PoliticsM N Amaleswara raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpa65eebc0-cec7-41e7-9a18-75853d2a0dee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpa65eebc0-cec7-41e7-9a18-75853d2a0dee-415x250-IndiaHerald.jpgఏపీలో పలువురు మంత్రులకు వ్యతిరేక గాలులు వీస్తున్నాయని కొన్ని సర్వేలు వస్తున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా అధికార వైసీపీలో చాలామంది మంత్రులు రెండేళ్లలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. వారు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కూడా విఫలమవుతున్నారని, అలాంటి వారిని జగన్ నెక్స్ట్ మంత్రి వర్గం నుంచి తప్పిస్తారని కథనాలు వస్తున్నాయి. అలాగే వారు నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచే అవకాశాలు కూడా లేవని తెలుస్తోంది. tdp{#}Godavari River;WOMEN;Kothapalli Samuel Jawahar;Elections;Minister;Party;TDP;Jaganవనితకు మళ్ళీ ఛాన్స్ లేదా? జవహర్ రూట్ క్లియర్ అయినట్లేనా?వనితకు మళ్ళీ ఛాన్స్ లేదా? జవహర్ రూట్ క్లియర్ అయినట్లేనా?tdp{#}Godavari River;WOMEN;Kothapalli Samuel Jawahar;Elections;Minister;Party;TDP;JaganTue, 24 Aug 2021 02:00:00 GMTఏపీలో పలువురు మంత్రులకు వ్యతిరేక గాలులు వీస్తున్నాయని కొన్ని సర్వేలు వస్తున్న విషయం తెలిసిందే. ఊహించని విధంగా అధికార వైసీపీలో చాలామంది మంత్రులు రెండేళ్లలో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురుకుంటున్నట్లు ప్రచారం నడుస్తోంది. వారు మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కూడా విఫలమవుతున్నారని, అలాంటి వారిని జగన్ నెక్స్ట్ మంత్రి వర్గం నుంచి తప్పిస్తారని కథనాలు వస్తున్నాయి. అలాగే వారు నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ గెలిచే అవకాశాలు కూడా లేవని తెలుస్తోంది.

అలా మంత్రిగా, ఎమ్మెల్యేగా మంచి పనితీరు కనబర్చడంలో వెనుకబడి ఉన్నవారిలో తానేటి వనిత ముందు వరుసలో ఉన్నారని తాజా సర్వేలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో వనిత...పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరులో పోటీ చేసి గెలిచారు. టీడీపీకి కంచుకోటగా ఉన్న కొవ్వూరులో వనిత మంచి మెజారిటీతో గెలిచారు. ఇక ఇలా గెలిచిన వనితకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. వనితకు క్యాబినెట్‌లో చోటు కూడా ఇచ్చారు. మహిళా, శిశు సంక్షేమ శాఖని వనితకు అప్పగించారు.

మరి మంత్రిగా వనిత మెరుగిన పనితీరు కనబరుస్తున్నారా? అంటే అంతగా లేదనే తెలుస్తోంది. మంత్రిగా వనితకు మంచి మార్కులు పడలేదని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే, వనిత మంత్రి అనే సంగతి రాష్ట్రంలో చాలామంది ప్రజలకు తెలియదని, అసలు సొంత పార్టీ క్యాడర్‌కే పెద్దగా అవగాహన లేదని విశ్లేషకులు చెబుతున్నారు.

అంటే ఆ స్థాయిలో వనిత పనితీరు ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో నియోజకవర్గంలో కూడా వనిత వెనుకబడి ఉన్నారని సర్వేలు చెబుతున్నాయి. కొవ్వూరులో వనితపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఓడిపోయే వారిలో వనిత కూడా ఉంటారని అంటున్నారు. అయితే వనితకు ఇలా మైనస్ ఎక్కువ ఉండటంతో టీడీపీ నేత, మాజీ మంత్రి జవహర్‌కు బాగా ప్లస్ అవుతుంది. వచ్చే ఎన్నికల్లో కొవ్వూరులో జవహర్ విజయానికి రూట్ క్లియర్ అయినట్లే అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.  



వనితకు మళ్ళీ ఛాన్స్ లేదా? జవహర్ రూట్ క్లియర్ అయినట్లేనా?

మరోసారి బుల్లితెర టైగర్ అనిపించుకున్న ఎన్టీఆర్..

లోకేష్‌ నుంచి క్యాడర్‌ ఆశిస్తోంది అదేనా?

హాకీ ప్లేయర్స్ కు పంజాబ్ అరుదైన గుర్తింపు

తాలిబన్లకు ఒక్క అవకాశం ఇస్తే.... ?

విజయం మీదే: పోటీతత్వం మీలో విజయ కాంక్షను రగిలిస్తుంది... !

లోకేష్‌ రాటు తేలారా? తేల్చారా?

రాజశేఖర్ కూతురు మూవీ గురించి ఆసక్తికరమైన అప్డేట్..!

స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. నెలకి 7,800/- స్కాలర్ షిప్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - M N Amaleswara rao]]>