SportsPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/test-match92d89d55-8d13-45ae-afe5-8c7c75362c47-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/test-match92d89d55-8d13-45ae-afe5-8c7c75362c47-415x250-IndiaHerald.jpgఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మరో విజయం కోసం తహతహలాడుతోంది. క్రికెట్ పుట్టిల్లు లార్డ్స్ మైదానంలో సూపర్ విక్టరీ సాధించిన కోహ్లీ సేన... మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రేపటి నుంచి హెడింగ్లీ లీడ్స్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించిన కోహ్లీ సేన... మరో విజయం సాధించి... సిరీస్ పై మరింత పట్టు సాధించేందుకు ప్లాన్ చేస్తోంది. వర్షం కారణంగా తొలి టెస్టు డ్రా గా ముగిసినప్పటికీ... రెండో టెస్టు మ్యాచ్ లో టెయిలెండర్ల సూపరTest Match{#}VIRAT KOHLI;Rishabh Pant;James Cameron;Army;Cricket;rahul;Ravindra Jadeja;Rahul Sipligunj;Varsham;Venkatesh;Indiaఇంగ్లండ్ పై కోహ్లీ టీమ్ ఆధిక్యం కొనసాగుతుందా..?ఇంగ్లండ్ పై కోహ్లీ టీమ్ ఆధిక్యం కొనసాగుతుందా..?Test Match{#}VIRAT KOHLI;Rishabh Pant;James Cameron;Army;Cricket;rahul;Ravindra Jadeja;Rahul Sipligunj;Varsham;Venkatesh;IndiaTue, 24 Aug 2021 17:53:00 GMTఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా మరో విజయం కోసం తహతహలాడుతోంది. క్రికెట్ పుట్టిల్లు లార్డ్స్ మైదానంలో సూపర్ విక్టరీ సాధించిన కోహ్లీ సేన... మరో కీలక పోరుకు సిద్ధమవుతోంది. భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య రేపటి నుంచి హెడింగ్లీ లీడ్స్ వేదికగా మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఐదు టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యం సాధించిన కోహ్లీ సేన... మరో విజయం సాధించి... సిరీస్ పై మరింత పట్టు సాధించేందుకు ప్లాన్ చేస్తోంది. వర్షం కారణంగా తొలి టెస్టు డ్రా గా ముగిసినప్పటికీ... రెండో టెస్టు మ్యాచ్ లో టెయిలెండర్ల సూపర్ ఇన్నింగ్స్ తో అనూహ్య విజయాన్ని భారత్ అందుకుంది.

ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని విభాగాల్లో ఇంగ్లండ్ కంటే కూడా టీమిండియా మెరుగ్గా కనిపిస్తోంది. కోహ్లీ సేనలో ఓపెనర్ల నుంచి టెయిలెండర్ల వరకు... అందరూ చక్కని ఫామ్ లో ఉన్నారు. ఓపెనర్లు రోహిత్ శర్మ, కేఎల్. రాహుల్ జట్టుకు మంచి పునాది వేస్తున్నారు. ఆ తర్వాత వచ్చే పుజారా, కోహ్లీ, రహానెలు స్కోరు బోర్డును ముందుకు నడిపిస్తున్నారు. కోహ్లీ ఫామ్ కొంత కలవరపెడుతున్నప్పటికీ... పుజారా, రహానెలు సెకండ్ టెస్టుకో ఫామ్ లోకి వచ్చారు. ఇక మిడిల్ ఆర్డర్ లో వచ్చే రిషబ్ పంత్, రవీంద్ర జడేజా సాధ్యమైనన్ని రన్స్ చేస్తూనే ఉన్నారు. చివర్లో వచ్చే షమీ, బూమ్రాలు లార్డ్స్ టెస్టులో ఆడిన విలువైన ఇన్నింగ్స్ ఎప్పటికీ హైలెట్ గా నిలుస్తోంది. అటు బౌలింగ్ విభాగంలో కూడా భారత బౌలర్లు చక్కని లైన్ అండ్ లెగ్త్ తో క్రమం తప్పకుండా వికెట్లు తీస్తూనే ఉన్నారు. లార్డ్స్ టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ ను తక్కువ స్కోరుకే పరిమితం చేసి సూపర్ విక్టరీకి కారణమయ్యారు.

ఇక ఇంగ్లండ్ విషయంలో టీమ్ కెప్టెన్ జో రూట్ మినహా మిగిలిన వారంతా ఘోరంగా విఫలమవుతున్నారు. తొలి రెండు టెస్టు మ్యాచ్ ల్లో రూట్ సెంచరీలు సాధించారు. కానీ రెండో టెస్టు సెకండ్ ఇన్నింగ్స్ లో రూట్ తక్కువ స్కోరుకే అవుటవ్వడంతో.. టీమ్ మొత్తం పేకమేడలా కూలిపోయింది. ఇంగ్లీష్ టీమ్ ఓపెనర్లు డోమ్ సిబ్లీ, రోరీ బర్న్స్ లు పెద్దగా రాణించటం లేదు. మూడో టెస్టుకు సిబ్లీని తొలగించిన ఇంగ్లంట్ టీమ్... డేవిడ్ మలన్ ను జట్టులోకి తీసుకుంది. మిడిల్ ఆర్డర్ లో జాని బెయిర్ స్టో, జోస్ బట్లర్ పెద్దగా ఆకట్టుకోలేకపోతున్నారు. ఆల్ రౌండర్లు మొయిన్ అలీ, రాబిన్ సన్ లు భారీ స్కోర్లు చేయడంలో విఫలమవుతున్నారు. బౌలింగ్ లో కాస్త పరవాలేదని అనిపిస్తున్నప్పటికీ... బ్యాటింగ్ లో మాత్రం లో స్కోర్ తో సరిపెడుతున్నారు. గాయం కారణంగా మార్క్ వుడ్ మూడో టెస్టుకు దూరమయ్యాడు. మెయిల్ పేసర్ జేమ్స్ ఆండర్సన్ ఒక్కడే టీమిండియాకు అడ్డంకిగా కనిపిస్తున్నాడు. మూడో టెస్టులో కోహ్లీ సేనను ఓడించి సిరీస్ సమం చేయాలని రూట్ సేన భావిస్తోంది. ఈ పరిస్థితుల్లో మూడో టెస్టు ఆసక్తికరంగా మారింది.





ఈ సినిమా చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది.. సురేష్ బాబు..!

భారతీయుల కోసం ఆపరేషన్ "దేవి శక్తి" !

మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్..!

జక్కన్న పై తారక్, చెర్రీ సెటైర్స్.. ఇలా అయితే కష్టమే అంటూ..?

సెంటు భూమి.. ఇదో కొత్త‌ర‌కం అవినీతి..??

జగన్ మాట కాదంటున్న కేంద్రం... రంగంలోకి కేంద్ర మంత్రి...?

కోపంతో ఊగిపోయిన మహేష్ హీరోయిన్...? ఫ్యాన్స్ నోటి దూల...?

ఇక తాలిబన్లకే వదిలేస్తున్నాం.. మళ్ళీ అదే చెబుతున్న బైడెన్?

ప్రపంచ కుబేరులు.. ఏం చదువుకున్నారో తెలుసా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>