు..?

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>