PoliticsNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/what-are-the-conditions-bagolev-dont-come-out-until-no-one-says-0e557c22-ed14-48f1-b1ba-60bd334ddf37-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/what-are-the-conditions-bagolev-dont-come-out-until-no-one-says-0e557c22-ed14-48f1-b1ba-60bd334ddf37-415x250-IndiaHerald.jpgఆప్ఘానిస్థాన్ లో పరిస్థితిలు చేయిదాటి పోయాయి. తాలిబన్ల అరాచకాలు మితిమీరుతున్నాయి. ఎంతో మంది అమాయకులు వారి చేతుల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. మరోవైపు తాలిబన్లకు ఎదురుతిరుగుతున్న సందర్భాలు కూడా కనిపిస్తుండటంతో రక్తపాతం జరుగుతోంది. పరిస్థితులు ఇలా ఉండంటతో అమెరికా ఆర్మీ అక్కడి పౌరులను అప్రమత్తం చేస్తోంది. What are the conditions Bagolev Dont come out until no one says {#}Germany;commander;MP;India;Army;American Samoa;sundayపరిస్థితులు ఏం బాగోలేవ్..! చెప్పేవరకు ఎవరూ బయటకు రాకండి..!పరిస్థితులు ఏం బాగోలేవ్..! చెప్పేవరకు ఎవరూ బయటకు రాకండి..!What are the conditions Bagolev Dont come out until no one says {#}Germany;commander;MP;India;Army;American Samoa;sundayMon, 23 Aug 2021 09:00:00 GMTతాలిబన్ల చెర నుంచి తప్పించేందుకు ఇటీవల సీ-17విమానం ద్వారా చాలా మందిని అమెరికా తరలించింది. అయితే అందులో ప్రయాణించింది 640మంది కాదనీ.. 823మందని అమెరికా తెలిపింది. వారిలో పెద్దవారు 640, చిన్నారులు 183మంది ఉన్నట్టు పేర్కొంది. ఇక ప్రతీరోజూ వందల జనాభాను విదేశాలకు తరలిస్తున్నారు. ప్రస్తుతం కాబూల్ ఎయిర్ పోర్ట్ దగ్గర పరిస్థితులు బాగోలేవనీ.. తమ ఆర్మీ ప్రకటన చేసే వరకు ఎవరూ బయటకు రావొద్దని అమెరికా తెలిపింది.

ఆఫ్ఘానిస్థాన్ నుంచి బలగాల ఉపసంహరణను అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ సమర్థించుకున్నారు. ఏదొక సమయంలో ఆప్ఘాన్ ను అమెరికా సేనలు విడిచి పెట్టాల్సిందేనని స్పష్టం చేశారు. అక్కడి పరిస్థితులకు అద్దం పట్టే చిత్రాలను చూస్తుంటే బాధ కలుగుతోందని చెప్పారు. ఈ నెల 31వరకు అక్కడి నుంచి తరలింపు ప్రక్రియ ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత ఉండకపోవచ్చని స్పష్టం చేశారు.  

ఆఫ్ఘానిస్థాన్ లో తాలిబన్ల అరాచకాలను తట్టుకోలేక కొంతమంది తిరుగుబాటు చేస్తున్నారు. బగ్లాన్ ఏరియాలో తిరుగుబాటు దారులు తాలిబన్లపై కాల్పులు చేశారు. దీంతో ఈ ఘటనలో 11మంది తాలిబన్లు హతమయ్యారు. ఇక కమాండర్ తో పాటు ఏడుగురు తాలిబన్లను కూడా రహస్య ప్రదేశంలో బంధించారు. మరోవైపు తిరగుబాటుదారులను చంపేందుకు తాలిబన్లు సెర్చ్ ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తోంది.

కాబూల్ నుంచి వివిధ దేశాల ప్రభుత్వాలు తమ పౌరులను తరలించే క్రమంలో తలెత్తిన ఉద్రిక్తతల్లో గడిచిన వారం రోజుల్లో 20మంది చనిపోయారు. నాటో ప్రతినిధి ఒకరు ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఆదివారం ఒక్కరోజే ఏడుగురు ఆఫ్ఘాన్ పౌరులు ప్రాణాలు కోల్పోయారు. కాగా అమెరికాకు వెళ్లే విమానంలో ఎక్కిన ఓ ఆప్ఘాన్ గర్భిణి విమానంలో ప్రసవించగా.. తల్లి, బిడ్డ జర్మనీ ఆస్పత్రిలో సురక్షితంగా ఉన్నారు.  

ఇక ఆప్ఘానిస్థాన్ నుంచి భారత్ కు చేరుకున్న 20మంది ఆప్ఘానిస్థాన్ హిందూ, సిక్కు పౌరుల్లో ఆ దేశ ఎంపీ నరేందర్ సింగ్ ఖల్సా కూడా ఉన్నారు. 20ఏళ్లలో నిర్మించుకున్న దేశం ఇప్పుడు నాశనం అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడ ఏమీ మిగలలేదనీ.. కంటతడి పెట్టారు. అటు తమను సురక్షితంగా తీసుకొచ్చిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మరికొంతమంది పౌరులను భారత్ కు తీసుకురావాలని కోరారు.





తాలిబ‌న్ల అరాచ‌కం : చ‌నిపోయిన మ‌హిళ‌ల దేహాల‌తో శృంగారం ?

పరిస్థితులు ఏం బాగోలేవ్..! చెప్పేవరకు ఎవరూ బయటకు రాకండి..!

తిరుమ‌ల‌: శ్రీ‌వారి ఆదాయం ఎంతంటే..?

నో థర్డ్ వేవ్.. ఊపిరిపీల్చుకోండి కానీ!

కరోనా కట్టడికి కేసీఆర్ కీలక నిర్ణయం ఫలిస్తుందా ?

తెలంగాణలో ష‌ర్మిల పార్టి క‌థ కంచికేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>