PoliticsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bhavanipur2050af47-bafd-4006-9c8b-9a39b9b87cde-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bhavanipur2050af47-bafd-4006-9c8b-9a39b9b87cde-415x250-IndiaHerald.jpgపశ్చిమ బెంగాల్... ఏ ఎన్నిక జరిగినా ఒకటేలా ఉంటున్నాయి అక్కడ పరిస్థితులు. మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీకి మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా పోరు నడిచింది. ప్రచారం దగ్గర నుంచి కౌంటింగ్ పూర్తైన తర్వాత కూడా రెండు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా బీజేపీ నేతలపై టీఎంసీ కార్యకర్తలు జరిపిన దాడుల్లో దాదాపు పది మంది మృతి చెందారంటూ కమలం పార్టీ నేతలు జాతీయ స్థాయిలో ఉద్Bhavanipur{#}dileep;Supreme Court;Election Commission;Mamta Mohandas;central government;Telangana Chief Minister;dilip;West Bengal - Kolkata;Assembly;Bharatiya Janata Party;Congress;Government;Partyబెంగాల్ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత..!బెంగాల్ ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత..!Bhavanipur{#}dileep;Supreme Court;Election Commission;Mamta Mohandas;central government;Telangana Chief Minister;dilip;West Bengal - Kolkata;Assembly;Bharatiya Janata Party;Congress;Government;PartyMon, 27 Sep 2021 16:28:48 GMTపశ్చిమ బెంగాల్... ఏ ఎన్నిక జరిగినా ఒకటేలా ఉంటున్నాయి అక్కడ పరిస్థితులు. మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీకి మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్లుగా పోరు నడిచింది. ప్రచారం దగ్గర నుంచి కౌంటింగ్ పూర్తైన తర్వాత కూడా రెండు పార్టీల నేతలు, కార్యకర్తల మధ్య దాడులు, ప్రతిదాడులు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత కూడా బీజేపీ నేతలపై టీఎంసీ కార్యకర్తలు జరిపిన దాడుల్లో దాదాపు పది మంది మృతి చెందారంటూ కమలం పార్టీ నేతలు జాతీయ స్థాయిలో ఉద్యమాలు కూడా జరిపారు. ఇప్పుడు 5 నెలల తర్వాత కూడా పశ్చిమ బెంగాల్‌లో ఇదే సీన్ రిపీట్ అవుతోంది. నందిగ్రామ్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... భారతీయ జనతా పార్టీ నేత సువేందు అధికారి చేతిలో 18 వందల ఓట్ల తేడాతో ఓడారు. అయినా సరే శాసనసభాపక్ష సమావేశంలో దీదీనే సీఎంగా ఎన్నికయ్యారు.

రూల్స్ ప్రకారం ఆరు నెలల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసిన గెలిచి... ఎమ్మెల్యేగా ఎన్నికైతేనే మమతా బెనర్జీ బెంగాల్ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. లేదంటే లేనట్లే. ప్రస్తుతం బెంగాల్‌లో నాలుగు నియోజకవర్గాలకు ఉప ఎన్నికలకు జరుగుతున్నాయి. అయినా సరే అందరి ఫోకస్ మాత్రం భవానీపూర్ నియోజకవర్గంపైనే ఉంది. ఎందుకంటే అక్కడ నుంచే దీదీ పోటీ చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గంపైన స్పెషల్ ఫోకస్ పెట్టిన కమలం పార్టీ పెద్దలు... దీదీపై సుప్రీం కోర్టు న్యాయవాది ప్రియాంకను పోటీలో నిలిపారు. మరో మూడు రోజుల్లో పోలింగ్ జరగనుండగా... ప్రచారం చివరి దశకు చేరుకుంది. భవానీపుర్‌లో బీజేపీ నాయకుడు దిలీప్ ఘోష్‌పై అధికార పార్టీ నేతలు దాడి చేశారంటూ ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. భవానీపూర్‌లో ప్రచారం చేసుకుంటున్న ఇరు పార్టీల కార్యకర్తలు పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో తుపాకులతో దాడి చేశారని బీజేపీ నేతల దిలీప్ ఘోష్‌పై టీఎంసీ నేతలు ఫిర్యాదు చేశారు. పరస్పర దాడులతో ప్రస్తుతం భవనీపూర్ నియోజకవర్గంలో ఏం జరుగుతుందో అని ఓటర్లు భయపడుతున్నారు. ఇప్పటికే ఈసీ పెద్ద ఎత్తున కేంద్ర బలగాలను మోహరించింది ఎన్నికల కమిషన్.





కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

హోంమంత్రి అమిత్ షా: మావోయిస్టులకు నిధులు అందకుండా చూడండి..!

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>