MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/tollywood-senior-heros339656b5-5b97-4e8c-9592-462eefdace21-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/tollywood-senior-heros339656b5-5b97-4e8c-9592-462eefdace21-415x250-IndiaHerald.jpgహీరో రాజశేఖర్ కు 90ల కాలంలో తిరుగులేదు అని చెప్పడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఆ కాలంలో రాజశేఖర్ హిట్, సూపర్ హిట్ ,బ్లాక్ బస్టర్ లతో దూసుకు పోయి చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో రాజశేఖర్ 'అంకుశం' సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన నటనకు సినిమా అభిమానులు మాత్రమే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా పొందాడు. పోలీస్ గెటప్ అంటే రాజశేఖర్ మాత్రమే అన్నట్లుగా ఆ సమయంలో గుర్తింపు తెచ్చుకున్నాడు.Tollywood senior heros{#}prasanth varma;praveen sattaru;sun;Traffic police;News;Chiranjeevi;Darsakudu;dr rajasekhar;prema;Love;Cinema;Telugu;Directorరాజశేఖర్ హిట్ అందుకునే సమయం ఆసన్నమైందా..!రాజశేఖర్ హిట్ అందుకునే సమయం ఆసన్నమైందా..!Tollywood senior heros{#}prasanth varma;praveen sattaru;sun;Traffic police;News;Chiranjeevi;Darsakudu;dr rajasekhar;prema;Love;Cinema;Telugu;DirectorTue, 24 Aug 2021 08:48:00 GMTహీరో రాజశేఖర్ కు 90ల కాలంలో  తిరుగులేదు అని చెప్పడంలో ఎలాంటి అనుమానం అవసరం లేదు. ఆ కాలంలో రాజశేఖర్ హిట్, సూపర్ హిట్ ,బ్లాక్ బస్టర్ లతో దూసుకు పోయి చిరంజీవి లాంటి స్టార్ హీరోలతో పోటీ పడిన సందర్భాలు ఉన్నాయి. స్టార్ హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో రాజశేఖర్ 'అంకుశం' సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన నటనకు సినిమా అభిమానులు మాత్రమే కాకుండా విమర్శకుల ప్రశంసలను కూడా పొందాడు. పోలీస్ గెటప్ అంటే రాజశేఖర్ మాత్రమే అన్నట్లుగా ఆ సమయంలో గుర్తింపు తెచ్చుకున్నాడు. 'అల్లరి ప్రియుడు' సినిమా తో ఒక మంచి ప్రేమ కథతో జనాలను ఆకట్టుకున్నాడు. అన్న, సూర్యుడు వంటి సినిమాలతో అలరించిన రాజశేఖర్ .ఆ తర్వాత కాలంలో కూడా మా అన్నయ్య, సింహరాశి , గోరింటాకు వంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలతో జనాలను మెప్పించాడు.

ఆయుధం, ఎవడైతే నాకేంటి వంటి పవర్ ఫుల్ సినిమాలతో అలరించిన రాజశేఖర్ ,ఆ తర్వాత మాత్రం  కొన్ని వరుస పరాజయాలను చూడక తప్పలేదు. అలా ఎన్నో అపజయాల తర్వాత తెలుగు యువ దర్శకుడు అయిన ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన 'గరుడవేగ' సినిమాతో రాజశేఖర్ మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ తర్వాత ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో 'కల్కి' సినిమాలో హీరోగా నటించాడు. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రాజశేఖర్ కు నిరాశనే మిగిల్చింది. ప్రస్తుతం రాజశేఖర్ 'శేఖర్' అనే సినిమాతో పాటు, గోపీచంద్ హీరోగా శ్రీవాసు దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే రాజశేఖర్ ఈ సినిమాలతో తన పూర్వవైభవాన్ని దక్కించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. మరి ఈ సినిమాలతో రాజశేఖర్ తన కలలు నెరవేర్చుకుంటారో లేదో తెలియాలంటే మరి కొంత కాలం ఆగాల్సిందే.



యంగ్ హీరోలలో పెరిగిపోతున్న మల్టీ టాలెంట్ !

ఆగష్టు 24: చరిత్రలో ఈ నాటి సంఘటనలు..

సీఎం కేసీఆర్ రిస్క్ చేస్తున్నారా ?

కరోనా కోసం కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తారా? అంత దమ్ముందా?

ఆర్టీసి రిటైర్డ్ ఉద్యోగులకు నరకం చూపెడుతున్న అధికారులు

హాల్ మార్కింగ్ రూల్స్ పై జువెలర్స్ నిరసన... ఎందుకు?

ఇండియా ఫర్‌ సేల్‌ : ఎయిర్‌పోర్టుల టార్గెట్‌ రూ.10 వేల కోట్లు..!?

మీ అభిమాన హీరోలకు ఉద్యోగాలొచ్చాయ్..!

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>