PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababube713025-5912-405f-952f-2b00b01a2931-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababube713025-5912-405f-952f-2b00b01a2931-415x250-IndiaHerald.jpgటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక విమర్శలు చేసారు. గులాబ్ తుఫానుతో నష్టపోయిన రైతులను, నిరాశ్రయులైన ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి అని అన్నారు ఆయన. లోతట్టు ప్రాంతాల ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి అన్ని విధాల అండగా నిలబడాలి అని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని జగన్ రెడ్డి సంక్షోభంలోకి నెట్టారు అని మండిపడ్డారు. రైతు సమస్యలపై చేపట్టిన భారత్ బంద్ కు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది అని ఆయన చెప్పుకొచ్చారు. పార్లమెంట్ లో వ్యవసాయ చట్టcbn{#}CBN;Jagan;Vijayawada;Parliment;Hindupuram;Drugs;June;Nijam;TDP;Government;electricity;central government;Indiaమరో 29 వేల కోట్ల అప్పుకు ఏపీ రెడీ...?మరో 29 వేల కోట్ల అప్పుకు ఏపీ రెడీ...?cbn{#}CBN;Jagan;Vijayawada;Parliment;Hindupuram;Drugs;June;Nijam;TDP;Government;electricity;central government;IndiaMon, 27 Sep 2021 17:50:07 GMTటీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కీలక విమర్శలు చేసారు. గులాబ్ తుఫానుతో నష్టపోయిన రైతులను, నిరాశ్రయులైన ప్రజలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలి అని అన్నారు ఆయన. లోతట్టు ప్రాంతాల ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసి అన్ని విధాల అండగా నిలబడాలి అని కోరారు. రాష్ట్రంలో వ్యవసాయరంగాన్ని జగన్ రెడ్డి సంక్షోభంలోకి నెట్టారు అని మండిపడ్డారు. రైతు సమస్యలపై చేపట్టిన భారత్ బంద్ కు టీడీపీ సంపూర్ణ మద్దతు తెలిపింది అని ఆయన చెప్పుకొచ్చారు.

పార్లమెంట్ లో వ్యవసాయ చట్టాలకు మద్దతిచ్చిన జగన్ రెడ్డి.. నేడు బంద్ కు మద్దతివ్వడం ద్వంద్వ వైఖరికి నిదర్శనం అన్నారు చంద్రబాబు. సాగునీటి ప్రాజెక్టుల విషయంలో రాయలసీమకు జగన్ రెడ్డి చేస్తున్న ద్రోహంపై 6-10-21వ తేదీన హిందూపూర్ లో సమావేశం జరగుతుందని వివరించారు. రాయలసీమలో 15 లక్షల ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతింది అని తెలిపారు. పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ ద్వారా రూ.29వేల కోట్లు అప్పు కోసం ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. మరో రూ.11వేల కోట్లు విద్యుత్ ఛార్జీలు పెంచారు అని ఆరోపణలు చేసారు. రెండేళ్లలో రూ.36 వేల కోట్లు విద్యుత్ భారాలు మోపారు అని అన్నారు చంద్రబాబు.

కమీషన్ కోసం అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయడం వల్లే విద్యుత్ ఛార్జీలు పెంచారు అని ఆయన వ్యాఖ్యలు చేసారు.     విద్యుత్ బిల్లుల్లో ట్రూఅప్ ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకుంటున్నారు అని మండిపడ్డారు.     డ్రగ్స్ అక్రమ రవాణ విషయంలో డీజీపీ వాస్తవాలను దాచిపెడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. ఆషి ట్రేడింగ్ కంపెనీ చిరునామాకు మాత్రమే విజయవాడ ఉందని, వారి కార్యకలాపాలు ఇసుమంతైనా ఆంధ్రాలో లేవని డీజీపీ ఎలా చెబుతారు? అని నిలదీశారు. ఆషీ కంపెనీ జూన్ వరకు 9 సార్లు జీఎస్టీ రిటర్న్స్ ఫైల్ చేసింది నిజం కాదా? అంటూ ప్రశ్నించారు. కేంద్ర డైరక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటిలిజెన్స్ ఆంధ్ర సరిహద్దు రాష్ట్రాలను అప్రమత్తం ఎందుకు చేశారు? అని ఆయన నిలదీశారు.



ప్రభుత్వ అధికారులకు సీజేఐ వార్నింగ్..!

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>