ViralSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-news-11f5af08-072e-4f77-88b9-21d36c59b2d6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/viral/127/viral-news-11f5af08-072e-4f77-88b9-21d36c59b2d6-415x250-IndiaHerald.jpgపూర్వం దేశాలన్నీ కూడా రాజ్యాలుగా ఉండేవన్న సంగతి అందరికీ విదితమే. రాచరికం అమలులో ఉన్న ఆ రాజ్యాల్లో రాజవంశీకులే పాలకులుగా ఉండేవారు. కాగా, రాజ్యానికి కొన్ని వింత రూల్స్ కూడా ఉంటుంటాయి. అలాంటి విచిత్ర సామ్రాజ్యం ఒక దగ్గర ఉంది. అది ఎక్కడంటే.. ఈ రాజ్యంలో మొత్తం జనాభా కేవలం 11 మంది కావడం గమనార్హం. ఈ రాజ్యపు రాజు నిక్కర్ వేసుకుని పడవ నడుపుతూ బతికేస్తుంటాడు. ప్రపంచంలోనే అత్యంత చిన్న రాజ్యం అయిన ఈ రాజ్యం ఇటలీలోని సార్డీనియా ప్రావిన్స్‌కు సమీపంలో మధ్యధరా సముద్రంలో ఉంది. ఈ రాజ్యం ఏర్పడి 180 ఏళ్లు గడిచిందట. viral-news {#}chakravarthy;gold;king;marriage;Italy;Populationవైరల్ : మేకలకు స్వర్ణ దంతాలు.. ఎక్కడంటే..?వైరల్ : మేకలకు స్వర్ణ దంతాలు.. ఎక్కడంటే..?viral-news {#}chakravarthy;gold;king;marriage;Italy;PopulationTue, 24 Aug 2021 12:00:00 GMTపూర్వం దేశాలన్నీ కూడా రాజ్యాలుగా ఉండేవన్న సంగతి అందరికీ విదితమే. రాచరికం అమలులో ఉన్న ఆ రాజ్యాల్లో రాజవంశీకులే పాలకులుగా ఉండేవారు. కాగా, రాజ్యానికి కొన్ని వింత రూల్స్ కూడా ఉంటుంటాయి. అలాంటి విచిత్ర సామ్రాజ్యం ఒక దగ్గర ఉంది. అది ఎక్కడంటే.. ఈ రాజ్యంలో మొత్తం జనాభా కేవలం 11 మంది కావడం గమనార్హం. ఈ రాజ్యపు రాజు నిక్కర్ వేసుకుని పడవ నడుపుతూ బతికేస్తుంటాడు. ప్రపంచంలోనే అత్యంత చిన్న రాజ్యం అయిన ఈ రాజ్యం ఇటలీలోని సార్డీనియా ప్రావిన్స్‌కు సమీపంలో మధ్యధరా సముద్రంలో ఉంది. ఈ రాజ్యం ఏర్పడి 180 ఏళ్లు గడిచిందట. దాని పేరే టవోలారా. 

ఈ దీవి 5 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో మాత్రమే ఉంటుంది. ఈ రాజ్య చక్రవర్తి పేరు ఆంటోనియో బర్దలివోని. అయితే, అందరూ రాజుల్లాగా ఇతను కిరీటాలేమీ ధరించడు. కేవలం నిక్కర్ వేసుకుని రాజ్యంతో తిరుగుతుంటాడు. ఈయనకు ఓన్లీ ఫుడ్ ఫ్రీగా లభిస్తుంది. మిగతా అన్ని అవసరాల కోసం ఈయన కష్టపడాల్సిందే. ఈ టవోలారా సామ్రాజ్యం ఇటీవలే 180వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకుంది. అయితే, అతి తక్కువ మంది జనాభా అనగా ఉన్న జనాభాతోనే ఉత్సవాలు కానిచ్చేశారట. 

టవోలారా రాజ్యం ఏర్పాటు ఇటలీ దేశంగా అవతరించకముందు సార్డీనియా రాజ్యంలో ఉండేదట. ఈ దేశపు రాజు చార్లో ఆల్బెర్టో. ఈ ప్రాంతంలో నివసరించే పురుషులు ఎవరైనా ఒకే పెళ్లి చేసుకోవాలనే రూల్ ఉంది. దీనిని అమలు చేసేవాడు రాజు ఆల్బెర్టో. రెండు పెండ్లిళ్లు చేసుకోవడం నేరం అని ప్రకటించడంతో పాటు ఎవరైనా అలాచేస్తే శిక్ష తప్పదని పేర్కొనేవాడు. అలా ఈ రాజ్యంలో ఓ డిఫరెంట్ రూలే అమలులో ఉంది. ఇకపోతే టవోలారా దీవిలో ఉండే స్పెషాలిటీ ఏంటంటే.. బంగారు రంగు పళ్లు ఉండే మేకలు ఉంటాయిక్కడ. ప్రపంచంలో ఇటువంటి మేకలు ఇంక ఎక్కడా లేవని అవి ఇక్కడ మాత్రమే ఉంటాయని స్థానికులు పేర్కొంటున్నారు. ఈ డిఫరెంట్ గోట్స్ చూడటానికి సార్డీనియా రాజు 1836లో ఆ దీవికి వచ్చాడట. అలా ఈ డిఫరెంట్ గోట్స్ కూడా ప్రపంచానికి తెలిసిపోయింది.



'డెల్టా'పై బూస్ట‌ర్ డోస్ తో యుద్ధం?

వైరల్ : మేకలకు స్వర్ణ దంతాలు.. ఎక్కడంటే..?

థర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?

రాజకీయాల్లో చిరు గాడ్ ఫాదర్ అవుతారా..??

పెన్షన్ కోసం భర్తను చంపేసింది...?

ఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??

అక్కడ ఆన్ లైన్ లో కూడా ఉంటాయి మరి..

వేరే వ్యక్తితో భార్య సహజీవనం.. అడవిలో శమైన మహిళ..??

హుజూరాబాద్‌: కేసీఆర్‌కు ముందు గొయ్యి.. వెనుక నుయ్యి..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>