PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/airports5e0f2ebc-8d36-4a72-a3ff-a176d875ed8d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/airports5e0f2ebc-8d36-4a72-a3ff-a176d875ed8d-415x250-IndiaHerald.jpgస్వదేశీ నినాదంలో అధికారంలోకి వచ్చి మోడీ.. ఇప్పడు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెడుతున్నారు. కీలకమైన నాలుగు రంగాలు తప్ప అన్నింటినీ ప్రైవేటీకరిస్తామని గతంలోనే చెప్పిన మోడీ సర్కారు.. ఇప్పుడు దాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. నాలుగేళ్లలో ప్రైవేటీకరణ ద్వారా.. రూ.6 లక్షల కోట్లు సంపాదించాలని టార్గెట్‌ పెట్టుకుంది. ఇందుకు రైల్వే, విమానాలు, పోర్టులు వంటి అన్ని రంగాలను లక్ష్యంగా పెట్టుకుంది. ఇక విమానాశ్రయాల విషయానికి వస్తే.. దాదాపు ఈ విమానాశ్రయాల ద్వారా వచ్చే నాలుగేళ్లలో రూ. 10 వేల కోట్లు సంairports{#}nirmalamma;Vijayawada;Tirupati;INTERNATIONAL;Rajahmundry;India;Mumbai;Teluguఇండియా ఫర్‌ సేల్‌ : ఎయిర్‌పోర్టుల టార్గెట్‌ రూ.10 వేల కోట్లు..!?ఇండియా ఫర్‌ సేల్‌ : ఎయిర్‌పోర్టుల టార్గెట్‌ రూ.10 వేల కోట్లు..!?airports{#}nirmalamma;Vijayawada;Tirupati;INTERNATIONAL;Rajahmundry;India;Mumbai;TeluguTue, 24 Aug 2021 07:00:00 GMTస్వదేశీ నినాదంలో అధికారంలోకి వచ్చి మోడీ.. ఇప్పడు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మకానికి పెడుతున్నారు. కీలకమైన నాలుగు రంగాలు తప్ప అన్నింటినీ ప్రైవేటీకరిస్తామని గతంలోనే చెప్పిన మోడీ సర్కారు.. ఇప్పుడు దాన్ని కొత్త పుంతలు తొక్కిస్తోంది. నాలుగేళ్లలో ప్రైవేటీకరణ ద్వారా.. రూ.6 లక్షల కోట్లు సంపాదించాలని టార్గెట్‌ పెట్టుకుంది. ఇందుకు రైల్వే, విమానాలు, పోర్టులు వంటి అన్ని రంగాలను లక్ష్యంగా పెట్టుకుంది.


ఇక విమానాశ్రయాల విషయానికి వస్తే.. దాదాపు ఈ విమానాశ్రయాల ద్వారా వచ్చే నాలుగేళ్లలో రూ. 10 వేల కోట్లు సంపాదించాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా పరిధిలోకి ఉన్న 25 విమానాశ్రయాలను మానిటైజ్‌ చేస్తారు. దేశవ్యాప్తంగా ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా పరిధిలో 137 విమానాశ్రయాలు ఉన్నాయి. వీటిలో 27 అంతర్జాతీయ హోదాతో ఉన్నాయి. మరో 10 కస్టమ్స్ విమానాశ్రయాలు. మరో 103 దేశీయ విమానాశ్రయాలు.


ఇందులో 25 విమానాశ్రయాలను నాలుగేళ్లలో ప్రైవేటీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ముంబై ఎయిర్‌పోర్టులో ఉన్న 26 శాతం, ఢిల్లీలో ఉన్న 26 శాతం, హైదరాబాద్‌లో ఉన్న 13శాతం, బెంగళూరు ఎయిర్‌పోర్టులో ఉన్న 13 శాతం వాటాలను పూర్తిగా అమ్మెస్తారు. వచ్చే మూడేళ్లలో  25 విమానాశ్రయాల్లో ఆరు ఎయిర్‌పోర్టులను 2022 నాటికి మానిటైజ్‌ చేయాలని టార్గెట్‌గా పెట్టుకున్నారు. మొత్తం ఈ ప్రైవేటీకరణ ద్వారా 10,782 కోట్ల రూపాయలు ఆర్జించాలన్నది లక్ష్యం.


ఇక తెలుగు రాష్ట్రాల్లోని విమానాశ్రయాల విషయానికి వస్తే.. విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. ఈ మూడింటి ద్వారా 990 కోట్ల రూపాయలు సమీకరించుకోవాలన్నది టార్గెట్. 2023-24 ఆర్ధిక సంవత్సరంలో విజయవాడ నుంచి రూ. 600  కోట్లు, తిరుపతి నుంచి 260 కోట్లు సమీకరించుకుంటారట. రాజమండ్రి విమానాశ్రయ ఆస్తుల మానిటైజేషన్‌ ద్వారా 130 కోట్లు ఆర్జించాలన్నది టార్గెట్. ఇదీ నిర్మలమ్మ అమ్మకం ప్రణాళిక.



సీఎం నివాసం వద్ద ఏం జరుగుతోంది? ఏంటీ అరాచ‌కం!

సీఎం కేసీఆర్ రిస్క్ చేస్తున్నారా ?

కరోనా కోసం కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తారా? అంత దమ్ముందా?

ఆర్టీసి రిటైర్డ్ ఉద్యోగులకు నరకం చూపెడుతున్న అధికారులు

హాల్ మార్కింగ్ రూల్స్ పై జువెలర్స్ నిరసన... ఎందుకు?

ఇండియా ఫర్‌ సేల్‌ : ఎయిర్‌పోర్టుల టార్గెట్‌ రూ.10 వేల కోట్లు..!?

మీ అభిమాన హీరోలకు ఉద్యోగాలొచ్చాయ్..!

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త

మరోసారి బుల్లితెర టైగర్ అనిపించుకున్న ఎన్టీఆర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>