EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/telangana6aa65584-5a00-48d7-a06a-b9881812e735-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/telangana6aa65584-5a00-48d7-a06a-b9881812e735-415x250-IndiaHerald.jpgతెలంగాణ.. ఇండియాలోనే అతి తక్కువ వయస్సున్న రాష్ట్రం.. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లవుతోంది. చరిత్ర పుటల్లో ఏడేళ్లు పెద్ద లెక్కేమీ కాదు. కానీ.. తెలంగాణ వంటి రాష్ట్రానికి అది చాలా ఎక్కువ కాలమే.. ఎందుకంటే.. అసలు తెలంగాణ వస్తే.. మీకు పాలనే చేతకాదన్నారు.. తెలంగాణ ఇస్తే కరెంటే ఉండదన్నారు.. తెలంగాణ వస్తే.. నీటి ఇబ్బందులు వస్తాయన్నారు.. ఆంధ్రవాళ్లు హైదరాబాద్‌లో ఉండలేరన్నారు.. ఇంకొందరు హైదరాబాద్‌ను కేంద్ర పాలిట ప్రాంతం చేయాలన్నారు.. ఎన్నో అన్నారు.. ఎన్నో అనుకున్నారు.. ఎన్నో భయాలు.. ఎన్నో ఆందోళనలు.. ఎన్నో ఉద్వేగtelangana{#}Thanneeru Harish Rao;history;Aqua;central government;Telangana;Coronavirusఇండియా వర్సస్ తెలంగాణ? : కొన్ని షాకింగ్‌ నంబర్స్..!ఇండియా వర్సస్ తెలంగాణ? : కొన్ని షాకింగ్‌ నంబర్స్..!telangana{#}Thanneeru Harish Rao;history;Aqua;central government;Telangana;CoronavirusTue, 24 Aug 2021 06:00:00 GMTతెలంగాణ.. ఇండియాలోనే అతి తక్కువ వయస్సున్న రాష్ట్రం.. తెలంగాణ ఏర్పడి ఏడేళ్లవుతోంది. చరిత్ర పుటల్లో ఏడేళ్లు పెద్ద లెక్కేమీ కాదు. కానీ..  తెలంగాణ వంటి రాష్ట్రానికి అది చాలా ఎక్కువ కాలమే.. ఎందుకంటే.. అసలు తెలంగాణ వస్తే.. మీకు పాలనే చేతకాదన్నారు.. తెలంగాణ ఇస్తే కరెంటే ఉండదన్నారు.. తెలంగాణ వస్తే.. నీటి ఇబ్బందులు వస్తాయన్నారు.. ఆంధ్రవాళ్లు హైదరాబాద్‌లో ఉండలేరన్నారు.. ఇంకొందరు హైదరాబాద్‌ను కేంద్ర పాలిట ప్రాంతం చేయాలన్నారు..  ఎన్నో అన్నారు.. ఎన్నో అనుకున్నారు.. ఎన్నో భయాలు.. ఎన్నో ఆందోళనలు.. ఎన్నో ఉద్వేగాలు.. ఎన్నో ఉద్విఘ్నఘట్టాలు.


మొత్తానికి ఏడేళ్ల క్రితం తెలంగాణ సాకారమైంది. మరి మొత్తానికి ఏమైంది.. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ఏడేళ్లలో చక్కటి ప్రగతినే నమోదు చేసింది. ఇదేదో తెలంగాణ సర్కారునో.. కేసీఆర్‌నో భుజనా ఎత్తుకునే పని కాదు.. ఎందుకంటే.. తాజాగా ఇదే అంశంపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మాట్లాడారు. ఆయన ఎన్నో గణాంకాలు వివరిస్తూ తెలంగాణ అభివృద్ధిని వివరించారు.  సాధారణంగా ఆర్థిక అభివృద్ధి గురించి చెప్పేటప్పుడు.. జీడీపీ అంకెలే మాట్లాడతాయి. వృద్ధిరేటు శాతాలే అసలు విషయం చెబుతాయి.


తలసరి ఆదాయాలు కొసరి కొసరి మన అభివృద్ధిని అంచనా వేస్తాయి. ఈ పరామితులు అన్నింటిలోనూ తెలంగాణ చక్కటి ప్రగతినే నమోదు చేసింది. జీడీపీ వృద్ధి రేటు, సగటు వృద్ధి రేటు, కరోనా సమయంలో అభివృద్ధి, తలసరి ఆదాయం ఇలా అన్ని కోణాల్లోనూ తెలంగాణ జాతీయ సగటు కంటే చాలా ఎక్కువగా ఉంది. అంతే కాదు.. తెలంగాణ ఏర్పడిన ఏడేళ్లలో ఏటా స్థిరమైన అభివృద్ధి నమోదు చేసింది. తలసరి ఆదాయం దాదాపు ఏడేళ్లలో రెట్టింపయ్యింది.


తలసరి ఆదాయం పెరుగుదలలో దేశంలో 40 శాతం వృద్ధి నమోదైతే.. తెలంగాణలో దాదాపు 100 శాతం వృద్ధి నమోదైంది.. కరోనా సమయంలోనూ తెలంగాణలో పాజిటివ్ వృద్ధిరేటు నమోదైతే.. దేశం మైనస్ నాలుగుగా వృద్ధిరేటు నమోదైంది. మొత్తం మీద.. ఈ ఏడేళ్లలో తెలంగాణ వృద్ధి గణాంకాలైతే గొప్పగానే ఉన్నాయి.



మిర్యాలగూడలో ముగ్గురు మృతి

మరోసారి బుల్లితెర టైగర్ అనిపించుకున్న ఎన్టీఆర్..

లోకేష్‌ నుంచి క్యాడర్‌ ఆశిస్తోంది అదేనా?

హాకీ ప్లేయర్స్ కు పంజాబ్ అరుదైన గుర్తింపు

తాలిబన్లకు ఒక్క అవకాశం ఇస్తే.... ?

విజయం మీదే: పోటీతత్వం మీలో విజయ కాంక్షను రగిలిస్తుంది... !

లోకేష్‌ రాటు తేలారా? తేల్చారా?

రాజశేఖర్ కూతురు మూవీ గురించి ఆసక్తికరమైన అప్డేట్..!

స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. నెలకి 7,800/- స్కాలర్ షిప్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>