PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/center-makes-key-decision-in-clinical-trials2f2ca5a8-ced5-415a-9f5a-e5ce2fb15490-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/center-makes-key-decision-in-clinical-trials2f2ca5a8-ced5-415a-9f5a-e5ce2fb15490-415x250-IndiaHerald.jpgకరోనా కట్టడికి పలు సంస్థలు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. పోటాపోటీగా వ్యాక్సిన్లను తయారీలో నిమగ్నమయ్యాయి. అయితే ఇలాంటి సందర్భంలో ఆ మందు పనిచేస్తుందా.. లేదా అనేదానిపై క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నాయి. అలా క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వారి విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. Center makes key decision in clinical trials{#}Shield;American Samoa;India;Coronavirusక్లినికల్ ట్రయల్స్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం..!క్లినికల్ ట్రయల్స్ విషయంలో కేంద్రం కీలక నిర్ణయం..!Center makes key decision in clinical trials{#}Shield;American Samoa;India;CoronavirusTue, 24 Aug 2021 09:00:00 GMTవ్యాక్సినేషన్ సర్టిఫికెట్ల విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. క్లినికల్ ట్రయల్స్ లో పాల్గొన్న వారికి డిజిటల్ సర్టిఫికెట్లు ఇస్తామని ప్రకటించింది. కరోనా కట్టడే లక్ష్యంగా మన దేశంలో కోవాగ్జిన్, కోవి షీల్డ్ టీకాలు తయారయ్యాయి. వాటి ట్రయల్స్ లో దాదాపు 11వేల 349మంది పాల్గొన్నారు. వారందరూ డిజిటల్ వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లను కొవిన్ పోర్టల్ నుంచి డౌన్ లోడ్ చేసుకునేలా కేంద్రం అవకాశమిచ్చింది.

ఇక ఫైజర్-బయోఎన్ టెక్ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన వ్యాక్సిన్ కు అమెరికా ప్రభుత్వం పూర్తి స్థాయి అనుమతులు ఇచ్చింది. కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటి వరకు అత్యవసర వినియోగం కోసమే దీనికి అనుమతి ఉండేది. అయితే తాజాగా పూర్తిస్థాయి అనుమతులు ఇస్తూ.. అమెరికా ఔషధ నియంత్రణ సంస్థ ప్రకటన జారీ చేసింది. కొన్ని పరిశోధనల్లో ఈ టీకా 97శాతం సామర్థ్యంతో పనిచేసినట్టు తేలింది.

మరోవైపు 12ఏళ్ల వయసు పైబడి ఒకటి కంటే ఎక్కువ వ్యాధులున్న పిల్లలకు మొదటగా జైకోవ్-డి వ్యాక్సిన్ వేయనున్నారు. ఈ మేరకు నేషనల్ ఇమ్యూనైజేషన్ టెక్నికల్ అడ్వైజర్ ఎన్.కె అరోరా వెల్లడించారు. పిల్లల కోసం భారత్ బయోటెక్ తయారు చేసిన కొవాగ్జిన్ టీకాకు సెప్టెంబర్-అక్టోబర్ మధ్యలో అనుమతి లభించే అవకాశముందన్నారు. కాగా జైడస్ క్యాడిలా వ్యాక్సిన్ జైకోవ్-డి అత్యవసర వినియోగానికి ఇటీవలే పర్మిషన్ లభించింది. ఈ టీకా మూడు డోసులుగా వేయనున్నారు.  

మన దేశంలో కరోనా సెకండ్ వేవ్ దాదాపు ముగిసిందనీ.. అయితే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణుల కమిటీ హెచ్చరించింది. కేంద్రం పరిధిలోని ఎన్డీఆర్ఎఫ్ నిపుణుల కమిటీ తన నివేదిక పీఎమ్ఓకు సమర్పించింది. సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ఎప్పుడైనా విరుచుకుపడొచ్చన రోజుకు 6లక్షల కేసులు వస్తాయని వెల్లడించింది. వ్యాక్సినేషన్ వేగవంతం చేయాలని సూచించింది. భారీ సంఖ్యలో పిల్లలు వైరస్ బారిన పడితే చికిత్సకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించింది నిపుణుల కమిటీ.  







కాశ్మీర్ ఎన్ కౌంటర్: చిక్కుతున్న ఉద్రవాదులు ఏమవుతున్నారు?

రికార్డు స్థాయిలో అమెరికా వీసాలు జారీ !

ఆగష్టు 24: చరిత్రలో ఈ నాటి సంఘటనలు..

సీఎం కేసీఆర్ రిస్క్ చేస్తున్నారా ?

కరోనా కోసం కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తారా? అంత దమ్ముందా?

ఆర్టీసి రిటైర్డ్ ఉద్యోగులకు నరకం చూపెడుతున్న అధికారులు

హాల్ మార్కింగ్ రూల్స్ పై జువెలర్స్ నిరసన... ఎందుకు?

ఇండియా ఫర్‌ సేల్‌ : ఎయిర్‌పోర్టుల టార్గెట్‌ రూ.10 వేల కోట్లు..!?

మీ అభిమాన హీరోలకు ఉద్యోగాలొచ్చాయ్..!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>