SportsVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/aus-vs-ind-one-day-series59d828a3-cbae-4f4d-bb64-fdbdfe0c306a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/aus-vs-ind-one-day-series59d828a3-cbae-4f4d-bb64-fdbdfe0c306a-415x250-IndiaHerald.jpgఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదలైన మూడు మ్యాచ్ ల వన్ డే సిరీస్ లో భాగంగా మొన్న జరిగిన మొదటి వన్ డే లో ఆస్ట్రేలియా భారత్ మహిళలు నిర్దేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ కోల్పోయి సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్ డే ల సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఈ రోజు భారత్ ఖచ్చితంగా గెలవాల్సిన రెండవ మ్యాచ్ లో కూడా ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియాకు సిరీస్ ను అప్పగించింది.AUS VS IND ONE DAY SERIES{#}Ram Gopal Varma;raj;Australia;Anandam;Audience;Indiaచిన్న పొరపాటుతో మ్యాచ్ ను కోల్పోయిన ఇండియా...చిన్న పొరపాటుతో మ్యాచ్ ను కోల్పోయిన ఇండియా...AUS VS IND ONE DAY SERIES{#}Ram Gopal Varma;raj;Australia;Anandam;Audience;IndiaFri, 24 Sep 2021 20:00:00 GMTఇండియా మరియు ఆస్ట్రేలియా జట్ల మధ్య మొదలైన మూడు మ్యాచ్ ల వన్ డే సిరీస్ లో భాగంగా మొన్న జరిగిన మొదటి వన్ డే లో ఆస్ట్రేలియా భారత్ మహిళలు నిర్దేశించిన 226 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్ కోల్పోయి సాధించింది. ఈ గెలుపుతో మూడు వన్ డే ల సిరీస్ లో ఆస్ట్రేలియా 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది. ఈ రోజు భారత్ ఖచ్చితంగా గెలవాల్సిన రెండవ మ్యాచ్ లో కూడా ఉత్కంఠ పోరులో ఆస్ట్రేలియాకు సిరీస్ ను అప్పగించింది. ఈ మ్యాచ్ ను చూసిన ప్రియాతి ఒక్క భారత్ ప్రేక్షకుడు ఓడిపోతారు అని అనుకుని ఉండరు. మ్యాచ్ మొదలైన దగ్గర నుండి చివరి బాల్ వరకు విజయం మన దగ్గరే ఉంది. కానీ కాలం కలిసి రాక ఆఖరి బాల్ కు మ్యాచ్ చేజారిపోయింది. మిథాలీ రాజ్ నేతృత్వంలోని మహిళల భారత్ టీం మొదట టాస్ ఓడిపోయి బ్యాటింగ్ చేపట్టింది.

మొదటి వన్ డే లో విమర్శలు ఎదుర్కొన్న ఓపెనర్లు స్మృతి మందన మరియు షెఫాలీ వర్మ ఇద్దరూ మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. మొదటి వికెట్ కు 74 పరుగులు జోడించి షెఫాలీ వర్మ (22) వెనుతిరిగింది. మధ్య మధ్యలో వికెట్లు పడుతున్నా లెక్క చేయక ఓపెనర్ స్మృతి మందన 86 పరుగులను సాధించింది. ఒక దశలో భారత్ స్కోర్ 250 చేస్తుందా అనుకున్నా, చివరిలో దీప్తి, పూజ మరియు జులన్ గోస్వామిల ప్రయత్నంతో 274 పరుగులు చేయగలిగింది. ఈ స్కోర్ చూసిన ప్రేక్షకులు ఇక భారత గెలుపు నల్లేరుపై నడకే అనుకున్నారు. అందుకు తగ్గట్లే భారత్ బౌలర్లు చెలరేగి 52 పరుగులకే నాలుగు కీలక వికెట్లను సాధించి విజయానికి బాటలు వేశారు. కానీ ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు.

బెత్ మోని తో జత కలిసిన మేక్ గ్రాత్ భారత్ బౌలర్లను ఆచి తూచి ఆడుతూ స్కోర్ బోర్డును నెమ్మదిగా పరుగులు పెట్టించారు. వీరిద్దరూ కలిసి 126 పరుగుల సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అలా మ్యాచ్ చివరి ఓవర్ కు 13 పరుగుల వరకు వచ్చింది. ఇక్కడే మిథాలీ చేసిన తప్పుకు భారత్ మూల్యం చెల్లించుకుంది. క్రీజులో ఉన్న బ్యాటర్లు అప్పటి వరకు స్పిన్ ఆడడానికి ఇబ్బంది పడుతున్నారు. 49 ఓవర్ వరకు స్పిన్ వేయించి, చివరి ఓవర్ మాత్రం ఫాస్ట్ బౌలర్ జులన్ కు బంతిని అప్పగించింది. చివరి ఓవర్ లో 13 పరుగులు చేయాల్సి ఉండగా మొదటి అయిదు బంతులకు 10 పరుగులు చేశారు. లాస్ట్ బాల్ కు మూడు పరుగులు చేయాల్సి ఉండగా నో బాల్ వేయడంతో, ఒక రన్ మరియు ఫ్రీ హిట్ వచ్చింది. దానితో లాస్ట్ బాల్ కు లాంగ్ ఆన్ లో షాట్ కొట్టి రెండు పరుగులు పూర్తి చేయడంతో ఓటమిని తప్పించుకున్న ఆస్ట్రేలియా 5 వికెట్ల తేడాతో సిరీస్ ను మ్యాచ్ ను కైవసం చేసుకుంది.



భారతవిద్యార్థులకు.. చైనా చెక్..!

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>