LifeStyleChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimes-6d047f7d-1194-4d97-9b99-645adac5226e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/crime/135/crimes-6d047f7d-1194-4d97-9b99-645adac5226e-415x250-IndiaHerald.jpgరానురాను ప్రేమ పెళ్లిళ్లు పెరుగుతున్నాయి. పెద్దలను ఎదిరించి పారిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా ఘననీయంగా పెరుగుతూనే ఉంది. అలాగే పరువుకోసం పెద్దలు కూడా వారిని వెతికి వెంటాడి మరి హతమార్చడం కూడా ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. చట్టానికి భయపడకుండా ఇలాంటి హత్యలు నడిరోడ్డుపైనే జరుగుతున్నాయి. చాలా సార్లు ఈ సందర్భాలలో అద్దె కత్తులు సాయం చేస్తుంటాయి. పెద్దలు మాత్రం తెర వెనుక కధ నడిపిస్తుంటారు. ఇలాంటివి జరిగే కొద్దీ ప్రేమ పక్షులు ఇళ్లల్లో చెప్పడానికి ఇంకా భయపడుతున్నారు, దీనితో పోలీసులను ఆశ్రయిస్తున్నారుhonorkilling;{#}marriage;CBI;court;prema;Love;local languageపరువుహత్య.. 12మందికి యావజ్జివం..పరువుహత్య.. 12మందికి యావజ్జివం..honorkilling;{#}marriage;CBI;court;prema;Love;local languageSat, 25 Sep 2021 12:01:28 GMTరానురాను ప్రేమ పెళ్లిళ్లు పెరుగుతున్నాయి. పెద్దలను ఎదిరించి పారిపోయి పెళ్లి చేసుకునే వాళ్ళ సంఖ్య కూడా ఘననీయంగా పెరుగుతూనే ఉంది. అలాగే పరువుకోసం పెద్దలు కూడా వారిని వెతికి వెంటాడి మరి హతమార్చడం కూడా ఇటీవల ఎక్కువగా చూస్తున్నాం. చట్టానికి భయపడకుండా ఇలాంటి హత్యలు నడిరోడ్డుపైనే జరుగుతున్నాయి. చాలా సార్లు ఈ సందర్భాలలో అద్దె కత్తులు సాయం చేస్తుంటాయి. పెద్దలు మాత్రం తెర వెనుక కధ నడిపిస్తుంటారు. ఇలాంటివి జరిగే కొద్దీ ప్రేమ పక్షులు ఇళ్లల్లో చెప్పడానికి ఇంకా భయపడుతున్నారు, దీనితో పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అయినప్పటికీ వాళ్ళు మాత్రం ఎంతకాలం కాపాడుకుంటూ కూర్చుంటారు, ఒంటరిగా దొరికిన జంటలను పెద్దలు స్కెచ్ వేసి మరి వేసేస్తున్నారు.

ఈ కేసులలో ఎవరి ఆలోచనలు వారికి ఉంటాయి. పెద్దలు పరువు ప్రతిష్టలు అంటారు, పిల్లలు ప్రేమ నమ్మకం స్వతంత్రం లాంటివి పరిగణలోకి తీసుకుంటున్నారు. డబ్బు వెదజల్లడం వలన ఈ కేసులలో అధికారులు కూడా చొరబడుతున్నారు. కేసులను తారుమారు చేయడానికి వారి మద్దతు అవసరం కూడా. తాజాగా తమిళనాడులో జరిగిన ఒక పరువు హత్యలో అక్కడి కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ హత్యలో పాల్గొన్న దాదాపు 12 మందికి కఠిన కారాగార శిక్ష విధించింది. ఇందులో రెండు వైపులా కుటుంబాలు సహా రిటైర్డ్ డీఎస్పీ, ఇన్స్పెక్టర్ లకు శిక్షలు విధించింది న్యాయస్థానం.

వివరాలలోకి వెళితే తమిళనాడులోని రెండు సామజిక వర్గాలకు చెందిన జంట ప్రేమలో పడింది. కానీ వారి కులాలు వేరు కాబట్టి పెద్దలు ఒప్పుకోరు అని అర్ధం అయ్యింది. ఇళ్లు విడిచి వెళ్లారు, రిజిస్టర్ కార్యాలయంలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయం పెద్దలకు తెలియకుండా కొన్నాళ్ళు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉన్నారు. ఎక్కువ కాలం ఇలా ఉండలేమని బయటకు వెళ్ళిపోయి కొత్త జీవితం మొదలుపెట్టాలి అని భావించారు. తాత్కాలికంగా తెలిసిన వారి ఇంట్లో ఉంటున్నారు. పిల్లలు వెళ్ళిపోయినట్టు పెద్దలు కనిపెట్టారు. వాళ్ళను కనిపెట్టి అంతమొందించాలని రెండు కుటుంబాలు కలిసి ప్రణాళిక వేసుకున్నారు. వాళ్ళను మాయమాటలు చెప్పి ఇంటికి తీసుకువచ్చి సమయం చూసి విషం ఇచ్చి చంపి స్మశానంలో కాల్చేశారు. అన్ని తెలిసినా అధికారులు కూడా మౌనంగా ఉండిపోయారు. కానీ స్థానిక మీడియా కల్పించుకోవడంతో తాత్కాలికంగా కేసు నమోదు చేసినట్టు సీన్ చేశారు. దీనితో కేసు నీరుగారిపోతుందని సిబిఐ కి అప్పగించాలని పట్టు రావడంతో ఆ పని జరిగింది. సిబిఐ 15మందిని దోషులుగా కనిపెట్టింది. దానితో కోర్టు కఠిన శిక్షలు విధించింది.



టీటీడీ విధానాలే ఇత‌ర ఆల‌యాల్లో ప్ర‌వేశ‌పెట్టాలి : సీఎం జ‌గ‌న్‌

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>