MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna-bhatia91acffbd-e967-4d13-9950-24e0082d2d39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tamanna-bhatia91acffbd-e967-4d13-9950-24e0082d2d39-415x250-IndiaHerald.jpgమిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ‘బాహుబలి’ సినిమాతో తన పాపులారిటీని ఇంకా పెంచుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సత్తా చాటుతూ తమన్నా టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. కాగా, ఈ భామ ప్రస్తుతం ఓ డేరింగ్ స్టెప్ తీసుకుని ఓ సినిమాలో నెగెటివ్ రోల్ ప్లే చేసింది. నితిన్ హీరోగా తెరకెక్కిన ‘మాస్ట్రో’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది ఈ భామ. ఈ చిత్రం డైరెక్ట్‌గా హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 9న డిస్నీ ప్లస్ హాట్ స్Tamanna Bhatia{#}BEAUTY;bhama;Ayushman Khurana;Radhika Aapte;Chitram;Hero;Tabu;merlapaaka gandhi;tamannaah bhatia;Heroine;Cinema;septemberడేరింగ్ స్టెప్‌తో పెద్ద తప్పు చేస్తున్న తమన్నా..?డేరింగ్ స్టెప్‌తో పెద్ద తప్పు చేస్తున్న తమన్నా..?Tamanna Bhatia{#}BEAUTY;bhama;Ayushman Khurana;Radhika Aapte;Chitram;Hero;Tabu;merlapaaka gandhi;tamannaah bhatia;Heroine;Cinema;septemberTue, 24 Aug 2021 11:00:00 GMTమిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ‘బాహుబలి’ సినిమాతో తన పాపులారిటీని ఇంకా పెంచుకుంది. టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్‌లోనూ సత్తా చాటుతూ తమన్నా టాప్ హీరోయిన్‌గా కొనసాగుతోంది. కాగా, ఈ భామ ప్రస్తుతం ఓ డేరింగ్ స్టెప్ తీసుకుని ఓ సినిమాలో నెగెటివ్ రోల్ ప్లే చేసింది. నితిన్ హీరోగా తెరకెక్కిన ‘మాస్ట్రో’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది ఈ భామ. ఈ చిత్రం డైరెక్ట్‌గా హాట్ స్టార్ ఓటీటీలో విడుదల కానుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 9న డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమ్ కానుంది. అయితే, ఈ సినిమా బాలీవుడ్ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అంధాదున్’ రీమేక్. 

ఒరిజినల్ ఫిల్మ్‌లో వెర్సటైల్ యాక్టర్ ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించగా, ఆయనకు జోడీగా రాధికా ఆప్టే నటించింది. కీలక పాత్రలో సీనియర్ హీరోయిన్ టబు  కనిపించింది. అయితే, ఆ సినిమాలో ఆమె చేసిన పాత్రకుగాను ప్రశంసలు లభించాయి. నెగెటివ్ టచ్‌తో తనదైన శైలిలో టబు మూవీ సక్సెస్‌లో కీ రోల్ ప్లే చేసింది. కాగా, తెలుగులో తబు పోషించిన పాత్రను తమన్నా పోషిస్తోంది. ఈ క్రమంలోనే ఈ భామ సీనియర్ హీరో నరేశ్‌కు జోడీగా ఈ చిత్రంలో కనిపించడంతో పాటు అందాల విందుకు వెనకాడటం లేదని ట్రైలర్ చూస్తే తెలిసిపోతున్నది.

 ఈ సినిమాలో హీరో, హీరోయిన్ల పాత్రతో పాటు తమన్నా పాత్ర కూడా చాలా కీలకం కాబట్టి తమన్న పాత్రకు బాగా ప్రిపేరయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఒక మిడిల్ ఏజ్‌డ్ హీరో సరసన యాక్ట్ చేసేందుకు డేర్ స్టెప్పే తీసుకుంది తమన్నా. చూడాలి.. ఓటీటీలో సినిమా విడుదల తర్వాత ఎలాంటి రివ్యూలు వస్తాయో మరి..  తమన్నా ‘మాస్ట్రో’ చిత్రంతో పాటు తెలుగులో ‘సీటీమార్, ఎఫ్3, గుర్తుందా శీతాకాలం, దటీజ్ మహాలక్ష్మి, గని’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.



ఇదేం పోయేకాలం : మరీ ఇంత అరాచకమా?

పెన్షన్ కోసం భర్తను చంపేసింది...?

ఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??

అక్కడ ఆన్ లైన్ లో కూడా ఉంటాయి మరి..

వేరే వ్యక్తితో భార్య సహజీవనం.. అడవిలో శమైన మహిళ..??

హుజూరాబాద్‌: కేసీఆర్‌కు ముందు గొయ్యి.. వెనుక నుయ్యి..?

రచయితగా మారిన కమల్ హాసన్..?

ఇదేం అరాచకం అయ్యా.. గుర్రం మీద లవ్...రేప్?

కరోనా వ్యాక్సిన్ ప్రచారం ఘనం..ఆచరణ శూన్యం.. ఇట్టా అయితే ఎట్టా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>