PoliticsChandrasekhar Reddyeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/peacefulkashmir-0b3023d0-3fcf-413d-bda4-3d087fef5649-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/peacefulkashmir-0b3023d0-3fcf-413d-bda4-3d087fef5649-415x250-IndiaHerald.jpgజమ్మూకాశ్మీర్ లో పరిస్థితులు చక్కదిద్దటానికి కేంద్రప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించింది. ఒకటి సాధారణ రాష్ట్రంగా ఏర్పాటు చేయగా, రెండోది కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది. తద్వారా కేంద్ర బలగాలతో కాశ్మీర్ లో తిరుగుబాటుదారులకు అణిచివేసి అక్కడ ప్రశాంత వాతావరణాన్ని తేవాలని ప్రభుత్వం యోచిస్తుంది. అయితే అది ఎప్పటికి సాధ్యపడుతుంది అనేది పెద్ద ప్రశ్న. అక్కడ ప్రతిరోజూ తుపాకులు పేలుతూనే ఉన్నాయి. తిరుగుబాటు దారులను అణిచివేసేందుకు భద్రతా దళాలు కూడా నిరంతరం వారితో పోరాడుతూనే ఉన్నాయి. ఇలా ఎన్నాళ్లు peacefulkashmir;{#}Jammu and Kashmir - Srinagar/Jammu;American Samoa;central government;Governmentకాశ్మీర్ లో .. ప్రశాంతత ఎన్నాళ్ళకొస్తదోకాశ్మీర్ లో .. ప్రశాంతత ఎన్నాళ్ళకొస్తదోpeacefulkashmir;{#}Jammu and Kashmir - Srinagar/Jammu;American Samoa;central government;GovernmentThu, 23 Sep 2021 10:37:04 GMTజమ్మూకాశ్మీర్ లో పరిస్థితులు చక్కదిద్దటానికి కేంద్రప్రభుత్వం ఆ రాష్ట్రాన్ని రెండుగా విభజించింది. ఒకటి సాధారణ రాష్ట్రంగా ఏర్పాటు చేయగా, రెండోది కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసింది. తద్వారా కేంద్ర బలగాలతో కాశ్మీర్ లో తిరుగుబాటుదారులకు అణిచివేసి అక్కడ ప్రశాంత వాతావరణాన్ని తేవాలని ప్రభుత్వం యోచిస్తుంది. అయితే అది ఎప్పటికి సాధ్యపడుతుంది అనేది పెద్ద ప్రశ్న. అక్కడ ప్రతిరోజూ తుపాకులు పేలుతూనే ఉన్నాయి. తిరుగుబాటు దారులను అణిచివేసేందుకు భద్రతా దళాలు కూడా నిరంతరం వారితో పోరాడుతూనే ఉన్నాయి. ఇలా ఎన్నాళ్లు జరుగుతూనే ఉంటుంది!

కాశ్మీర్ ను మళ్ళీ మాములు స్థితికి తేవడానికి కేంద్రం తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కానీ అక్కడ పరిస్థితులు మాత్రం వారు అనుకున్నంత సులభంగా ఉన్నట్టు కనిపించడం లేదు. ఆఫ్ఘన్ లో తాలిబన్ లను నిలువరించేందుకు అమెరికా 20ఏళ్లపాటు పోరాడింది. అనంతరం కుదరదు అనుకుందేమో అక్కడి నుండి నిష్క్రమించింది. దానితో ఆఫ్ఘన్ తాలిబన్ హస్తగతం అయిపోయింది. ఇప్పుడు ఈ ప్రభావం కాశ్మీర్ పై కూడా ఉండనుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటి వరకు చొరబాటు దారులు, తిరుగుబాటు దారులతో కేంద్ర బలగాలు కాశ్మీర్ లో పోరాడుతున్నారు. ఆఫ్ఘన్ ఆక్రమణ తో ఈ పోరాటంలో కొత్త పుంతలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు అంటున్నారు. ఖచ్చితంగా తిరుగుబాటు దారులకు మరిన్ని నిధులు, ఆయుధాలు లభించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుండటంతో కాశ్మీర్ లో ప్రశాంతత ఇప్పట్లో వచ్చే అవకాశాలు కనిపించకపోవచ్చని వారు భావిస్తున్నారు.

కేంద్రం కాస్త త్వరగా కాశ్మీర్ లో పరిస్థితులను అదుపులోకి తెచ్చుకుంటే ఈ చొరబాటు దారులకు, తిరుగుబాటు దారులను నిలవరించ వచ్చు. ఇక్కడ ఆలస్యం అయ్యే కొద్దీ కాశ్మీర్ లో పరిస్థితులు మరింత కఠినంగా మారుతాయని నిపుణులు తెలియజేస్తున్నారు. దేశంలో సంక్షోభం వలన ఈ నిర్ణయంలో అలసత్వం కాశ్మీర్ భవితవ్యాన్ని చీకటిమయం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వారు అంటున్నారు. ఆఫ్ఘన్ ఆక్రమణ కాశ్మీర్ పరిస్థితుల స్వరూపాన్ని తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నప్పటికీ కేంద్రం అప్రమత్తంగా ఉంటె ఆ సమస్యను అధిగమించవచ్చని నిపుణులు అంటున్నారు. అలా కాకుండా గతంలో మాదిరిగానే ఉంటె కాశ్మీర్ మరో ఆఫ్ఘన్ అవుతుందని వారు హెచ్చరిస్తున్నారు. ఆ పరిస్థితులు రాకుండా చూసుకోవడం అత్యవసరం అనేది కేంద్రం గుర్తించాలని వారు సూచిస్తున్నారు.



రోజాని రౌండప్ చేస్తున్నారుగా...భాను రెడీగా ఉండు...

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chandrasekhar Reddy]]>