PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bharatbaa32276-5355-480f-880a-13b4a9ffb118-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/bharatbaa32276-5355-480f-880a-13b4a9ffb118-415x250-IndiaHerald.jpgఇటీవల ఏపీ రాజకీయాల్లో ఆత్మసాక్షి గ్రూప్ పేరిట ఓ సర్వే హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సర్వేలో అధికార వైసీపీపై వ్యతిరేకత పెరిగిందని, ప్రతిపక్ష టీడీపీ పుంజుకుందని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ తరుపున 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని సర్వే చెబుతోంది. అలాగే 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టఫ్ ఫైట్ ఎదురుకుంటారని సర్వేలో తేలింది. bharat{#}bharath;Sri Bharath;Rajahmundry;Maganti Roopa;Parliment;Survey;MP;YCP;Elections;TDP;Andhra Pradeshభరత్ కూడా ఆ లిస్ట్‌లోకి ఎందుకు వెళ్లారు?భరత్ కూడా ఆ లిస్ట్‌లోకి ఎందుకు వెళ్లారు?bharat{#}bharath;Sri Bharath;Rajahmundry;Maganti Roopa;Parliment;Survey;MP;YCP;Elections;TDP;Andhra PradeshTue, 24 Aug 2021 03:00:00 GMTఇటీవల ఏపీ రాజకీయాల్లో ఆత్మసాక్షి గ్రూప్ పేరిట ఓ సర్వే హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సర్వేలో అధికార వైసీపీపై వ్యతిరేకత పెరిగిందని, ప్రతిపక్ష టీడీపీ పుంజుకుందని తేలింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు, టీడీపీ తరుపున 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోతారని సర్వే చెబుతోంది. అలాగే 16 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టఫ్ ఫైట్ ఎదురుకుంటారని సర్వేలో తేలింది.

అలాగే 8 మంది వైసీపీ ఎంపీలు ఓడిపోవడం ఖాయమని, ఇద్దరు వైసీపీ, ఒక టీడీపీ ఎంపీ టఫ్ ఫైట్ ఎదురుకుంటారని చెప్పింది. అయితే ఓడిపోయే 8 మంది ఎంపీల్లో రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ పేరు కూడా ఉంది. ఇక ఆయన ఓటమి అంచున ఉన్నారని సర్వే చెబుతోంది. కానీ రెండేళ్లలో రాజమండ్రిలో భరత్ మీద అంత వ్యతిరేకత వచ్చిందా? అంటే అంతగా రాలేదనే చెప్పొచ్చు. ఎందుకంటే వైసీపీ తరుపున గెలిచిన ఎంపీల్లో చాలామంది ఎంపీలు ప్రజల్లో తిరగడం తక్కువ.

కానీ భరత్ ప్రజల్లో ఎక్కువగా తిరుగుతున్నారు. పార్లమెంట్ స్థాయిలో రాష్ట్ర సమస్యలపై గళం విప్పడంలో కాస్త వెనుకబడి ఉన్నా....రాజమండ్రి పార్లమెంట్ పరిధిలో మాత్రం ఎంపీగా మెరుగైన పనితీరే కనబరుస్తున్నారు. ప్రజల మధ్యలో తిరుగుతూ, వారి సమస్యలని తెలుసుకుంటూ, వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు. అలాగే ఎంపీ నిధులతో పార్లమెంట్ పరిధిలో పనులు చేయిస్తున్నారు. తొలిసారి ఎంపీగా గెలిచి రెండేళ్లలోనే భరత్, మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నారు.

అలాంటిది రాజమండ్రిలో భరత్‌పై వ్యతిరేకత వస్తుందనేది కాస్త వింతగానే ఉంది. పైగా ఇక్కడ టీడీపీకి దిక్కు లేదు. గత ఎన్నికల్లో ఓడిపోయిన మాగంటి రూప అడ్రెస్ లేరు. ఇక టీడీపీ వీక్‌గా ఉండటం కూడా భరత్‌కు అడ్వాంటేజ్‌గా ఉంది. మరి అలాంటిది భరత్ పేరు ఓడిపోయే ఎంపీల లిస్ట్‌లో ఉందంటే కాస్త ఆశ్చర్యకరంగానే ఉంది. ఇంకా భరత్ సత్తా తెలియాలంటే రాజమండ్రి కార్పొరేషన్ ఫలితం బట్టి ఉంటుంది. మరి చూడాలి త్వరలో జరగబోయే రాజమండ్రి కార్పొరేషన్‌లో భరత్ ఏ మేర సత్తా చాటుతారో.



భరత్ కూడా ఆ లిస్ట్‌లోకి ఎందుకు వెళ్లారు?

మరోసారి బుల్లితెర టైగర్ అనిపించుకున్న ఎన్టీఆర్..

లోకేష్‌ నుంచి క్యాడర్‌ ఆశిస్తోంది అదేనా?

హాకీ ప్లేయర్స్ కు పంజాబ్ అరుదైన గుర్తింపు

తాలిబన్లకు ఒక్క అవకాశం ఇస్తే.... ?

విజయం మీదే: పోటీతత్వం మీలో విజయ కాంక్షను రగిలిస్తుంది... !

లోకేష్‌ రాటు తేలారా? తేల్చారా?

రాజశేఖర్ కూతురు మూవీ గురించి ఆసక్తికరమైన అప్డేట్..!

స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. నెలకి 7,800/- స్కాలర్ షిప్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>