MoviesN.ANJIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akshay-kumar24e43484-6f70-433d-9d27-784b977a95b6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/akshay-kumar24e43484-6f70-433d-9d27-784b977a95b6-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో సినీ ప్రముఖులు అందరు ఇంటికే పరిమితమైయ్యారు. అయితే కోవిడ్ ఫస్ట్ వేవ్ అలాగే సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు కళకళలాడాయి అంటే అది మన తెలుగు రాష్ట్రాల్లోనే అని చెప్పాలి మరి. ఇక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చాలా వరకు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాది 10 వరకు సినిమాలు హిట్లు కొట్టింది టాలీవుడ్ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.akshay kumar{#}Akshay Kumar;Tollywood;Success;Telugu;Cinemaఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??ఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??akshay kumar{#}Akshay Kumar;Tollywood;Success;Telugu;CinemaTue, 24 Aug 2021 11:00:00 GMTకరోనా వైరస్ కారణంగా దేశంలో లాక్‌డౌన్ ప్రకటించడంతో సినీ ప్రముఖులు అందరు ఇంటికే పరిమితమైయ్యారు. అయితే కోవిడ్ ఫస్ట్ వేవ్ అలాగే సెకండ్ వేవ్ తర్వాత థియేటర్లు కళకళలాడాయి అంటే అది మన తెలుగు రాష్ట్రాల్లోనే అని చెప్పాలి మరి. ఇక ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా చాలా వరకు సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఏడాది 10 వరకు సినిమాలు హిట్లు కొట్టింది టాలీవుడ్ మాత్రమే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అంతేకాదు.. ఓవర్సీస్‌లో కూడా రూ.1 మిలియన్ వసూళ్లను రాబట్టినవి మన తెలుగు సినిమాలే కావడం మరో విశేషం అనే చెప్పాలి.

ఇక తమిళ, కన్నడ, మలయాళం ఇలా అన్ని సినీ పరిశ్రమలోనూ థియేటర్లు తెరుచుకున్నా కొత్త సినిమాలు రిలీజ్ అయినా జనాలను రప్పించడంలో సక్సెస్ అందుకోలేకపోయాయి. అలాగే బాలీవుడ్లో కూడా ఈ మధ్యనే థియేటర్లు ఓపెన్ అయ్యాయి. అయితే అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ‘బెల్ బాటమ్’ మూవీ విడుదల అయ్యింది. ఈ మూవీకి సూపర్ హిట్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం చాలా ఘోరంగా నమోదు అయ్యినట్లు తెలుస్తుంది.

ఇక ఈ సినిమా మొదటి రోజు 2.65 కోట్లు, రెండో రోజు రూ.2.7 కోట్లు, మూడో రోజు 3.1 కోట్లు, నాలుగవ రోజు రూ.4.5 కోట్ల నెట్ కలెక్షన్స్‌ను రాబట్టింది. కాగా.. నాలుగు రోజులు కలుపుకుని రూ.12.95 కోట్ల నెట్ కలెక్షనను మాత్రమే రాబట్టింది. అయితే ‘బెల్ బాటమ్’ కు రూ.30 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్లు సమాచారం. ఇక 4 రోజులకి సగం కూడా రికవర్ కాలేదంటా. అంతేకాక.. మొదటి వారం పూర్తయ్యేసరికి రూ.15 కోట్లు అనుకున్నా.. మరో రూ.15 కోట్లు బయ్యర్లకు నష్టం వాటిల్లింది అనే చెప్పాలి. కాగా 2012లో వచ్చిన ‘జోకర్’ సినిమా తర్వాత అక్షయ్ ఫేస్ చేసిన డిజాస్టర్ సినిమా ఇదే కావడం గమనార్హం.



థర్డ్ వేవ్ దెబ్బ... మరోరాష్ట్రంలో లాక్ డౌన్...?

రాజకీయాల్లో చిరు గాడ్ ఫాదర్ అవుతారా..??

పెన్షన్ కోసం భర్తను చంపేసింది...?

ఇండస్ట్రీకే దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన హీరో..??

అక్కడ ఆన్ లైన్ లో కూడా ఉంటాయి మరి..

వేరే వ్యక్తితో భార్య సహజీవనం.. అడవిలో శమైన మహిళ..??

హుజూరాబాద్‌: కేసీఆర్‌కు ముందు గొయ్యి.. వెనుక నుయ్యి..?

రచయితగా మారిన కమల్ హాసన్..?

ఇదేం అరాచకం అయ్యా.. గుర్రం మీద లవ్...రేప్?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>