PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/eetala-case-updatea8a272c5-b13d-4f29-9970-8fa70b9dbb0b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/eetala-case-updatea8a272c5-b13d-4f29-9970-8fa70b9dbb0b-415x250-IndiaHerald.jpgఈటల రాజేందర్ భూకబ్జా చేశారని, అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారని, అందులో కోళ్ల ఫారాలకు సంబంధించిన నిర్మాణాలున్నాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలోనే ఆయనను మంత్రి పదవినుంచి తప్పించారు కేసీఆర్. విచారణ కూడా చేపట్టారు. రెవెన్యూ అధికారులు వెళ్లి నాలుగు రోజులు ఆ భూముల వద్ద హడావిడి చేశారు. చివరకు కోర్టులో కేసు నమోదైంది, నోటీసులివ్వకుండా అధికారులు ఆ స్థలాల జోలికెళ్లొద్దంటూ ఆదేశాలు కూడా వచ్చాయి. రోజులు గడిచాయి, ఈటల హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. అటు కేసీఆర్ అభివృద్ధి పథకాల అమలులో బిజీగా eetala case update{#}revanth;Telangana Rashtra Samithi TRS;Revanth Reddy;G Kishan Reddy;TPCC;Medchal;KCR;CM;Ishtam;central government;Minister;Bharatiya Janata Party;prema;Loveఈటల భూకబ్జా కేసు.. రేవంత్ రెడ్డి చెప్పిన కీలక అప్ డేట్..ఈటల భూకబ్జా కేసు.. రేవంత్ రెడ్డి చెప్పిన కీలక అప్ డేట్..eetala case update{#}revanth;Telangana Rashtra Samithi TRS;Revanth Reddy;G Kishan Reddy;TPCC;Medchal;KCR;CM;Ishtam;central government;Minister;Bharatiya Janata Party;prema;LoveMon, 23 Aug 2021 07:02:26 GMTఈటల రాజేందర్ భూకబ్జా చేశారని, అసైన్డ్ భూములను ఆక్రమించుకున్నారని, అందులో కోళ్ల ఫారాలకు సంబంధించిన నిర్మాణాలున్నాయని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆ క్రమంలోనే ఆయనను మంత్రి పదవినుంచి తప్పించారు కేసీఆర్. విచారణ కూడా చేపట్టారు. రెవెన్యూ అధికారులు వెళ్లి నాలుగు రోజులు ఆ భూముల వద్ద హడావిడి చేశారు. చివరకు కోర్టులో కేసు నమోదైంది, నోటీసులివ్వకుండా అధికారులు ఆ స్థలాల జోలికెళ్లొద్దంటూ ఆదేశాలు కూడా వచ్చాయి. రోజులు గడిచాయి, ఈటల హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో బిజీ అయ్యారు. అటు కేసీఆర్ అభివృద్ధి పథకాల అమలులో బిజీగా మారారు. కేసు విషయంలో అప్ డేట్ ఏమీ లేదు.

ప్రస్తుతం ఈటల కేసులపై ఉన్న అప్ డేట్ ఏంటి..? టీఆర్ఎస్ నుంచి ఆయన్ను బయటకు పంపించే క్రమంలో అధికారులు చూపించిన ఉత్సాహం ఇప్పుడెందుకు చూపించడంలేదు. అసలు భూ కబ్జా జరిగిందా లేదా..? ఈ విషయాలని హైలెట్ చేస్తూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొత్త లాజిక్ తీశారు. అసలు ఈటలపై చర్యలు తీసుకోవడం కేసీఆర్ కి ఇష్టం లేదని, అందుకే ఆయన సైలెంట్ అయ్యారని, అధికారుల్ని సైలెంట్ గా ఉండమన్నారని చెప్పారు రేవంత్ రెడ్డి. కేవలం ఈటలను పార్టీనుంచి బయటకు పంపేందుకే భూకబ్జా ఆరోపణలు చేశారన్నారు.

ఈటల బీజేపీలో చేరిన తర్వాత కేసుల గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. విచారణ నివేదికలు ఎటుపోయాయని అడిగారు. ఈటలను బీజేపీలో చేర్చింది కూడా కేసీఆరేనని విమర్శించారు. ఈటల బీజేపీ చేరిక సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చిన ప్రైవేట్ విమానం కేసీఆర్ ఏర్పాటు చేసిందేనని అరోపించారు రేవంత్.

సీఎం దత్తత గ్రామాల్లో అభివృద్ధి ఎక్కడ..?
హుజూరాబాద్ పై ఎనలేని ప్రేమ చూపిస్తున్న కేసీఆర్, తాను దత్తత తీసుకున్న గ్రామాలను మాత్రం గాలికి వదిలేశారని విమర్శించారు రేవంత్ రెడ్డి. సీఎం హోదాలో కేసీఆర్ దత్తత తీసుకున్న మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లిలో అభివృద్ధి జరగలేదని ఆరోపించారు. మీడియాని తీసుకెళ్లి ఆగ్రామం దుస్థితిని కళ్లకు కడతామని చెప్పారు. అందుకే ఆ గ్రామంలో 24, 25 తేదీల్లో దళిత గిరిజన ఆత్మగౌరవ దీక్ష చేపడుతున్నట్టు చెప్పారు రేవంత్ రెడ్డి.



సీఎం కేసీఆర్ ఇలాకాలో రేవంత్ దుకాణం ?

కరోనా కట్టడికి కేసీఆర్ కీలక నిర్ణయం ఫలిస్తుందా ?

తెలంగాణలో ష‌ర్మిల పార్టి క‌థ కంచికేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>