PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kethireddy73d12dd7-843c-4c22-a735-e4811087c58d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kethireddy73d12dd7-843c-4c22-a735-e4811087c58d-415x250-IndiaHerald.jpgఅధికార వైసీపీలో అనూహ్యంగా తక్కువ సమయంలోనే ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఎమ్మెల్యేల్లో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ముందు వరుసలో ఉంటారు. రెండోసారి ధర్మవరంలో ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి అధికార ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనబరుస్తున్నారు. ప్రతిరోజూ ప్రజలని కలుసుకుంటూ, వారి సమస్యలని తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉండటంలో కేతిరెడ్డి ముందు ఉంటున్నారు. kethireddy{#}soori;Dharmavaram;paritala ravindra;Raptadu;Hanu Raghavapudi;Cheque;local language;YCP;Reddy;Bharatiya Janata Party;MLA;TDP;High courtకేతిరెడ్డిపై సూరి పోరు...మళ్ళీ సైకిల్ ఎక్కుతారా?కేతిరెడ్డిపై సూరి పోరు...మళ్ళీ సైకిల్ ఎక్కుతారా?kethireddy{#}soori;Dharmavaram;paritala ravindra;Raptadu;Hanu Raghavapudi;Cheque;local language;YCP;Reddy;Bharatiya Janata Party;MLA;TDP;High courtTue, 24 Aug 2021 00:00:00 GMTఅధికార వైసీపీలో అనూహ్యంగా తక్కువ సమయంలోనే ఎక్కువ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఎమ్మెల్యేల్లో ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామి రెడ్డి ముందు వరుసలో ఉంటారు. రెండోసారి ధర్మవరంలో ఎమ్మెల్యేగా గెలిచిన కేతిరెడ్డి అధికార ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనబరుస్తున్నారు. ప్రతిరోజూ ప్రజలని కలుసుకుంటూ, వారి సమస్యలని తెలుసుకుంటూ, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఉండటంలో కేతిరెడ్డి ముందు ఉంటున్నారు.

కేతిరెడ్డి గతంలో కంటే ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యాక ప్రజలకు మరింత చేరువయ్యారు. దీంతో ధర్మవరంలో కేతిరెడ్డికి ఎదురులేకుండా పోయింది. ఇక్కడ టీడీపీ తరుపున పరిటాల శ్రీరామ్ పనిచేస్తున్నా సరే కేతిరెడ్డికి చెక్ పెట్టలేకపోతున్నారు. ఇదే ఊపు కొనసాగితే వచ్చే ఎన్నికల్లో కేతిరెడ్డికి చెక్ పెట్టడం చాలా కష్టమనే చెప్పొచ్చు. అయితే పరిటాల శ్రీరామ్..రాప్తాడుపై ఎక్కువ దృష్టి పెట్టడంతో ధర్మవరంలో టీడీపీ పెద్దగా పుంజుకోలేకపోతుంది. స్థానిక ఎన్నికల్లో కూడా ఇక్కడ వైసీపీ క్లీన్‌స్వీప్ చేసేసింది.

అయితే కేతిరెడ్డికి చెక్ పెట్టాలని బీజేపీ నేత గోనుగుంట్ల సూర్యనారాయణ(వరదాపురం సూరి) ప్రయత్నిస్తున్నారు. 2009 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా ధర్మవరం నుంచి పోటీ చేసి మంచిగా ఓట్లు తెచ్చుకుని రెండోస్థానంలో నిలిచిన సూరి, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి, వైసీపీ తరుపున పోటీ చేసిన కేతిరెడ్డిని ఓడించారు. కానీ 2019 ఎన్నికల్లో సీన్ రివర్స్ అయింది. కేతిరెడ్డి, సూరిపై విజయం సాధించారు. ఓడిపోయాక సూరి బీజేపీలోకి వెళ్ళిపోయారు. బీజేపీలో ఉంటూ కేతిరెడ్డిపై ఫైట్ చేస్తున్నారు.

కేతిరెడ్డిపై అవినీతి, భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారు. కేతిరెడ్డి దౌర్జన్యాలు, దందాలు, భూకబ్జాలు భారీగా పెరిగిపోయాయని సూరి ఫైర్ అవుతున్నారు. అలాగే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకం కింద పనులు చేసిన కాంట్రాక్టర్లకు ఇప్పటికీ బిల్లులు చెల్లించలేదని, హైకోర్టు ఆదేశాలు ఉన్నా సరే అధికారులు, ఎమ్మెల్యేకి లొంగిపోయి పనిచేస్తున్నారని సూరి విమర్శిస్తున్నారు. త్వరలోనే కేతిరెడ్డి భారీ కుంభకోణాన్ని బయటపెడతానని అంటున్నారు.

అయితే కేతిరెడ్డిపై సూరి తన పోరుని ఉదృతం చేయడానికి కారణాలు లేకపోలేదు. నెక్స్ట్ సూరి, ధర్మవరంలోనే పోటీ చేయనున్నారు. కాకపోతే బీజేపీకి ఇక్కడం బలం లేదు. దీంతో సూరి మళ్ళీ టీడీపీలోకి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదని తెలుస్తోంది. ఎలాగో శ్రీరామ్‌కు రాప్తాడు ఉంది కాబట్టి, సూరి రిటర్న్ వచ్చి, టీడీపీ తరుపున దిగి కేతిరెడ్డికి చెక్ పెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి చూడాలి కేతిరెడ్డిపై సూరి పోరు ఏ మేర విజయవంతమవుతుందో?  



కేతిరెడ్డిపై సూరి పోరు...మళ్ళీ సైకిల్ ఎక్కుతారా?

మరోసారి బుల్లితెర టైగర్ అనిపించుకున్న ఎన్టీఆర్..

లోకేష్‌ నుంచి క్యాడర్‌ ఆశిస్తోంది అదేనా?

హాకీ ప్లేయర్స్ కు పంజాబ్ అరుదైన గుర్తింపు

తాలిబన్లకు ఒక్క అవకాశం ఇస్తే.... ?

విజయం మీదే: పోటీతత్వం మీలో విజయ కాంక్షను రగిలిస్తుంది... !

లోకేష్‌ రాటు తేలారా? తేల్చారా?

రాజశేఖర్ కూతురు మూవీ గురించి ఆసక్తికరమైన అప్డేట్..!

స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. నెలకి 7,800/- స్కాలర్ షిప్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>