BusinessPodili Ravindranatheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/tata-punch39612742-5813-4e66-974e-47ec3c999e8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/business/technology_videos/tata-punch39612742-5813-4e66-974e-47ec3c999e8a-415x250-IndiaHerald.jpgదీపావళి పండుగ నాటికి పంచ్ ఇచ్చేందుకు టాటా సంస్థ ప్లాన్ చేస్తోంది. మోటర్ వాహనాల తయారీలో దిగ్గజ సంస్థగా గుర్తింపు ఉన్న టాటా మోటార్స్.. మరో సరికొత్త వాహనాన్ని మార్కెట్ లోకి విడుదల చేయనుంది. దాని పేరే పంచ్. ఇప్పటికి ప్రయాణికుల కోసం రకరకాల వాహనాలు అందుబాటులో ఉంచిన టాటా మోటార్స్... లెటెస్ట్ ట్రెండ్ కు అనుకూలంగా పంచ్ ను రెడీ చేసింది. మార్కెట్ లో ప్రస్తుతం అంతా స్పోర్ట్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. స్టోర్ట్స్ యుటిలిటీ వెహికల్ వైపే వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సీటింగ్, స్పీడ్, లగేజ్ స్పTata Punch{#}Diwali;festival;vehicles;November;vegetable market;Kia Motorsదీపావళికి టాటా పంచ్దీపావళికి టాటా పంచ్Tata Punch{#}Diwali;festival;vehicles;November;vegetable market;Kia MotorsTue, 24 Aug 2021 06:54:00 GMTదీపావళి పండుగ నాటికి పంచ్ ఇచ్చేందుకు టాటా సంస్థ ప్లాన్ చేస్తోంది. మోటర్ వాహనాల తయారీలో దిగ్గజ సంస్థగా గుర్తింపు ఉన్న టాటా మోటార్స్.. మరో సరికొత్త వాహనాన్ని మార్కెట్ లోకి విడుదల చేయనుంది. దాని పేరే పంచ్. ఇప్పటికి ప్రయాణికుల కోసం రకరకాల వాహనాలు అందుబాటులో ఉంచిన టాటా మోటార్స్... లెటెస్ట్ ట్రెండ్ కు అనుకూలంగా పంచ్ ను రెడీ చేసింది. మార్కెట్ లో ప్రస్తుతం అంతా స్పోర్ట్ వాహనాల వినియోగం బాగా పెరిగింది. స్టోర్ట్స్ యుటిలిటీ వెహికల్ వైపే వినియోగదారులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. సీటింగ్, స్పీడ్, లగేజ్ స్పేస్... ఇలా ఎన్నో విభాగాల్లో ప్రస్తుతం ఎస్.యూ.వీ.లు కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అందుకో దాదాపు అన్ని సంస్థలు కూడా స్పోర్ట్స మోడల్స్ వైపు పరుగులు పెడుతున్నాయి. ఇప్పుడు టాటా మోటర్స్ కూడా అటు వైపే నడుస్తోంది. ఇప్పటికే మార్కెట్ లో ఉన్న హారియర్, నిక్సాన్ వాహనాల కంటే కూడా మెరుగైన ఫీచర్లతో పంచ్ మోడల్ ను రెడీ చేసింది.

2020లో ఢిల్లీలో జరిగిన నేషనల్ ఆటో ఎక్స్ పోలో టాటా మోటర్స్ సంస్థ హెచ్ 2 ఎక్స్ భావనతో పంచ్ వాహనాన్ని రూపొందించింది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న కాంపాక్ట్ ఎస్.యూ.వీ. నెక్సాన్ మోడల్ కంటే కూడా తక్కువ పరిమాణంలో పంచ్ ఉంటుందని ఇప్పటి టాటా ప్రతినిధులు తెలిపారు. దీనిని వచ్చే దీపావళి పండుగ రోజున నవంబర్ 5వ తేదీ నుంచి మార్కెట్ లో విడుదల చేయనున్నట్లు వెల్లడించింది టాటా మోటార్స్. ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా... మోర్ ఫీచర్స్ తో టాటా పంచ్ ను తీర్చిదిద్దారు. ఎస్.యూ.వీ. ప్రమాణాలతో నగరాల్లో కూడా సులువుగా ప్రయాణించేందుకు వీలుగా... దీనిని డిజైన్ చేశారు. అటు ధర విషయంలో కూడా ప్రస్తుతం మార్కెట్ లో అందుబాటులో ఉన్న ఎస్.యూ.వీ.ల కంటే కూడా తక్కువ ధరలోనే టాటా పంచ్ ధర ఉండే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్ లో మారుతీ కుజుకీ, హ్యుందాయ్, కియా మోటార్స్ సంస్థలు సరికొత్త ఎస్.యూ.వీ.లతో దూసుకెళ్తున్నాయి. వరుస మోడల్స్ తో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. వీరి పోటీని తట్టుకునేందుకు టాటా మోటార్స్ సంస్థ పంచ్ తో రెడీ అవుతోంది. సో... గెట్ రెడీ ఫర్ టాటా పంచ్... ఫ్రమ్ దీపావళి.





రాజశేఖర్ హిట్ అందుకునే సమయం ఆసన్నమైందా..!

ఆగష్టు 24: చరిత్రలో ఈ నాటి సంఘటనలు..

సీఎం కేసీఆర్ రిస్క్ చేస్తున్నారా ?

కరోనా కోసం కేంద్ర మంత్రిని అరెస్ట్ చేస్తారా? అంత దమ్ముందా?

ఆర్టీసి రిటైర్డ్ ఉద్యోగులకు నరకం చూపెడుతున్న అధికారులు

హాల్ మార్కింగ్ రూల్స్ పై జువెలర్స్ నిరసన... ఎందుకు?

ఇండియా ఫర్‌ సేల్‌ : ఎయిర్‌పోర్టుల టార్గెట్‌ రూ.10 వేల కోట్లు..!?

మీ అభిమాన హీరోలకు ఉద్యోగాలొచ్చాయ్..!

అగ్రిగోల్డ్ బాధితులకు శుభవార్త



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Podili Ravindranath]]>