MoviesNAGARJUNA NAKKAeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/no-competition-between-heroes-only-action-00d0c867-3d53-4c2b-8480-bb5776e26c45-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/no-competition-between-heroes-only-action-00d0c867-3d53-4c2b-8480-bb5776e26c45-415x250-IndiaHerald.jpgహీరోల మధ్య పోటీ సర్వసాధారణమే. ఎలా అంటే ఒక రకంగా చెప్పాలంటే బరిలో నిలిచిన కోడిపందాల్లాగే అని చెప్పుకోవచ్చు. సినీ ఇండస్ట్రీలో పోటీ అనేది ఒక రేంజ్ లో ఉంటుంది. కానీ ఇప్పుడిప్పుడే ఆ కాంపిటీషన్ తగ్గుతున్నట్టు కనిపిస్తోంది. ఆ పోటీని పక్కన పెట్టి చేయిచేయి కలిపేస్తున్నారు. కలిసి బరిలోకి దిగుతూ ఫ్యాన్స్ ను ఖుషీ చేస్తున్నారు. No competition between heroes Only action {#}Mani Ratnam;jayam ravi;rana daggubati;surya sivakumar;Konidela Production;Darsakudu;king;Balakrishna;Director;Alluri Sitarama Raju;Komaram Bheem;Jr NTR;ram pothineni;Cinema;Rajamouli;Successహీరోల మధ్య నో కాంపిటేషన్.. ఓన్లీ యాక్షన్..!హీరోల మధ్య నో కాంపిటేషన్.. ఓన్లీ యాక్షన్..!No competition between heroes Only action {#}Mani Ratnam;jayam ravi;rana daggubati;surya sivakumar;Konidela Production;Darsakudu;king;Balakrishna;Director;Alluri Sitarama Raju;Komaram Bheem;Jr NTR;ram pothineni;Cinema;Rajamouli;SuccessMon, 23 Aug 2021 06:00:00 GMTమెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ సినిమాలంటే అభిమానులకు పిచ్చి. ఈ ఇద్దరి హీరోల మధ్య ఎప్పుడూ పోటీ ఓ రేంజ్ లో ఉంటుంది. ఈ హీరోల ఇమేజ్‌తో పాటు అభిమానుల తాము గొప్ప అంటే తామే గొప్ప అనే ధోరణి కనిపిస్తుంది. ఇప్పటికీ అదే సీన్ కనిపిస్తోంది. ఇప్పుడు మాత్రం జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌ అభిమానుల్లో కూడా ఈ ఫీలింగ్సే కనిపిస్తున్నాయి. కానీ ఆ అలాంటి కల్చర్ కు స్వస్థి చెప్పేలా.. ఈ హీరోలిద్దరూ కలిసి పనిచేయడంతో.. ఇద్దరి ఫ్యాన్స్ కూడా ఒక్కటై పోతున్నారు.

రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది 'ట్రిపుల్ ఆర్'. చారిత్రక నేపథ్యంతో వస్తోన్న ఈ మూవీలో చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్ర పోషిస్తున్నాడు. ఇక జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్‌గా నటిస్తున్నాడు. నందమూరి, కొణిదెల హీరోలు కలిసి నటిస్తున్నారనే టాక్‌తో ఈ మూవీపై అంచనాలు పీక్స్‌కి వెళ్లాయి. ఇక రాజమౌళి ఇమేజ్‌తో నార్త్‌లో కూడా 'ట్రిపుల్ ఆర్'పై అంచనాలు పెరుగుతున్నాయి.

పవన్ కళ్యాణ్, రానా హీరోలుగా వస్తోన్న సినిమా 'భీమ్లానాయక్'. మళయాళీ హిట్ 'అయ్యప్పనుమ్ కోషియుమ్' రీమేక్‌గా వస్తోందీ సినిమా. ఇటీవల వచ్చిన ఫస్ట్‌ గ్లింప్స్‌లో పవన్‌ కళ్యాణ్‌ని మాత్రమే హైలెట్ చేశారని, రానా క్యారెక్టర్‌ తగ్గించారా అనే కామెంట్స్ వచ్చాయి గానీ, మేకర్స్ మాత్రం పక్కా మల్టీస్టారర్‌ అని చెబుతున్నారు. సుధీర్ఘ సినీ ప్రయాణంలో బోల్డన్ని మల్టీస్టారర్లు చేసిన కమల్ రీసెంట్‌గా ఒక మల్టీస్టారర్‌కి ఓకే చెప్పాడని తెలుస్తోంది. సూర్యతో కలిసి సినిమా చేయబోతున్నాడట. మళయాళీ డైరెక్టర్ అమల్ నీరద్‌ దర్శకత్వంలో కమల్ హాసన్, సూర్య మల్టీస్టారర్ రాబోతోంది. మణిరత్నం సినిమాలకి ఇండియన్‌ మార్కెట్‌లో ఒక బ్రాండ్ ఉంది. సౌత్‌ నుంచి నార్త్‌ వరకు మణిరత్నం సినిమాలకి లక్షల్లో ఫ్యాన్స్ ఉన్నారు. అయితే ఈ మధ్య ఫ్యాన్స్‌ని పెద్దగా మెప్పించలేకపోతున్నాడు మణి. ఫ్లాపులతో కొంచెం స్లో అయిన ఈ దర్శకుడు హిస్టారికల్ సబ్జెక్ట్ 'పొన్నియన్ సెల్వన్'తో మార్క్ చూపించాలనుకుంటున్నాడు. విక్రమ్, కార్తి, జయం రవి హీరోలుగా ఈ మూవీని భారీగా తీస్తున్నాడు. చూద్దాం.. ఆయన ప్రయోగం ఏ మాత్రం సక్సెస్ అవుతుందో.






అమెరికా అఫ్గాన్‌ చేతిలో అంత సిల్లీగా ఎలా మోసపోయింది..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NAGARJUNA NAKKA]]>