PoliticsVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-28d7a1e7-3314-4441-87d6-266903d1d5bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/political-28d7a1e7-3314-4441-87d6-266903d1d5bc-415x250-IndiaHerald.jpgదివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన సంగతి విధితమే. తెలంగాణ రాష్ట్రం లో పార్టీ పెట్టినప్పటి నుంచి.... వైయస్ షర్మిల చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కెసిఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. అయితే వైయస్ షర్మిల పార్టీ పెట్టి దాదాపు నెల రోజులు దాటింది. ఈ నెల రోజుల వ్యవధిలోనే షర్మిల పార్టీలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీని.... పడగొట్టి తామే రాజన్న రాజ్యం తీసుకొస్తామన్నారు షర్మిలకు.... సొంత పార్టీలోనే కుys sharmila{#}Naresh;allari naresh;dr rajasekhar;indra;shankar;Telangana Rashtra Samithi TRS;Indira Gandhi;రాజీనామా;Mancherial;Sharmila;District;Yevaru;Telangana;Party;job;Telangana Chief Minister;Reddy;Governmentగందరగోళంలో వైఎస్ షర్మిల పార్టీ ?గందరగోళంలో వైఎస్ షర్మిల పార్టీ ?ys sharmila{#}Naresh;allari naresh;dr rajasekhar;indra;shankar;Telangana Rashtra Samithi TRS;Indira Gandhi;రాజీనామా;Mancherial;Sharmila;District;Yevaru;Telangana;Party;job;Telangana Chief Minister;Reddy;GovernmentTue, 24 Aug 2021 07:52:00 GMTదివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి కూతురు వైయస్ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీ పెట్టిన సంగతి విధితమే. తెలంగాణ రాష్ట్రం లో పార్టీ పెట్టినప్పటి నుంచి.... వైయస్ షర్మిల చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కెసిఆర్ ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తి చూపుతున్నారు. అయితే వైయస్ షర్మిల పార్టీ పెట్టి దాదాపు నెల రోజులు దాటింది. ఈ నెల రోజుల వ్యవధిలోనే షర్మిల పార్టీలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీని.... పడగొట్టి  తామే రాజన్న రాజ్యం తీసుకొస్తామన్నారు షర్మిలకు.... సొంత పార్టీలోనే కుంపటి మొదలైంది. పార్టీలో తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని.... పదవులను అమ్ముకుంటున్నారని గతంలో.. కొందరు జిల్లా స్థాయి నాయకులు మూకుమ్మడిగా.... షర్మిల పార్టీకి రాజీనామా చేశారు. 

ఈ  సంఘటన ఎవరు మరిచిపోకముందే రెండు రోజుల కింద.... షర్మిల పార్టీలో కీలకమైన నేత ఇందిరా శోభన్ రాజీనామా చేశా రు. దీంతో వైయస్ షర్మిలకు మరో ఊహించని షాక్ తగిలినట్టైంది. పార్టీలో కొందరికి మాత్రమే... ఆదరణ ఉంటుందని... కష్టపడి పని చేసేవారిని అసలు పట్టించుకోవడం లేదని... అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇంద్ర శోభన్ పార్టీ నుంచి బయటకు వచ్చారు. ఇక ప్రస్తుతం కొండ విశ్వేశ్వర్ రెడ్డి తప్ప... షర్మిల పార్టీలోని చెప్పుకోదగ్గ నాయకులు ఎవరూ లేరు. ఇది ఇదిలా ఉండగా... తాజాగా వైయస్ షర్మిలకు మరో షాక్ తగిలింది.  నిరాహార దీక్షలో భాగంగా ఇవాళ మంచిర్యాల జిల్లాలో షర్మిల పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఉద్యోగం రాలేదని ఆత్మహత్య చేసుకున్న... భూక్య నరేష్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు వైయస్ షర్మిల. ఈ నేపథ్యంలో భూక్య నరేష్ తండ్రి శంకర్ నాయక్ వైయస్ షర్మిల కు షాక్ ఇచ్చారు.
 
పరామర్శ లో భాగంగా తమ ఇంటికి... షర్మిల రావద్దంటూ హెచ్చరించారు. తమ కుమారుడు చనిపోయిన బాధలో తాము.... ఈ సమయంలో తమ కుటుంబంతో రాజకీయం చేసే వద్దంటూ షర్మిల కు వార్నింగ్ ఇచ్చారు. దీంతో వైయస్ షర్మిల మంచిర్యాల పర్యటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఇక ఇవ్వాళ మంచిర్యాల పర్యటనకు వైఎస్ షర్మిల వెళ్తుందా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. ఇలా వరుస షాక్ లతో కొత్త పార్టీ పెట్టిన వైయస్ షర్మిల.. సతమతమవుతున్నారు. పార్టీ పెట్టిన నెల రోజులకే... ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం... పార్టీ మనుగడకే సవాలుగా మారుతున్నాయి. ఇక ఇలాంటి ఈ పరిణామాల మధ్య వైయస్ షర్మిల ఇలాంటి వ్యూహరచనలు చేస్తారనేది వేచి చూడాల్సిందే.



సీఎం నివాసం వద్ద ఏం జరుగుతోంది? ఏంటీ అరాచ‌కం!

సీఎం కేసీఆర్ రిస్క్ చేస్తున్నారా ?

కరోనా కోసం కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తారా? అంత దమ్ముందా?

ఆర్టీసి రిటైర్డ్ ఉద్యోగులకు నరకం చూపెడుతున్న అధికారులు

హాల్ మార్కింగ్ రూల్స్ పై జువెలర్స్ నిరసన... ఎందుకు?

ఇండియా ఫర్‌ సేల్‌ : ఎయిర్‌పోర్టుల టార్గెట్‌ రూ.10 వేల కోట్లు..!?

మీ అభిమాన హీరోలకు ఉద్యోగాలొచ్చాయ్..!

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త

మరోసారి బుల్లితెర టైగర్ అనిపించుకున్న ఎన్టీఆర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>