PoliticsPaloji Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-vs-eetala-cad4c15b-5e98-493f-bb9c-a00dabc5d2b5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/kcr-vs-eetala-cad4c15b-5e98-493f-bb9c-a00dabc5d2b5-415x250-IndiaHerald.jpgహుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్క‌డ చూసినా.. ఎవ‌రి నోట వెంట విన్నా ప్రత్య‌క్షంగానో ప‌రోక్షంగానో హుజురాబాద్ ఉప ఎన్నిక విష‌యమై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌ర‌గుతోంది. భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో ఈట‌ల‌ను మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించడంతో ఎమ్మెల్యే ప‌ద‌వితో పాటు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఈట‌ల రాజేంద‌ర్‌. దీంతో రాష్ట్రంలో ఉప ఎన్నిక అనివార్య‌మ‌యింది. త‌రువాత ఆత్మ‌గౌర‌వం పేరుతో ఈట‌ల అధికార పార్టీ, కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నాడు. తాను భూ క‌బ్జాకు పాల్ప‌డ‌లేద‌ని అది నిరూkcr{#}MLA;రాజీనామా;Minister;Telangana Rashtra Samithi TRS;Huzurabad;CM;KCRకేసీఆర్ కు హుజు`రా`బాద్ భ‌యం ప‌ట్టుకుందా.?కేసీఆర్ కు హుజు`రా`బాద్ భ‌యం ప‌ట్టుకుందా.?kcr{#}MLA;రాజీనామా;Minister;Telangana Rashtra Samithi TRS;Huzurabad;CM;KCRTue, 24 Aug 2021 10:23:00 GMTహుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది. ఎక్క‌డ చూసినా.. ఎవ‌రి నోట వెంట విన్నా ప్రత్య‌క్షంగానో ప‌రోక్షంగానో హుజురాబాద్ ఉప ఎన్నిక విష‌యమై స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌ర‌గుతోంది. భూ క‌బ్జా ఆరోప‌ణ‌ల‌తో ఈట‌ల‌ను మంత్రి వ‌ర్గం నుంచి తొల‌గించడంతో ఎమ్మెల్యే ప‌ద‌వితో పాటు టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు ఈట‌ల రాజేంద‌ర్‌. దీంతో రాష్ట్రంలో ఉప ఎన్నిక అనివార్య‌మ‌యింది. త‌రువాత ఆత్మ‌గౌర‌వం పేరుతో ఈట‌ల అధికార పార్టీ, కేసీఆర్‌పై విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నాడు. తాను భూ క‌బ్జాకు పాల్ప‌డ‌లేద‌ని అది నిరూపిస్తే ఏ శిక్ష‌కైనా తాను సిద్ధంగా ఉన్నాని ఈట‌ల గ‌తంలోనే స్ప‌ష్టం చేశారు.


  అయితే, రాజ‌కీయంగా తాను నిల‌దొక్కుకోవాలంటే స్వంతంగా పోటీ చేయ‌డం లేదా ఇత‌ర పార్టీలో చేరాల‌ని చెప్పి అనంత‌రం కాషాయ కండువా క‌ప్పుకున్నాడు. ఈ నేప‌థ్యంలో హుజురాబాద్ ఎన్నిక‌లు టీఆర్ఎస్ వ‌ర్సెస్ ఈట‌ల రాజేంద‌ర్ అన్న‌ట్టుగా మారిపోయింది. దాదాపు 20 సంవ‌త్స‌రాలుగా గెలుపు త‌ప్ప ఓట‌మి అంటూ ఎరుగ‌ని ఈట‌ల రాజేంద‌ర్‌ను ఎదుర్కొవాలంటే త‌న‌దైన రీతిలో కేసీఆర్ రంగంలోకి దిగాల‌ని భావించిన‌ట్టు స‌మాచారం. హుజురాబాద్ లో ఒక వేళ రాజేంద‌ర్ గెలిస్తే.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీఆర్ఎస్ హ‌వా త‌గ్గిపోతుంద‌ని కేసీఆర్‌కు తెలుసు.


 దీంతో ఈ ప్ర‌భావం రాబోయే ఎన్నిక‌ల్లో ప‌డుతుంద‌ని ఊహించిన కేసీఆర్ ఎలాగైనా హుజురాబాద్ గ‌డ్డ‌పై త‌న టీఆర్ఎస్ జెండా ఎగుర‌వేయాల‌ని ప‌ట్టుద‌ల‌తో ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.  దీంతో హుజురాబాద్‌పైనే ఫుల్ ఫోక‌స్ పెట్టారు సీఎం కేసీఆర్‌. ఇప్ప‌టికే అక్క‌డి ద‌ళిత ప్ర‌జ‌ల‌ను త‌మ తిప్పుకోవడానికి అనూహ్యంగా ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టారు. దీని ద్వారా ఒక్కో ద‌ళిత కుటుంబానికి 10 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ను ప్ర‌క‌టించారు. `ద‌ళిత‌బంధు` ను పైలెట్ ప్రాజెక్టు హుజురాబాద్ నియోజ‌వ‌ర్గంలో అమ‌లు చేస్తున్నారు. దీనికోసం ఇప్ప‌టికే రెండు ద‌ఫాలుగా రూ.1000 కోట్లు విడుద‌ల చేసింది ప్ర‌భుత్వం.


 ఎలాగైనా ఈట‌ల రాజేంద‌ర్ ఓడించాల‌ని లేకుంటే రాష్ట్రంలో త‌న ఇమేజ్ దెబ్బ‌తింటుంద‌నే భ‌యంలో కేసీఆర్ ఉన్న‌ట్టు తెలుస్తోంది. దీంతో వ్యూహాలకు ప్ర‌తివ్యూహాలు ప‌న్నుతున్నాడు గులాబీ బాస్. ఇప్ప‌టికే టీఆర్ఎస్ అభ్య‌ర్థిగా గెల్లు శ్రీ‌నివాస్‌ను ప్ర‌క‌టించింది. శాల‌ప‌ల్లిలో నిర్వ‌హించిన కేసీఆర్ స‌భ‌తో అక్క‌డి పార్టీలో మ‌రింత ఉత్సాహం వ‌చ్చింది. ఈట‌ల‌ను దెబ్బ‌కొట్టేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాలు ర‌చిస్తున్నాడు.




   



అందరు తమన్నా గురించే మాట్లాడుకుంటారట!!

హుజూరాబాద్‌: కేసీఆర్‌కు ముందు గొయ్యి.. వెనుక నుయ్యి..?

రచయితగా మారిన కమల్ హాసన్..?

ఇదేం అరాచకం అయ్యా.. గుర్రం మీద లవ్...రేప్?

కరోనా వ్యాక్సిన్ ప్రచారం ఘనం..ఆచరణ శూన్యం.. ఇట్టా అయితే ఎట్టా?

రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు జారీ !

ఆగష్టు 24: చరిత్రలో ఈ నాటి సంఘటనలు..

సీఎం కేసీఆర్ రిస్క్ చేస్తున్నారా ?

కరోనా కోసం కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తారా? అంత దమ్ముందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Paloji Vinay]]>