LifeStyleChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/unityindiversity-d1d5175d-9af0-46f7-b086-26684c437f63-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/unityindiversity-d1d5175d-9af0-46f7-b086-26684c437f63-415x250-IndiaHerald.jpgభారతదేశానికి ప్రపంచ పటంలో ఒక ఖ్యాతి ఉంది. ఇక్కడ పలు రకాల జాతుల వాళ్ళు కలిసిమెలిసి జీవిస్తున్నందుకే ఆ ఖ్యాతి వచ్చింది. దానినే భిన్నత్వంలో ఏకత్వం అనే అరుదైన లక్షణంగా చెపుతున్నారు. అందుకే ప్రపంచ దేశాల నుండి చాలా మంది భారత్ కు వచ్చి ఇక్కడి విషయాలు నేర్చుకొని తమ జీవితాలలో అనుకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. భారతీయుల సంస్కృతీ, సాంప్రదాయాలు నచ్చి ఇక్కడే ఉండిపోయిన విదేశీయులు కూడా అనేకం ఉన్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకొని చివరి వరకు ఒకరికొకరు తోడుగా ఉంటూ కుటుంబ బాధ్యతలు కలిసి పంచుకుంటూ ఉండే ఇకUnityindiversity;{#}temple;Culture;politics;Indiaభిన్నత్వంలో ఏకత్వం అంటే.. నాలుగు రాళ్లేనా.. !భిన్నత్వంలో ఏకత్వం అంటే.. నాలుగు రాళ్లేనా.. !Unityindiversity;{#}temple;Culture;politics;IndiaSat, 25 Sep 2021 19:05:41 GMTభారతదేశానికి ప్రపంచ పటంలో ఒక ఖ్యాతి ఉంది. ఇక్కడ పలు రకాల జాతుల వాళ్ళు కలిసిమెలిసి జీవిస్తున్నందుకే ఆ ఖ్యాతి వచ్చింది. దానినే భిన్నత్వంలో ఏకత్వం అనే అరుదైన లక్షణంగా చెపుతున్నారు. అందుకే ప్రపంచ దేశాల నుండి చాలా మంది భారత్ కు వచ్చి ఇక్కడి విషయాలు నేర్చుకొని తమ జీవితాలలో అనుకరించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. భారతీయుల సంస్కృతీ, సాంప్రదాయాలు నచ్చి ఇక్కడే ఉండిపోయిన విదేశీయులు కూడా అనేకం ఉన్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లు చేసుకొని చివరి వరకు ఒకరికొకరు తోడుగా ఉంటూ కుటుంబ బాధ్యతలు కలిసి పంచుకుంటూ ఉండే ఇక్కడి కుటుంబ విధానాలు పాశ్చాత్యులకు చాలా నచ్చుతాయి. ఈ ప్రత్యేకతలు ఎన్నో భారత్ లో ఉన్నాయి. వాటిని అనుకరించడానికి ఆయా దేశాల నుండి ఎందరో ఇక్కడకు వస్తుంటారు. ప్రపంచానికి భారత్ ఒక ఆధ్యాత్మిక రాజధానిగా కూడా చెప్తుంటారు.

దేవుడు, పాపం-పుణ్యం; పుట్టుక-మరణం-మరుజన్మ; అనేక జాతులు కలిసి జీవితం గడుపుతుండటం లాంటివి పాశ్చాత్యులను భారత్ వైపు ఆకర్షిస్తున్నాయి. దాదాపు పర్యాటకంలో కూడా వీటి గురించి తెలుసుకోడానికి ఎక్కువ మంది భారత్ వస్తుంటారు. ఇక్కగా కనిపించే ఆలయాలు తదితర నమ్మకాలు కూడా వారిని ఆకర్షిస్తూనే ఉన్నాయి. జీవన విధానంలో నియమనిబంధనలు వంటివి కూడా వాళ్ళు అనుకరిస్తూ ఉంటారు. ఇన్ని ప్రత్యేకతల నడుమ విలువలు లేని రాజకీయాలు కూడా ఉండటం తో ఇవన్నీ కనుమరుగైపోయాయి. అయినా ప్రపంచ పటంలో భారత్ ఖ్యాతి తగ్గటం లేదు. ప్రపంచ శాంతికి పునాదులు కూడా భారత్ లోనే ఉన్నాయి. అందుకే భారత్ ను నిలువరించేందుకు పలు దేశాలు పోటీ పడుతూనే ఉన్నాయి.

రానురాను దేశంలో ఎప్పటి నుండో వస్తున్న విలువలు చేదు అవుతున్నాయి. అందుకే తరువాత తరాలకు సారంలేని జీవన విధానం మాత్రమే మిగిలిపోతుంది. అందరు కుటుంబాలతో కాకుండా ఒంటరిగానే ఉండటానికి ఇష్టపడుతున్నారు. ఇద్దరు భార్యాభర్తలు కూడా కలిసి ఉండటానికి కారణాలు వెతుక్కోవాల్సిన పరిస్థితికి దిగజారిపోయాము. వ్యక్తిగతం అనే గిరి గీసుకొని అందులోనే బ్రతికేస్తున్నాం. అందుకే ఈ తరాల వారికి నాటి సంస్కృతీ, సంప్రదాయాలు, విలువలు, నమ్మకాలు తెలియజేయడం ద్వారానే భవిష్యత్తరాలను ఆరోగ్య కరంగా తీర్చిదిద్దుకోగలం. అప్పుడే ఒక మంచి సంఘం ఏర్పాటు సాధ్యం అవుతుంది. ఇప్పుడు నేరాల ప్రపంచంగా మాత్రమే ఉంది యావత్ సంఘం కూడా. భిన్నత్వంలో ఏకత్వం అంటే అదేదో గులకరాళ్ల లోడు తెచ్చి ఒకచోట పోస్తే ఎలా అయితే కదలకుండా అలాగే ఉంటాయో అలా స్పందన లేకుండా ఒకరికొకరు కరుసుకొని కూర్చున్నా వృధా. అదే రాళ్లను సిమెంట్ తో కలిపి ఒక గృహం నిర్మిస్తే తరాలు అందులో నివాసం ఉండవచ్చు. కొన్ని కుటుంబాలు ఒక చోట ఉంటె దానిని భిన్నత్వంలో ఏకత్వం అనరు. ఆ కుటుంబాలు ఒకరికోసం అందరు, అందరి కోసం ఒకరు బ్రతికితేనే అది భిన్నత్వంలో ఏకత్వం అనిపించుకుంటుంది. దేశ సంస్కృతి ఆ దేశ ప్రజల ను బట్టే ఉంటుంది.



లవ్ స్టొరీని రిజెక్ట్ చేసిన హీరో ఎవరో తెలుసా?

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>