MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevie506d799-cfe2-4ecb-b48c-65ffba2b3974-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiranjeevie506d799-cfe2-4ecb-b48c-65ffba2b3974-415x250-IndiaHerald.jpgహోమ్లీగా, బబ్లీగా కనిపించే నటీమణి పూర్ణిమ హాస్యబ్రహ్మ జంధ్యాల డైరెక్ట్ చేసిన ముద్దమందారం సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. సుమారు 100కు పైగా చిత్రాల్లో నటించిన ఆమె పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా అలరించారు. చిరంజీవి, మాధవి హీరోహీరోయిన్లుగా నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాల్లో చిట్టి తల్లి పాత్రలో ఆమె ఒదిగిపోయారు. ఈ ఒక్క పాత్రతోనే ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపు దక్కింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఆchiranjeevi{#}purnima;Jandhyala Ravishankar;Kannada;Heroine;madhavi;Tollywood;Cinema;Chiranjeevi;Smart phone;Santosham;March;Lieఆ హీరోయిన్‌కు భారీ షాకిచ్చిన చిరు..?ఆ హీరోయిన్‌కు భారీ షాకిచ్చిన చిరు..?chiranjeevi{#}purnima;Jandhyala Ravishankar;Kannada;Heroine;madhavi;Tollywood;Cinema;Chiranjeevi;Smart phone;Santosham;March;LieMon, 23 Aug 2021 10:00:00 GMTపూర్ణిమ హాస్యబ్రహ్మ జంధ్యాల డైరెక్ట్ చేసిన ముద్దమందారం సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేశారు. తెలుగు, తమిళ, కన్నడ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. సుమారు 100 చిత్రాల్లో నటించిన ఆమె పలు సినిమాల్లో హీరోయిన్ గా కూడా అలరించారు.

చిరంజీవి, మాధవి హీరోహీరోయిన్లుగా నటించిన ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాల్లో చిట్టి తల్లి పాత్రలో ఆమె ఒదిగిపోయారు. ఈ ఒక్క పాత్రతోనే ఆమెకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎనలేని గుర్తింపు దక్కింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఆమె చిరంజీవి తో మంచి స్నేహం ఏర్పరుచుకున్నారు. మెగాస్టార్ కూడా ఆమెతో సరదాగా మాట్లాడేవారు. అయితే ఒకరోజు చిరంజీవిని ఆటపట్టించాలని పూర్ణిమ అనుకున్నారు. ఏప్రిల్ 1న చిరు ని ఫూల్ చేయాలని ఆమె పక్క ప్లాన్ రూపొందించుకున్నారు.

సరిగ్గా ఏప్రిల్ ఒకటో తేదీన పూర్ణిమ చిరంజీవికి ఫోన్ చేశారు. అయితే ఆమె ఫోన్ కాల్ ను మొదటగా చిరంజీవి సెక్రెటరీ లిఫ్ట్ చేశారు. ఎవరండీ మీరు? అని అవతల వ్యక్తి ఆరా తీయగా.. తాను చిరంజీవికి పెద్ద వీరాభిమానిని అని ఆమె చెప్పుకొచ్చారు. దాంతో సెక్రెటరీ చిరంజీవికి ఫోన్ ఇచ్చారు. అప్పుడు పూర్ణిమ చాలా సంతోషం తో చిరంజీవిని ఆటపట్టించడం ప్రారంభించారు. మీకు నేనొక పెద్ద అభిమానిని అంటూ ఆమె చెప్పే మాటలను చిరంజీవి కామ్ గా విన్నారు. ఇక చివరికి ఆమె తాను పూర్ణిమ అని చెప్పి ఫుల్ చేయడానికి ప్రయత్నించారు. కానీ చిరంజీవి అప్పటికే ఆమెను గుర్తుపట్టారు. ఇందాక సెక్రటరీగా వాయిస్ మార్చి మాట్లాడింది కూడా తానేనని చిరంజీవి చెప్పడంతో పూర్ణిమ షాక్ అయ్యారట. దాంతో మెగాస్టార్ ని ఫూల్ చేయడం అంత ఈజీ కాదని ఆమె అర్థం చేసుకున్నారట. పూర్ణిమ నాలుగేళ్ల క్రితం ఆంధ్ర పోరి, లై వంటి చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించారు.


రేవంత్ వ్యూహం ఇదేనా.! అందుకే సురేఖను బరిలో దింపుతున్నారా..?

వరస ప్రాజెక్టులతో ప్రభాస్ భవిష్యత్తు ఏంటి ..?

ప‌సుపు ఫ్యూచ‌ర్ : కౌన్ బ‌నేగా..? : కౌన్ ఆయేగా..?

రూ.కోట్ల ఎర్ర‌చంద‌నం ప‌ట్టివేత‌

పరిస్థితులు ఏం బాగోలేవ్..! చెప్పేవరకు ఎవరూ బయటకు రాకండి..!

తిరుమ‌ల‌: శ్రీ‌వారి ఆదాయం ఎంతంటే..?

నో థర్డ్ వేవ్.. ఊపిరిపీల్చుకోండి కానీ!

కరోనా కట్టడికి కేసీఆర్ కీలక నిర్ణయం ఫలిస్తుందా ?

తెలంగాణలో ష‌ర్మిల పార్టి క‌థ కంచికేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>