EducationVennelakanti Sreedhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/reserviation120ace2b-69d1-4ab1-ae8c-39d18297057e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/education/virgo_virgo/reserviation120ace2b-69d1-4ab1-ae8c-39d18297057e-415x250-IndiaHerald.jpgవివిధ కార్పోరేషన్ లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అములు చేయడం ద్వారా నూతన ఒరవడికి శ్రీకారు చుట్టిన ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ మరో అడుగు వేసింది. పాఠశాల తల్లితండ్రుల కమిటీల్లో రిజర్వేషన్ ను అమలు చేయాలని సూచించింది. తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ముగ్గురు పిల్లలున్న తల్లితండ్రులు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హుత కల్పించడం విశేషం.reserviation{#}School;Scheduled Tribes;Elections;wednesday;local language;september;Director;Andhra Pradeshపాఠశాల కమిటీల్లోనూ రిజర్వేషన్పాఠశాల కమిటీల్లోనూ రిజర్వేషన్reserviation{#}School;Scheduled Tribes;Elections;wednesday;local language;september;Director;Andhra PradeshWed, 22 Sep 2021 12:09:47 GMTపాఠశాల కమిటీల్లోనూ రిజర్వేషన్
 
వివిధ కార్పోరేషన్ లు, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అములు చేయడం ద్వారా నూతన ఒరవడికి శ్రీకారు చుట్టిన ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ మరో అడుగు వేసింది. పాఠశాల తల్లితండ్రుల కమిటీల్లో రిజర్వేషన్ ను అమలు చేయాలని సూచించింది. తాజాగా  పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.


ప్రతి తరగది గదిలోనూ ముగ్గురు తల్లితండ్రులు పాఠశాల కమిటీ లో సభ్యులుగా ఉండాలని చెప్పారు. ఆ ముగ్గురిలోనూ ఒకరు ఎస్సి సామాజిక వర్గానికి , మరోకరు ఎస్టీ సామాజిక వర్గానికి, మిగిన వ్యక్తులు బి.సి సామాజిక వర్గం వారై ఉండే లాా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ ముగ్గురిలో ఇద్దరు తప్పని సరిగా తల్లులై ఉండవాలని నిబంధన విధించారు. స్థానిక సంస్థల ప్రతినిధులు, ప్రధానోపాధ్యాయులు ఓటు హక్కులేని ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఉంటారు. పాఠశాల కమిటీ ఛైర్ పర్సన్, వైస్ చైర్ పర్సన్ లు  వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారై ఉండాలి. ఈ నిబంధనల మేరకు పాఠశాల కమిటీ ఎన్నికలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు.

 
ముగ్గురు పిల్లలున్న తల్లితండ్రులు కూడా ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అర్హుత కల్పించడం విశేషం. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారిని కూడా బి.సిల కింద గణించనున్నారు. 2021 సెప్టెంబర్ 15 నాటికి పాఠశాలల్లో పిల్లల్ని చేర్పించిన వారు కుటుంబాలకే ఓటు హక్కు కల్పించారు. ఈ నెల 16 న పాఠశాల కమిటీ ఎన్నికలకు నోటిఫికేషన్ జారీ చేశారు. అదే రోజు మధ్యాహ్నం ఓటరు జాబితా ప్రదర్శించారు. ఆ తరువాత నామినేషన్ల ప్రక్రియ ఆరంభమైంది. బుధవారం ఎన్నికలు జరపాలని సూచించారు. ఆంధ్ర ప్రదేశ్ లోని 45 వేలకు పైగా ఉండే బడుల్లో ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో పాఠశాల కమిటీ ఎన్నికలకు కూడా రిజర్వేషన్ లు ఉండాలని అదేశాలు జారీ అయ్యాయి. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగా ఈ ప్రకియ జరగాలని కూడా ఆదేశాల్లో పేర్కొన్నారు.



పవన్‌తో పోరు పడలేం...మనకొద్దు బాబు...

కరోనా : వాక్సిన్ కంటే మెరుగైన.. మోనోక్లోనల్ వైద్యం..

శ్రీను వైట్ల గాడిలో పడుతున్నాడే!!

హుజూరాబాద్ లో రోజూ దసరానే: ఈటెల

హీరోలలో విజయ్ సేతుపతి వేరయా..!

సర్కారు వారి 'పాట' కు వేళయ్యింది?

బిగ్ బ్రేకింగ్: ఈ రాత్రి హైదరాబాద్ కు కాళ రాత్రే...?

బ్రేకింగ్: బందరులో పవన్ మీటింగ్...?

పూరీ బర్త్ డే.. బాలయ్య ఫ్యాన్స్ వెయిటింగ్!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Vennelakanti Sreedhar]]>