BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/taliban04fa0e2f-d2f5-444d-b056-c3b9427a86a0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/taliban04fa0e2f-d2f5-444d-b056-c3b9427a86a0-415x250-IndiaHerald.jpg ఆఫ్గ‌నిస్తాన్‌లోని కీల‌క ప్రాంత‌మైన పంజ్‌షేర్‌లో తాలిబ‌న్ల‌కు, పంజ్‌షేర్‌ సైన్యానికి భీక‌ర‌పోరు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. 50 మంది తాలిబ‌న్ ఫైట‌ర్లు హ‌త‌మ‌య్యారు. మ‌రో 20 మందిని ఆఫ్గ‌న్ సైన్యం బంధించింది. ఆఫ్గ‌న్ మొత్తం తాలిబ‌న్ల వ‌శ‌మైన‌ప్ప‌టికీ వారికి కొరుకుడు ప‌డ‌ని ప్రాంతంగా పంజ్‌షేర్ లోయ నిలిచింది. ఈ ప్రాంతంలో ఉండేవారంతా తాలిబ‌న్ల‌కు వ్య‌తిరేక‌మ‌ని ప్ర‌క‌టించ‌డ‌తోపాటు గ‌తంలో కూడా వీరిని ఓడించారు. వీరి బంధువుల‌ను, కుటుంబ స‌భ్యుల‌ను తాలిబ‌న్లు హ‌త‌మార్చ‌డ‌మే దీనికి కార‌ణం. భౌగోళిక ప‌రిస్థtaliban{#}Armyపంజ్‌షేర్‌లో భీక‌ర‌పోరు?పంజ్‌షేర్‌లో భీక‌ర‌పోరు?taliban{#}ArmyTue, 24 Aug 2021 09:40:01 GMT
ఆఫ్గ‌నిస్తాన్‌లోని కీల‌క ప్రాంత‌మైన పంజ్‌షేర్‌లో తాలిబ‌న్ల‌కు, పంజ్‌షేర్‌ సైన్యానికి భీక‌ర‌పోరు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. 50 మంది తాలిబ‌న్ ఫైట‌ర్లు హ‌త‌మ‌య్యారు. మ‌రో 20 మందిని ఆఫ్గ‌న్ సైన్యం బంధించింది. ఆఫ్గ‌న్ మొత్తం తాలిబ‌న్ల వ‌శ‌మైన‌ప్ప‌టికీ వారికి కొరుకుడు ప‌డ‌ని ప్రాంతంగా పంజ్‌షేర్ లోయ నిలిచింది. ఈ ప్రాంతంలో ఉండేవారంతా తాలిబ‌న్ల‌కు వ్య‌తిరేక‌మ‌ని ప్ర‌క‌టించ‌డ‌తోపాటు గ‌తంలో కూడా వీరిని ఓడించారు. వీరి బంధువుల‌ను, కుటుంబ స‌భ్యుల‌ను తాలిబ‌న్లు హ‌త‌మార్చ‌డ‌మే దీనికి కార‌ణం. భౌగోళిక ప‌రిస్థితుల దృష్ట్యా పంజ్ షేర్ లోయ‌ను ఆక్ర‌మించుకోవ‌డం తాలిబ‌న్ల‌కు దుర్ల‌భ‌మ‌వ‌తుంది. గ‌తంలో ర‌ష్యా సైన్యాన్ని కూడా ఇక్క‌డి యోధులు తిప్పికొట్టారు. ఇప్ప‌టికే ఆఫ్గ‌న్‌కు తాను తాత్క‌లిక అధ్య‌క్షుడిన‌ని ప్ర‌క‌టించుకున్న ఉపాధ్య‌క్షుడు అమ్రుల్లా స‌లేహ్‌, అహ్మ‌ద్‌మ‌సూద్‌తో చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని తాలిబ‌న్లు నిర్ణ‌యించుకున్న‌ట్లు స‌మాచారం. ఇప్ప‌టివ‌ర‌కు 300 మంది తాలిబ‌న్ ఫైట‌ర్ల‌ను హ‌త‌మార్చిన‌ట్లు పంజ్‌షేర్ సైన్యం వెల్ల‌డించింది. ఈ విష‌యంపై అంత‌ర్జాతీయ మీడియాలోను క‌థ‌నాలు వ‌స్తున్న‌ప్ప‌టికీ తాలిబ‌న్ ప్ర‌భుత్వం స్పందించ‌లేదు.





రచయితగా మారిన కమల్ హాసన్..?

ఇదేం అరాచకం అయ్యా.. గుర్రం మీద లవ్...రేప్?

కరోనా వ్యాక్సిన్ ప్రచారం ఘనం..ఆచరణ శూన్యం.. ఇట్టా అయితే ఎట్టా?

రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు జారీ !

ఆగష్టు 24: చరిత్రలో ఈ నాటి సంఘటనలు..

సీఎం కేసీఆర్ రిస్క్ చేస్తున్నారా ?

కరోనా కోసం కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తారా? అంత దమ్ముందా?

ఆర్టీసి రిటైర్డ్ ఉద్యోగులకు నరకం చూపెడుతున్న అధికారులు

హాల్ మార్కింగ్ రూల్స్ పై జువెలర్స్ నిరసన... ఎందుకు?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>