SportsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/uppal-stadiume77c91a4-06b0-462c-9de4-144468a7027a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/uppal-stadiume77c91a4-06b0-462c-9de4-144468a7027a-415x250-IndiaHerald.jpgఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చింది అన్నట్లు ఉంది హైదరాబాద్ పరిస్థితి. అత్యాధునిక వసతులు ఉన్నప్పటికీ... అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నా కూడా... ఉప్పల్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా జరగటం లేదు. అందుకు ప్రధాన కారణం... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రమే. ఆధిపత్య పోరుతో నిత్యం సతమతమవుతున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గోడవల కారణంగా ఈ ఏడాది కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించేందుకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా... బీసీసీఐ విముఖత చూపింది. సUppal stadium{#}West Indies;BCCI;ICC T20;Uppal;June;November;Cricket;Yevaru;INTERNATIONAL;Hyderabad;marriageహైదరాబాద్‌కు మళ్లీ మొండిచెయ్యి...!హైదరాబాద్‌కు మళ్లీ మొండిచెయ్యి...!Uppal stadium{#}West Indies;BCCI;ICC T20;Uppal;June;November;Cricket;Yevaru;INTERNATIONAL;Hyderabad;marriageWed, 22 Sep 2021 11:42:51 GMTఎంకి పెళ్లి సుబ్బి సావుకు వచ్చింది అన్నట్లు ఉంది హైదరాబాద్ పరిస్థితి. అత్యాధునిక వసతులు ఉన్నప్పటికీ... అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నా కూడా... ఉప్పల్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో ఒక్క అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ కూడా జరగటం లేదు. అందుకు ప్రధాన కారణం... హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాత్రమే. ఆధిపత్య పోరుతో నిత్యం సతమతమవుతున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ గోడవల కారణంగా ఈ ఏడాది కూడా అంతర్జాతీయ మ్యాచ్‌లను నిర్వహించేందుకు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా... బీసీసీఐ విముఖత చూపింది. సాధారణంగా రోటేషన్ విధానంలో ప్రతి ఏటా రెండు అంతర్జాతీయ వన్డేలు, ఒక టెస్టు మ్యాచ్, ఒక టీ 20 నిర్వహించాలి. అలాగే ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఉప్పల్ స్టేడియంను సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్‌కు బీసీసీఐ కేటాయించింది.

హెచ్‌సీఏలో గోడవల కారణంగా ఉప్పల్ స్టేడియంను ఒక రకంగా బ్లాక్ లిస్ట్‌లో పెట్టినట్లు తెలుస్తోంది. ఏ ఏడాది నవంబర్ నెల నుంచి వచ్చే ఏడాది జూన్ మధ్య కాలంలో దేశంలో మొత్తం 21 అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 4 టెస్టులు, 3 వన్డేలు, 14 టీ20 మ్యాచ్‌లు ఉన్నాయి. న్యూజీలాండ్, సౌతాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్ జట్లు భారత్‌లో పర్యటించనున్నాయి. అయినా సరే కనీసం ఒక్కటంటే ఒక్క మ్యాచ్ కూడా హైదరాబాద్‌కు కేటాయించలేదు బీసీసీఐ. 1950 దశకంలోనే టెస్టు మ్యాచ్‌లకు వేదికగా నిలిచిన హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ బీసీసీఐలో మొదటి దశ సభ్యుల్లో ఒకటి. అయితే ప్రస్తుత హెచ్‌సీఏ అధ్యక్షుడు, మాజీ క్రికెటర్ అజారుద్ధీన్‌కు, అపెక్స్ కౌన్సిల్ సభ్యులకు మధ్య పెద్ద గొడవ జరుగుతోంది. అసలు హెచ్‌సీఏకు ఎవరు ప్రాతినిధ్యం వహిస్తున్నారో కూడా తెలియని పరిస్థితి. ఎవరికి వారు ప్రెస్‌మీట్‌లు పెట్టి... మేమే నాయకులం అని ప్రకటించారు. మా ఆదేశాలు మాత్రమే పాటించాలని అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇదే సమయంలో తాజాగా హైదరాబాద అండర్-19 జట్టు ఎంపిక కూడా ఎంతో వివాదాస్పదమైంది. ఇన్ని గొడవల మధ్య సతమతమవుతున్న నేపథ్యంలో... మ్యాచ్‌లు నిర్వహించడం ఎందుకనీ బీసీసీఐ భావించింది. అందుకే కనీసం ఒక్కటంటే ఒక్క అంతర్జాతీయ మ్యాచ్ కూడా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్‌కు కేటాయించలేదు. ఆధిపత్య పోరుతో.... ఉప్పల్ స్టేడియం మరోసారి బోసిపోయింది.





పవన్‌తో పోరు పడలేం...మనకొద్దు బాబు...

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>