PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/vaccination-centres80f249f0-1599-47ed-ae4f-8c301d799bee-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/74/vaccination-centres80f249f0-1599-47ed-ae4f-8c301d799bee-415x250-IndiaHerald.jpgభారత్ లో వ్యాక్సినేషన్ స్పీడందుకున్నట్టు స్పష్టమవుతోంది. గతంలో వ్యాక్సినేషన్ కేంద్రాల ముదు కొన్ని రాష్ట్రాల్లో తెగబారెడు క్యూ లైన్లు కనిపించేవి. ఇప్పుడా అవస్థలు తప్పాయి. వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్తే వెంటనే టీకా ఇచ్చేస్తున్నారు. ఏపీలో అయితే.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత స్పీడందుకుంది. ఈ క్రమంలో చాలా చోట్ల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా.. ప్రజల్లో అవగాహన పెంచి, వారిని వ్యాక్సినేషన్ కేంద్రాల వద్దకు తెచ్చేందుకు అధికారులు, సిబ్బంది కష్టపడుతున్నారు. దీంతో అందరికీ వ్vaccination centres{#}Hyderabad;Tamilnadu;Success;Coronavirusఇకపై ఏటీఎం సెంటర్ల లాగా వ్యాక్సినేషన్ సెంటర్లుఇకపై ఏటీఎం సెంటర్ల లాగా వ్యాక్సినేషన్ సెంటర్లుvaccination centres{#}Hyderabad;Tamilnadu;Success;CoronavirusMon, 23 Aug 2021 08:00:00 GMTభారత్ లో వ్యాక్సినేషన్ స్పీడందుకున్నట్టు స్పష్టమవుతోంది. గతంలో వ్యాక్సినేషన్ కేంద్రాల ముదు కొన్ని రాష్ట్రాల్లో తెగబారెడు క్యూ లైన్లు కనిపించేవి. ఇప్పుడా అవస్థలు తప్పాయి. వ్యాక్సినేషన్ కేంద్రాలకు వెళ్తే వెంటనే టీకా ఇచ్చేస్తున్నారు. ఏపీలో అయితే.. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమం మరింత స్పీడందుకుంది. ఈ క్రమంలో చాలా చోట్ల వ్యాక్సిన్లు అందుబాటులో ఉన్నా.. ప్రజల్లో అవగాహన పెంచి, వారిని వ్యాక్సినేషన్ కేంద్రాల వద్దకు తెచ్చేందుకు అధికారులు, సిబ్బంది కష్టపడుతున్నారు. దీంతో అందరికీ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచేందుకు కొన్ని రాష్ట్రాలు కొత్త ప్రయత్నాలు మొదలు పెట్టాయి.

తమిళనాడులో 24గంటల వ్యాక్సినేషన్ సెంటర్లు..
24 గంటలు పనిచేసే ఏటీఎం సెంటర్ల మాదిరిగా తమిళనాడులో 24గంటలు పనిచేసే వ్యాక్సినేషన్ సెంటర్లను అందుబాటులోకి తేబోతున్నారు. ఈ వ్యాక్సినేషన్ సెంటర్లు ఈరోజునుంచి పనిచేస్తాయి. వృత్తి, ఉపాధి పనిమీద బిజీగా ఉండేవారికోసం 24గంటలు ఈ వ్యాక్సినేషన్ సెంటర్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు అధికారులు. అంతే కాదు, 80ఏళ్లు పైబడినవారికి ఇంటి వద్దకే వెళ్లి వ్యాక్సిన్ ఇవ్వబోతున్నారు. వ్యాక్సినేషన్ పై అవగాహన పెంచి, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు మొదలు పెట్టినట్టు తెలిపారు తమిళనాడు అధికారులు. ఇంటింటికీ వ్యాక్సిన్, 24గంటల వ్యాక్సినేషన్ సెంటర్లతో టీకా కార్యక్రమం మరింత స్పీడందుకుంటుందని, అందరూ టీకాలు తీసుకుంటేనే హెర్డ్ ఇమ్యూనిటీ సాధ్యమై కరోనా నియంత్రణ సాధ్యవుతుందని చెబుతున్నారు.

హైదరాబాద్ లో వ్యాక్సిన్ ఎట్ యువర్ డోర్ స్టెప్..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 10రోజుల పైలట్ ప్రాజెక్ట్ గా ఇంటింటికీ వ్యాక్సిన్ కార్యక్రమం మొదలవుతోంది. బస్తీలు, ఇతర ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ వాహనాల ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నారు అధికారులు. ముందుగా అక్కడి సిబ్బంది వ్యాక్సిన్ వేయించుకోనివారి వివరాలు సేకరిస్తారు. మొబైలా వ్యాక్సినేషన్ వాహనం ద్వారా నేరుగా వారి ఇంటి వద్దకే వెళ్లి టీకా ఇస్తారు. గ్రేటర్ హైదరాబాద్ లో ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఈ విధానం ఈ రోజునుంచి అమలవుతుంది. ఇది సక్సెస్ అయితే ఇతర ప్రాంతాల్లో కూడా ఇంటి వద్దకే టీకా కార్యక్రమం మొదలవుతుందని చెబుతున్నారు అధికారులు.



సీఎం కేసీఆర్ ఇలాకాలో రేవంత్ దుకాణం ?

నో థర్డ్ వేవ్.. ఊపిరిపీల్చుకోండి కానీ!

కరోనా కట్టడికి కేసీఆర్ కీలక నిర్ణయం ఫలిస్తుందా ?

తెలంగాణలో ష‌ర్మిల పార్టి క‌థ కంచికేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>