MoviesVAMSIeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr-koratala-combof7719d4f-bfd5-41d1-8c0e-75b4391b2dd5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/ntr-koratala-combof7719d4f-bfd5-41d1-8c0e-75b4391b2dd5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" షూటింగ్ పూర్తి చేసుకుని అందరి లాగే ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఖాళీగా ఉన్న ఈ సమయాన్ని మరో విధంగా ఉపయోగించుకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇంతకు ముందు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన "మీలో ఎవరు కోటీశ్వరుడు" అనే షో కి ధీటుగా "ఎవరు మీలో కోటీశ్వరులు" అనే టైటిల్ తో షోను నిన్ననే స్టార్ట్ చేశారుNTR-KORATALA-COMBO{#}Episode;Jr NTR;Ram Charan Teja;koratala siva;Chitram;Akkineni Nagarjuna;Yevaru;NTR;Director;Cinemaసక్సెఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రిస్క్ చేస్తున్నారా ?సక్సెఫుల్ డైరెక్టర్ కొరటాల శివ రిస్క్ చేస్తున్నారా ?NTR-KORATALA-COMBO{#}Episode;Jr NTR;Ram Charan Teja;koratala siva;Chitram;Akkineni Nagarjuna;Yevaru;NTR;Director;CinemaMon, 23 Aug 2021 14:00:00 GMTప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ "ఆర్ ఆర్ ఆర్" షూటింగ్ పూర్తి చేసుకుని అందరి లాగే ఈ సినిమా రిలీజ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అయితే ఖాళీగా ఉన్న ఈ సమయాన్ని మరో విధంగా ఉపయోగించుకుంటూ క్యాష్ చేసుకుంటున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇంతకు ముందు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించిన "మీలో ఎవరు కోటీశ్వరుడు" అనే షో కి ధీటుగా "ఎవరు మీలో కోటీశ్వరులు" అనే టైటిల్ తో షోను నిన్ననే స్టార్ట్ చేశారు. ఈ షో కి హోస్ట్ గా ఎన్టీఆర్ చేస్తున్నారు. నిన్న జరిగిన మొదటి ఎపిసోడ్ లో రామ్ చరణ్ మొదటి గెస్ట్ గా వచ్చారు. ఒక్కసారిగా "ఆర్ ఆర్ ఆర్" సినిమాలో నటించిన ఇద్దరు హీరోలను చూడగానే అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

త్వరలో విడుదల కానున్న"ఆర్ ఆర్ ఆర్" మూవీకి ఇది ఒక  మంచి ప్రమోషన్ గా మారిందని చెప్పవచ్చు. ఇది ఇలా ఉంటే త్వరలోనే ఎన్టీఆర్ మరియు కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆచార్య సినిమాను పూర్తిచేసే పనిలో కొరటాల ఉన్నాడు. ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎన్టీఆర్ మూవీని సెట్స్ పైకి తీసుకు వెళ్లనున్నాడు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ఒక గాసిప్ హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో సెకండ్ ఆఫ్ స్టోరీలో మార్పులు చేస్తున్నారని వినికిడి. వాస్తవంగా ఇప్పటికే కొరటాల శివ ఎన్టీఆర్ కు కథ మొత్తం వినిపించాడట. ఎన్టీఆర్ కు కథ బాగా నచ్చిందని తెలిసింది.

అయితే ఎందుకో కొరటాల శివ సెకండాఫ్ లో కొద్దిగా మార్పులు చేస్తున్నారని భోగట్టా. కీలకమైన ఇంటర్వెల్ బ్యాంగ్ ను ఇంటర్వల్ తర్వాత ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయంలో కొరటాల రిస్క్ చేస్తున్నాడని అంత అంటున్నారు. ఇప్పటి వరకు అపజయమెరుగని డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు. అయితే కొరటాల మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. కాగా ఇది ఎన్టీఆర్ కెరీర్ లోనే ఎక్కువ బడ్జెట్ తో రాబోతున్న చిత్రం మరియు కొరటాల శివ - ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న రెండవ చిత్రం కావడం విశేషం. అంతా అనుకున్నట్లు జరిగితే వచ్చే సంవత్సరం ప్రథమార్థంలో విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఏమి జరగనుందో తెలియాల్సి ఉంది.



తెరాస ఎమ్మెల్యే ను కోర్టు వదలదా...?

సారా అందాలు చూడతరమా ...!

సమంత ని నిలబెట్టిన ఈ 5 సినిమాల గురించి తెలుసుకోవాల్సిందే

ఆ విషయంలో వెంకీ వెనకంజ ...?

బుల్లి పిట్ట : రూ.26,999 మొబైల్ కేవలం రూ.9,999 కే ఇలా పొందండి ..!

లోకేష్ పద్ధతి మార్చుకోరూ... ప్లీజ్ ?

కాబూల్ విమానాశ్ర‌యంపై దాడులు?

థర్డ్ వేవ్ బూచి : ఎవరిని నమ్మాలి?

స్పెషల్ క్రెడిట్ కార్డ్.. ఇక ఎలాంటి వడ్డీ ఉండదట?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>