HealthMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-369e1ca6-58d1-40b8-bc0d-5d3464fa2e42-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-369e1ca6-58d1-40b8-bc0d-5d3464fa2e42-415x250-IndiaHerald.jpgసాధారణ జనాభాలో సంక్రమణ శాతం 0.44 శాతం ఉంటే డయాలసిస్ రోగుల్లో 8.7శాతం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. వ్యాక్సినేషన్ డయాలసిస్ రోగుల్లో కోవిడ్33 శాతం ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదాన్ని తగ్గించిందని నెఫ్రొ ప్లస్ సహ వ్యవస్థాపకులు కమల్ డి షా, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వివేకానంద్ ఝా తెలిపారు. టీకా తీసుకోకపోతే చనిపోయే ప్రమాదం ఉందని గుర్తించాలని సూచించారు. టీకా తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకిన మరణానికి ఉన్న అవకాశాలను అది సగానికి తగ్గిస్తుందని తెలిపారు. రిస్కు గ్రూపు లో భాగమైన డయాలసిస్ రోగులకు సంబంధించి Health {#}Doctor;January;Kanna Lakshminarayana;central government;Coronavirusకరోనాతో డయాలసిస్ రోగులకు ఇబ్బందులు తప్పవా ..!కరోనాతో డయాలసిస్ రోగులకు ఇబ్బందులు తప్పవా ..!Health {#}Doctor;January;Kanna Lakshminarayana;central government;CoronavirusFri, 24 Sep 2021 22:02:00 GMTకోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామంటూ కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది. ఈ ఏడాది జనవరి 15 తర్వాత మొదలెట్టిన వ్యాక్సినేషన్ కోసం  రిస్కు గ్రూపులను గుర్తించింది. అయితే 9 నెలలు గడుస్తున్నా ఆర్ఎస్ గ్రూపులో ఉన్న వారిలో అత్యధిక మందికి వ్యాక్సిన్ వేసుకొని ఫలితంగా వైరస్ వ్యాప్తి,మరణాలు తగ్గటం లేదు. మొదటి,రెండో డయాబెటిస్, బీపీ తో పాటు మూత్రపిండాల వ్యాధులతో బాధపడేవారు తదితరులను రిస్క్ గ్రూపు గా గుర్తించిన సంగతి తెలిసిందే . అదే క్రమంలో వారికి మొదట టీకాలు వేయాలని వైద్యనిపుణులు కూడా సూచించారు.

అయితే ఆ సూచనలను కచ్చితంగా అమలు చేయకపోవడంతో డయాలసిస్ రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఆ కేంద్రాల నెట్వర్క్ నెఫ్రో ప్లస్ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. డయాలసిస్ చేయించుకుంటున్న రోగులు కరోనా బారిన పడితే మిగిలిన వారి మాదిరిగా హోం ఐసోలేషన్ కుదరదు. తప్పనిసరిగా ఆస్పత్రిలో చేరాల్సిందే. నెఫ్రో ప్లస్ చేసిన ఈ అధ్యయనాన్ని ఇంటర్నేషనల్ నెఫ్రాలజీ జర్నల్, కిడ్నీ ఇంటర్నేషనల్ రిపోర్టులు ప్రచురించాయి. మొదటి వేవ్ లో 14573 మంది డయాలసిస్ రోగుల పై అధ్యయనం చేశారు. కోవిడ్-19 బారినపడిన వారిలో 99 శాతం మంది ఆస్పత్రిలో సగటున 12 రోజులు ఉండగా, వారిలో మరణాల రేటు 23 శాతంగా నమోదయింది. వీటికి తోడు డయాలసిస్ కేంద్రాలున్న ఆస్పత్రులు కూడా కోవిడ్ ఆసుపత్రిగా మారడంతో రోగులు ఆస్పత్రి లోకి వచ్చేందుకు కూడా ఇబ్బందులను ఎదుర్కొన్నారు.  కర్రోడా సోకిన వ్యక్తుల్లో 55 ఏళ్ల పైబడిన వారు 45% మంది ఉన్నారు .

సాధారణ ప్రజల్లో కన్నా ఈ రోగుల్లో కోవిడ్ సోకటం  20 శాతం అధికంగా ఉందని, సాధారణ జనాభాలో సంక్రమణ శాతం 0.44 శాతం ఉంటే డయాలసిస్ రోగుల్లో 8.7శాతం ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది. వ్యాక్సినేషన్ డయాలసిస్ రోగుల్లో కోవిడ్33 శాతం  ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదాన్ని తగ్గించిందని నెఫ్రొ ప్లస్ సహ వ్యవస్థాపకులు కమల్ డి షా, ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ డాక్టర్ వివేకానంద్ ఝా తెలిపారు. టీకా తీసుకోకపోతే చనిపోయే ప్రమాదం ఉందని గుర్తించాలని సూచించారు. టీకా తీసుకున్న తర్వాత కూడా కరోనా సోకిన మరణానికి ఉన్న అవకాశాలను అది సగానికి తగ్గిస్తుందని తెలిపారు. రిస్కు గ్రూపు లో భాగమైన డయాలసిస్ రోగులకు సంబంధించి మరిన్ని అధ్యయనాలు  జరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.



టార్గెట్ జగన్: పవన్ కొత్త బొమ్మ..బాబు క్యారెక్టర్ ఏంటి?

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>