BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/usa676079d8-76c9-4f8c-a9b4-3492fc26dd7f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/usa676079d8-76c9-4f8c-a9b4-3492fc26dd7f-415x250-IndiaHerald.jpgఈనెల 31వ తేదీలోగా అమెరికా త‌న బ‌ల‌గాల‌ను పూర్తిగా వెన‌క్కి తీసుకోవాల‌ని, ఇదే వారికి రెడ్‌లైన్ అని తాలిబ‌న్లు అమెరికాను హెచ్చ‌రించారు. కాబూల్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ఆరువేల మంది అమెరికా సైనికులు ప‌హారా కాస్తున్నారు. ఆఫ్గ‌న్‌లో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుంటే బ‌ల‌గాల త‌ర‌లింపుకానీ, పౌరుల త‌ర‌లింపుకానీ అనుకున్న గ‌డువులోగా పూర్తికాదేమోన‌నే అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది. కొద్దికాలం అమెరికా సైన్యాన్ని అక్క‌డే ఉంచాల‌ని బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రి బోరిస్ జాన్స‌న్ సూచించారు. జీ7 దేశాలు అత్య‌usa{#}American Samoa;Ministerఅమెరికా కొంపలో తాలిబాన్ కుంపటి రె'ఢీ'...అమెరికా కొంపలో తాలిబాన్ కుంపటి రె'ఢీ'...usa{#}American Samoa;MinisterMon, 23 Aug 2021 16:20:00 GMT
ఈనెల 31వ తేదీలోగా అమెరికా త‌న బ‌ల‌గాల‌ను పూర్తిగా వెన‌క్కి తీసుకోవాల‌ని, ఇదే వారికి రెడ్‌లైన్ అని తాలిబ‌న్లు అమెరికాను హెచ్చ‌రించారు. కాబూల్ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో ఆరువేల మంది అమెరికా సైనికులు ప‌హారా కాస్తున్నారు. ఆఫ్గ‌న్‌లో ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల‌ను దృష్టిలో ఉంచుకుంటే బ‌ల‌గాల త‌ర‌లింపుకానీ, పౌరుల త‌ర‌లింపుకానీ అనుకున్న గ‌డువులోగా పూర్తికాదేమోన‌నే అనుమానం వ్య‌క్త‌మ‌వుతోంది. కొద్దికాలం అమెరికా సైన్యాన్ని అక్క‌డే ఉంచాల‌ని బ్రిట‌న్ ప్ర‌ధాన‌మంత్రి బోరిస్ జాన్స‌న్ సూచించారు. జీ7 దేశాలు అత్య‌వ‌స‌రంగా స‌మావేశ‌మై ఆఫ్గ‌న్ ప‌రిస్థితుల‌పై చ‌ర్చించాల‌ని కోరారు. అయితే ఈ సూచ‌న‌పై తాలిబ‌న్లు మండిప‌డ్డారు. గ‌డువులోగా ఉప‌సంహ‌రించుకోని ప‌క్షంలో అమెరికా తీవ్ర ప‌ర్య‌వ‌సానాల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంద‌న్నారు. ప‌లు వార్తాసంస్థ‌ల‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో వారు ఈ విష‌యాన్ని స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు ఆఫ్గ‌న్ ప‌రిణామాల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తున్న‌ట్లు భార‌త విదేశాంగ‌శాఖ మంత్రి జైశంక‌ర్ అన్నారు. పార్ల‌మెంటులోని అన్ని ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు అక్క‌డి ప‌రిణామాల‌పై స‌మాచారం ఇవ్వాల‌ని ప్ర‌ధాన‌మంత్రి ఆదేశించిన‌ట్లు వెల్ల‌డించారు.





కేసీఆర్ ను టార్గెట్ చేసిన మరో ఐపిఎస్...?

ఏపీ పోలీసుల రికార్డ్స్ లో సాడ్ డే...?

మా ఎన్నికల డేట్ ఫిక్స్ .. గెలిచేదెవరూ ..?

ఎవరి ‛షేర్’మిల?

మూడో వేవ్... పిల్లలు సేఫ్...? కానీ మేటర్ ఏంటంటే...?

మెగాస్టార్ ను ఢీ కొట్టే విలన్ అతనేనా..?

అగ్రీ గోల్డ్ బాధితులకు జగన్ గుడ్ న్యూస్...?

కేసీఆర్ బ్రతికి ఉండగా అది జరగదు: హరీష్

సిక్కోలులో ఘోర రోడ్డు ప్రమాదం... ఊహించని దారుణం...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>