HealthVimalathaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/gas-06601b5e-af16-4ba7-9952-7abb8ac00d96-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/gas-06601b5e-af16-4ba7-9952-7abb8ac00d96-415x250-IndiaHerald.jpgచాలా మందికి గ్యాస్ సమస్య సాధారణమే. దీనివల్ల కడుపులో నొప్పి, గుండెలో మంట రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పొట్టలోని గ్యాస్‌ని వదిలించుకోవడానికి కొన్నిహోం రెమెడీలను ప్రయత్నించవచ్చు. పొట్టలో గ్యాస్ సమస్యను తగ్గించుకోవడానికి 7 సులభమైన వంటింటి చిట్కాలు మీ కోసం. మజ్జిగ మజ్జిగను ఆయుర్వేద నిపుణులు సాత్విక ఆహారం అంటారు. గ్యాస్ ప్రాబ్లెమ్ అనిపిస్తే ఒక గ్లాసు మజ్జిగను తాగి ప్రయత్నించండి. మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ ఆమ్లతను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఈ మజ్జిగకు నల్ల మిరియాలు లేదా Gas;{#}thulasi;Rajma;Tulasi;cumin;Ayurveda;Acidity;Buttermilk;Cinnamon;Banana;Masalaగ్యాస్ సమస్యను చిటికెలో పోగొట్టే వంటింటి చిట్కాలుగ్యాస్ సమస్యను చిటికెలో పోగొట్టే వంటింటి చిట్కాలుGas;{#}thulasi;Rajma;Tulasi;cumin;Ayurveda;Acidity;Buttermilk;Cinnamon;Banana;MasalaSun, 26 Sep 2021 18:00:00 GMTచాలా మందికి గ్యాస్ సమస్య సాధారణమే. దీనివల్ల కడుపులో నొప్పి, గుండెలో మంట రావడం వంటి సమస్యలు ఎదురవుతాయి. పొట్టలోని గ్యాస్‌ని వదిలించుకోవడానికి కొన్నిహోం రెమెడీలను ప్రయత్నించవచ్చు. పొట్టలో గ్యాస్ సమస్యను తగ్గించుకోవడానికి 7 సులభమైన వంటింటి చిట్కాలు మీ కోసం.

మజ్జిగ
మజ్జిగను ఆయుర్వేద నిపుణులు సాత్విక ఆహారం అంటారు. గ్యాస్ ప్రాబ్లెమ్ అనిపిస్తే ఒక గ్లాసు మజ్జిగను తాగి ప్రయత్నించండి. మజ్జిగలో లాక్టిక్ ఆమ్లం ఉంటుంది. ఇది గ్యాస్ట్రిక్ ఆమ్లతను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. ఈ మజ్జిగకు నల్ల మిరియాలు లేదా కొంచం కొత్తిమీరను మజ్జిగకు చేర్చుకోవచ్చు.

లవంగాలు
లవంగం కార్మినేటివ్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. ఇది జీర్ణశయాంతర ప్రేగులలో గ్యాస్ పెరుగుదలను నిరోధిస్తుంది. కడుపులో అసౌకర్యాన్ని తగ్గిస్తుంది. రాజ్మా లేదా బ్లాక్ గ్రామ్ వంటి వాటితో వంట చేసేటప్పుడు లవంగాలను వాడితే గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం పొందొచ్చు.

జీలకర్ర
జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో జీలకర్ర సహాయపడుతుంది. తిన్న తర్వాత వేయించిన జీలకర్ర పొడిని ఒక గ్లాసు నీటిలో వేసి తాగొచ్చు. లేదంటే ఒక టీస్పూన్ జీలకర్రను ఒక గ్లాసు వేడి నీటితో కలిపి త్రాగవచ్చు.

ఆపిల్ సైడర్ వెనిగర్
అసిడిటీ నుంచి ఉపశమనం పొందడానికి రెండు టేబుల్ స్పూన్ల ఫిల్టర్ చేయని యాపిల్ సైడర్ వెనిగర్ ఒక గ్లాసు నీటిలో రోజుకు ఒకటి లేదా రెండుసార్లు తాగండి.

అరటి
అరటి పండులో సహజ యాంటాసిడ్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి యాసిడ్ రిఫ్లక్స్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. అసిడిటీని తగ్గించడానికి ఇది బెస్ట్ హోం రెమెడీ. గ్యాస్ నొప్పిని నివారించడానికి మీరు ప్రతిరోజూ ఒక అరటిపండు తినవచ్చు.

దాల్చిన చెక్క
మసాలా సహజ యాంటాసిడ్‌గా పని చేస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. జీర్ణశయాంతర ప్రేగులలో ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి దాల్చిన చెక్క టీని తీసుకోండి. దాల్చిన చెక్క ఆరోగ్యానికి పోషక శక్తిని అందిస్తుంది.

తులసి ఆకులు
తులసి ఆకులు అసిడిటీ నుండి తక్షణ ఉపశమనాన్ని అంఅందిస్తాయి. గ్యాస్ అనిపించినప్పుడు కొన్ని తులసి ఆకులను తినండి లేదా 3-4 తులసి ఆకులను ఒక గ్లాసు నీటిలో కొన్ని నిమిషాలు ఉడకబెట్టండి. మీరు దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవచ్చు.




టార్గెట్ జగన్: పవన్ కొత్త బొమ్మ..బాబు క్యారెక్టర్ ఏంటి?

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vimalatha]]>