PoliticsK Vasantheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore//images/categories/politics-IndiaHerald.jpgటీడీపీలో జరుగుతున్న పరిణామాలు.పబ్లిసిటీ పిచ్చితో పార్టిని అప్రతిష్ట పాలు చేస్తున్నారని తమ్ముళ్ల హైరానా పడుతున్నారట.ప్రభుత్వంపై ఎవ్వరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేసిన వారికి పిలిచి పెద్ద పీట వేస్తే ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ పరిస్థితి ఏంటని కౌంటర్లు వేస్తున్నారటCHANDHRA BABU {#}Andhra Pradesh;YCP;TDP;Telugu;media;Partyపబ్లిసిటీతో ప్రయోజనం లేదు.పార్టి బలోపేతంపై దృష్టి పెట్టండి.పబ్లిసిటీతో ప్రయోజనం లేదు.పార్టి బలోపేతంపై దృష్టి పెట్టండి.CHANDHRA BABU {#}Andhra Pradesh;YCP;TDP;Telugu;media;PartyMon, 23 Aug 2021 22:45:52 GMTఏపీ టీడీపీలో జరుగుతున్న  పరిణామాలు తెలుగు తమ్ముళ్లను ఆందోళనకు గురి చేస్తోందట.పబ్లిసిటీ పిచ్చితో పార్టిని అప్రతిష్ట పాలు చేస్తున్నారని తమ్ముళ్ల హైరానా పడుతున్నారట.
సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ  కోలుకోలేని దెబ్బతిని ప్రభుత్వ చర్యలతో  అడుగు బయట పెట్టేందుకు బయపడుతున్న వేళ టీడీపీ అధిష్టానం అనుసరిస్తున్న తీరు తెలుగు తమ్ముళ్లను మరింత ఆందోళనకు గురి చేసిందట.అస్సలు  ఇంతకు తెలుగు తమ్ముళ్ల ఆవేదనకు గల కారణమేంటి.పార్టీ అధినేతపై,యువనేతపై తెలుగు తమ్ముళ్లు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ఏపీ టీడీపీలో రోజు,రోజుకు జరుగుతున్న పరిణామాలు సొంత పార్టి నేతలకు అంతుబట్టడం లేదట.పార్టీని బలోపేతం చేసే  ఉద్దేశంలో భాగంగా కొద్దీ రోజులుగా యాక్టివ్ రోల్ పోషిస్తున్న టీడీపీ యువనేత,అధినేత అనుసరిస్తున్న తీరు తెలుగు తమ్ముళ్లకు అందోళనకు గురి చేస్తోందట,సార్వత్రిక ఎన్నికల తరువాత రాష్ట్రంలో నెలకొన్న పరిణామాల దృష్ట్యా పార్టిని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేసేందుకు సంస్థాగతంగా మార్పులు  చేపట్టకుండా అంటీముట్టనట్లు వ్యవరిస్తు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం ఇప్పుడు ఏపీ టీడీపీలో హాట్ టాపిక్ గా మారింది.రాష్ట్ర రాజకీయాల్లో బలమైన పాత్ర పోషిస్తున్న టీడీపీలో ఎప్పటి నుంచో ఉన్న సీనియర్లను కాదని అనూహ్యంగా కొత్తవారికి పార్టీలో పెద్ద పీట వేయడం ఏంటని ప్రశ్నలు వ్యక్తం అవుతున్నాయట.ఇప్పటికే ప్రభుత్వంలో ఉన్నప్పుడు పదవులు లేక ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పదవులు లేక టీడీపీ జెండా మొస్తున్న తమను కాదని అస్సలు పార్టీ నిర్మాణాత్మక అంశాలపై ఎటువంటి అవగాహన పెనీ వారికి పెద్ద పీట వేయడం ఏంటని, ప్రభుత్వంపై ఎవ్వరు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్  చేసిన వారికి  పిలిచి పెద్ద పీట వేస్తే ఎన్నో ఏళ్లుగా ఉన్న తమ పరిస్థితి ఏంటని కౌంటర్లు వేస్తున్నారట.



టీడీపీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి కార్యాచరణసిద్ధం చేస్తున్న టీడీపీ అధిష్టానం అందుకు తగ్గట్టుగానే పార్టీలో మార్పులు చేస్తోందని కానీ మార్పులు జరుగుతున్న తీరు మాత్రం టీడీపీ చరిత్రలోనే ఎన్నడూ చూడలేదని అంటున్నారూ తెలుగు తమ్ముళ్లు.పార్టిని బలోపేతం చెయ్యడం మంచిదే కానీ పార్టీతో సంబంధం లేని వాళ్ళు నిర్మాణత్మక అంశాల్లో అవగాహన లేని వాళ్లకు అడగకుండానే పిలిచి మరీ కీలకమైన పదవులు కట్టబెట్టడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కొద్దీ రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా వివిధ అంశాలపై విస్తృతంగా పర్యటన చేస్తున్న టీడీపీ  అధినేత,యువనేత ముందు వెనుక ఆలోచించకుండ ప్రభుత్వంపై ఎవ్వరు విమర్శలు చేసిన వారికి కీలకమైన పదవులు పార్టీ నుంచి కట్టబెట్టడం ఏంటని సెటైర్లు వేస్తున్నారు.రెండేళ్ల వైసీపీ పరిపాలన పరమైన అంశాల్లో  ప్రతిపక్ష హోదాలో ప్రజల్లోకి వెళ్లేలా  టీడీపీ చేసిన పోరాటాల కంటే  పబ్లిసిటీ కోసం చేసిన కార్యక్రమాలు ఉన్నాయని అధినేత, యువనేతను ఉద్దేశించి కౌంటర్లు వేస్తున్నారట.అయితే అందుకు తగ్గట్టుగా గానే   పదవుల పంపకాలు అధికార ప్రతినిధుల జాభితాను సిద్ధం చేసారని విమర్శలు ఎక్కుపెడుతున్నారూ తెలుగు తమ్ముళ్లు.



ఇదిలా ఉంటె తెలుగు తమ్ముళ్ల ఆవేదన ఆగ్రహం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని అంటు న్నారు టీడీపీలోని ఒక వర్గం  నేతలు.రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలు దృష్ట్యా టీడీపీ వ్యూహాత్మకంగా అనుసరించాల్సిన సమయంలో పబ్లిసిటీ కోసం ప్రయత్నాలు చేయడం ప్రజా సమస్యలపై నిర్మాణాత్మక పోరాటం చెయ్యకుండా కేవలం పబ్లిసిటీ స్టెంట్స్ వేస్తున్నారని మండి పడుతున్నారట.ఇక పార్టిని బలోపేతం చేసే పేరుతో మొక్కుబడిగా కార్యక్రమలు చేయడం మీడియాలో కనిపించాలనే ఆత్రుతతో  పార్టీని పక్కకు పెడుతున్నారని తెలుగు తమ్ముళ్లు అంటూన్నారు.అలాగే ఈ మధ్య కాలంలో టీడీపీ అధిష్టానం అనుసరిస్తున్న తీరు కూడా అలాగే ఉందని అంటున్నారు కొందరు టీడీపీ సీనియర్లు.ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నిస్తూ ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో  ఇష్టానుసారంగా కామెంట్స్ చేసిన వారికి ప్రాథమిక సభ్యత్వం  లేకపోయినా నేరుగా అధికారు ప్రతినిధులు అవకాశం ఇవ్వడం నిదర్శనమని టీడీపీ అధిష్టానంపై విరుచుకుపడుతున్నారు కొందరు సీనియర్లు.







జీహెచ్‌ఎంసీలో లాక్‌డౌన్‌ కంటిన్యూ!?

మరోసారి బుల్లితెర టైగర్ అనిపించుకున్న ఎన్టీఆర్..

లోకేష్‌ నుంచి క్యాడర్‌ ఆశిస్తోంది అదేనా?

హాకీ ప్లేయర్స్ కు పంజాబ్ అరుదైన గుర్తింపు

తాలిబన్లకు ఒక్క అవకాశం ఇస్తే.... ?

విజయం మీదే: పోటీతత్వం మీలో విజయ కాంక్షను రగిలిస్తుంది... !

లోకేష్‌ రాటు తేలారా? తేల్చారా?

రాజశేఖర్ కూతురు మూవీ గురించి ఆసక్తికరమైన అప్డేట్..!

స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. నెలకి 7,800/- స్కాలర్ షిప్..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - K Vasanth]]>