BreakingPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/accident-25b19c33-c4a8-4ea2-93c9-b999964b1735-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/accident-25b19c33-c4a8-4ea2-93c9-b999964b1735-415x250-IndiaHerald.jpgతెల్లవారక ముందే ఆ బతుకులు తెల్లారిపోయాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చింతపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీ కొట్టింది. ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు... లారీని వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారినిAccident{#}Hyderabad;Guntur;Prakasam;police;bus;Miryalaguda;Nalgondaమిర్యాలగూడలో ముగ్గురు మృతిమిర్యాలగూడలో ముగ్గురు మృతిAccident{#}Hyderabad;Guntur;Prakasam;police;bus;Miryalaguda;NalgondaTue, 24 Aug 2021 06:02:00 GMTతెల్లవారక ముందే ఆ బతుకులు తెల్లారిపోయాయి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చింతపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ట్రావెల్స్ బస్సు వేగంగా ఢీ కొట్టింది. ఒంగోలు నుంచి హైదరాబాద్ వెళ్తున్న ట్రావెల్స్ బస్సు... లారీని వెనుక నుంచి వేగంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇప్పటి వరకు ముగ్గురు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వారిని ప్రకాశం జిల్లాకు చెందిన మల్లికార్జున, నాగేశ్వర్ రావు, గుంటూరు జిల్లాకు చెందిన జయరావ్ గా గుర్తించారు పోలీసులు. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానికుల సహకారంతో మిర్యాలగూడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సు అత్యంత వేగంగా ప్రయాణిస్తునట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సు వేగంగా ఢీ కొట్టడంతో ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆసుపత్రి వైద్యులు వెల్లడించారు. మిగిలిన ప్రయాణికులను ఇతర వాహనాల్లో వారి గమ్యస్థానాలకు తరలించారు పోలీసులు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జాతీయ రహదారిపై ప్రమాదం జరగటంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.





మిర్యాలగూడలో ముగ్గురు మృతి

మరోసారి బుల్లితెర టైగర్ అనిపించుకున్న ఎన్టీఆర్..

లోకేష్‌ నుంచి క్యాడర్‌ ఆశిస్తోంది అదేనా?

హాకీ ప్లేయర్స్ కు పంజాబ్ అరుదైన గుర్తింపు

తాలిబన్లకు ఒక్క అవకాశం ఇస్తే.... ?

విజయం మీదే: పోటీతత్వం మీలో విజయ కాంక్షను రగిలిస్తుంది... !

లోకేష్‌ రాటు తేలారా? తేల్చారా?

రాజశేఖర్ కూతురు మూవీ గురించి ఆసక్తికరమైన అప్డేట్..!

స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. నెలకి 7,800/- స్కాలర్ షిప్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>