MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi22e000ec-eb9c-4678-a63d-1d961cacbdd1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chirangeevi22e000ec-eb9c-4678-a63d-1d961cacbdd1-415x250-IndiaHerald.jpgప్రముఖ దర్శకుడు బాపు తీసే సినిమాలలోని సన్నివేసాలు ఒక మంచి పెయింటింగ్ చూసినంత అనుభూతిని కలిగిస్తాయి. అప్పట్లో ఆయన తీసే సినిమాలకు సంబంధించిన ప్రతిసన్నివేసాన్ని ఒక స్కెచ్ గా గీసుకుని ఆతరువాత షూట్ చేసేవారని అంటారు. మొన్న జరిగిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజునాడు ఒక ప్రముఖ దినపత్రిక గతంలో బాపు చిరంజీవి కళ్ళను గురించి చేసిన కామెంట్స్ ను ప్రచురించింది. 150 సినిమాలకు పైగా నటించి ఇప్పటికి ఇండస్ట్రీ రారాజు గా చిరంజీవి వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఒక హీరో ఇంతకాలం సుదీర్ఘగంగా కెరియర్ కCHIRANGEEVI{#}Tiger;Mohandas Karamchand Gandhi;Bapu;Josh;Director;Darsakudu;Chiranjeevi;Hero;Industryచిరంజీవి కళ్ళల్లోని పవర్ ను ముందేగుర్తించిన బాపు !చిరంజీవి కళ్ళల్లోని పవర్ ను ముందేగుర్తించిన బాపు !CHIRANGEEVI{#}Tiger;Mohandas Karamchand Gandhi;Bapu;Josh;Director;Darsakudu;Chiranjeevi;Hero;IndustryTue, 24 Aug 2021 08:00:00 GMTప్రముఖ దర్శకుడు బాపు తీసే సినిమాలలోని సన్నివేసాలు ఒక మంచి  పెయింటింగ్ చూసినంత అనుభూతిని కలిగిస్తాయి. అప్పట్లో ఆయన తీసే సినిమాలకు సంబంధించిన ప్రతిసన్నివేసాన్ని ఒక స్కెచ్ గా గీసుకుని  ఆతరువాత షూట్ చేసేవారని అంటారు. మొన్న జరిగిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజునాడు ఒక ప్రముఖ దినపత్రిక గతంలో బాపు చిరంజీవి కళ్ళను గురించి చేసిన కామెంట్స్ ను ప్రచురించింది.  


150 సినిమాలకు పైగా నటించి ఇప్పటికి ఇండస్ట్రీ రారాజు గా చిరంజీవి వెలుగొందుతున్న విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో ఒక హీరో ఇంతకాలం సుదీర్ఘగంగా కెరియర్ కొనసాగించడమే కాకుండా ఇప్పటికి నెంబర్ వన్ స్థానంలో కొనసాగడం సర్వసాధారణ మైనవిషయం కాదు. ఈవిషయాల పై బాపు అప్పట్లోనే స్పందించారు. అడయార్ యూనివర్శిటీలో నటన పై శిక్షణ పొందే సమయంలోనే చిరంజీవికి ఊహించని విధంగానే సినిమాలలో  అవకాశాలు వచ్చాయి.  


వాస్తవానికి చిరంజీవి మొదట్లో నటించిన ‘పునాది రాళ్ళు’   ‘ప్రాణంఖరీదు’  సినిమాలు ఆర్ధికంగా చెప్పుకోదగ్గ స్థాయిలో విజయవంతం కాకపోయినా  ఆరెండు సినిమాలు చిరంజీవిని అప్పటి ప్రముఖ దర్శకుల దృష్టిలో పడేలా చేసాయి. ఆరోజులలో ప్రముఖ దర్శకుడు బాపు తాను తీయబోయే ‘మన ఊరి పాండవులు’ చిత్రంలో కీలకమైన ఒక పాత్రకోసం చిరంజీవిని ఆ పాత్రకు సంబంధించి తన ఆఫీస్ కు పిలిపించి ఆడిషన్ చేసాడట.


ఆ ఆడిషన్ పూర్తి అయి చిరంజీవి అక్కడ నుండి వెళ్ళిపోయాక బాపు మెగా స్టార్ కళ్ళ పై  కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడట. ‘ఒక రకంగా చూస్తే లేడి కళ్లల్లో గ్రేసు మరో రకంగా చూస్తే పులి కళ్లలోని రౌద్రం కనిపిస్తున్నాయి’  అంటూ చిరంజీవి కళ్ళ గురించి కామెంట్స్ చేసాడట. ఇప్పుడు ఆనాడు  బాపు చేసిన కామెంట్స్ మళ్ళీ వైరల్ అవుతూ మెగా అభిమానులలో జోష్ ను నింపుతూ మెగా స్టార్ పుట్టినరోజు అయిపోయి రెండు రోజులు గడిచిపోతున్నా మెగా అభిమానులు సోషల్ మీడియాలో సందడి చేసేలా మారుతున్నాయి..  






నేడు ఖాతాల్లోకి న‌గ‌దు జ‌మ‌?

సీఎం కేసీఆర్ రిస్క్ చేస్తున్నారా ?

కరోనా కోసం కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తారా? అంత దమ్ముందా?

ఆర్టీసి రిటైర్డ్ ఉద్యోగులకు నరకం చూపెడుతున్న అధికారులు

హాల్ మార్కింగ్ రూల్స్ పై జువెలర్స్ నిరసన... ఎందుకు?

ఇండియా ఫర్‌ సేల్‌ : ఎయిర్‌పోర్టుల టార్గెట్‌ రూ.10 వేల కోట్లు..!?

మీ అభిమాన హీరోలకు ఉద్యోగాలొచ్చాయ్..!

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త

మరోసారి బుల్లితెర టైగర్ అనిపించుకున్న ఎన్టీఆర్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>