LifeStyleChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/kolletmez-12d72acb-532d-4f8c-8a8c-826693bcdaab-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/kolletmez-12d72acb-532d-4f8c-8a8c-826693bcdaab-415x250-IndiaHerald.jpgలోకంలో కొందరు అన్ని ఉన్నా కూడా కొందరు ఏదో పోగొట్టుకున్నట్టు ఎప్పుడు నిరాశానిస్పృహలతోనే కాలం వృధా చేసుకుంటూ ఉంటారు. మరి కొందరు ఎప్పుడు ఉత్సాహంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ముందడుగులు వేస్తూ నే ఉంటారు. మొదటి వారికి నిరంతరం ఉత్సాహపరిచే వాళ్ళు తోడుగా ఉండాల్సి ఉంటుంది. అది ఎప్పుడూ సాధ్యం కానిపని. తమ లక్ష్యం సాధించడం కోసం పక్క వారిని నాశనం చేసైనా ముందుకు వెళ్తున్నారు కానీ పక్క వాడికి చేయి ఇచ్చి తమతో పాటు తీసుకెళ్ళేవాళ్ళు నేటి సమాజంలో చాలా తక్కువ ఉన్నారు. కనుక ఉన్న జీవితాన్ని అనేక అనుమానాలతో వృధా చేసుకోకుంkolletmez;{#}France;Corn;Music;Yevaru;Manamమ్యూజిక్ లవర్స్.. ఈ 'బొమ్మ' ఆల్బమ్ వినాల్సిందే..మ్యూజిక్ లవర్స్.. ఈ 'బొమ్మ' ఆల్బమ్ వినాల్సిందే..kolletmez;{#}France;Corn;Music;Yevaru;ManamFri, 24 Sep 2021 19:11:39 GMTలోకంలో కొందరు అన్ని ఉన్నా కూడా కొందరు ఏదో పోగొట్టుకున్నట్టు ఎప్పుడు నిరాశానిస్పృహలతోనే కాలం వృధా చేసుకుంటూ ఉంటారు. మరి కొందరు ఎప్పుడు ఉత్సాహంగా జీవితాన్ని ఆస్వాదిస్తూ ముందడుగులు వేస్తూ నే ఉంటారు. మొదటి వారికి నిరంతరం ఉత్సాహపరిచే వాళ్ళు తోడుగా ఉండాల్సి ఉంటుంది. అది ఎప్పుడూ సాధ్యం కానిపని. తమ లక్ష్యం సాధించడం కోసం పక్క వారిని నాశనం చేసైనా ముందుకు వెళ్తున్నారు కానీ పక్క వాడికి చేయి ఇచ్చి తమతో పాటు తీసుకెళ్ళేవాళ్ళు నేటి సమాజంలో చాలా తక్కువ ఉన్నారు. కనుక ఉన్న జీవితాన్ని అనేక అనుమానాలతో వృధా చేసుకోకుండా ప్రతి క్షణాన్ని కూడా ఆస్వాదిస్తూ ముందుకు పోతూ ఉంటేనే ఆ జీవితం అందంగా ఉంటుంది. కొన్ని సార్లు అలాంటివారిని చూసినప్పుడు కూడా మనలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది. అందుకే అప్పుడప్పుడు కాస్త బయటకు వెళ్తూ ఉండాలని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు.

ఎక్కువ మంది ఉత్సాహం లేని వారే మనకు కూడా కనిపిస్తూ ఉంటారు. కానీ వాళ్ళజోలికి పోకుండా మన లోకంలో మన జీవితాన్ని ఎవరు ప్రభావితం చేయకుండా చూసుకుంటూ వయసుతో పనిలేకుండా సంతోషంగా ఉండాలి. ఎప్పుడైనా కాస్త నిస్పృహ కు లోనైతే మనం ఏది చేస్తే ఉత్సాహం వస్తుందో దానిని ఆశ్రయించాలి. తద్వారా మనం ఎక్కడ కూడా ఆగకుండా జీవితంలో ముందుకు పోతూ ఉండవచ్చు. ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోడానికి ఒక బామ్మా గురించి తెలుసుకుందాం. బామ్మా అన్నకదా, అంటే ఆమె వయసు 107 ఉంటుంది. ఈ వయసులో ఎవరైనా ఏమి చేయగలరు అనుకుంటే అక్కడే ఆగిపోయేది ఆమె కూడా, అలా కాకుండా తన ఆసక్తిని చనిపోనీయకుండా కాపాడుకుంటూ ఈ వయసులో పియానో రోజు ప్లే చేస్తూనే ఉంది.

అంతటితో ఆగలేదు, నేటి యువతకు తీసిపోకుండా బ్రహ్మాండమైన ఆల్బమ్ కూడా చేసింది. ఉత్సాహం అంటే అది, ఈ వయసులో మంచాన రోగిలా పడి ఇంత తిని కాలం గడిపేయ వచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. జీవితాన్ని ఉత్సాహంగా మనసుకు చూపిస్తూ ఉంటె దాని వయసు ఎప్పుడు పదహారు దాటదు. అదే చేసినట్టుగా ఉంది ఈ బామ్మా. ఫ్రాన్స్ కు చెందిన ఈమె పేరు కొలెట్ మేజ్, 107 ఏళ్ళ వయసులో 70ఏళ్ళ పైబడ్డ కొడుకుతో ఈ ఆల్బమ్ చేసి అందరి మన్ననలు పొందుతుంది. నాలుగేళ్ళ వయసులో పియానో నేర్చుకోవడం ఆరంభించి, 16ఏళ్లకే అందులో ఉపాధ్యాయురాలిగా పనిచేసింది మేజ్. అప్పట్లో పియానో కెరీర్ గా ఎంచుకోవడం సాహసమే. గత పదిహేనేళ్లుగా మేజ్ రోజు ఎనిమిది గంటలు పియానో ప్లే చేస్తూ ఇప్పటికి ఆరు ఆల్బమ్స్ విడుదల చేసింది. మేజ్ మాట్లాడుతూ, సంగీతం అంటే భావోద్వేగాలతో కూడుకున్నది, అందుకే అది నాకు చాలా ఇష్టం. అది నా లో భాగం అన్నారు.



భారతవిద్యార్థులకు.. చైనా చెక్..!

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>