PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-5bfcdd4e-e3d2-4495-ac6a-d60a8e662856-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/lokesh-5bfcdd4e-e3d2-4495-ac6a-d60a8e662856-415x250-IndiaHerald.jpgతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ఆహార్యంలోనే కాదు వ్యవహారంలోనూ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతంలో కన్నా ఇప్పుడు మరింత కాన్ఫిడెన్స్‌గా ఆయన కనిపిస్తున్నారు. అంతేకాదు కార్యకర్తల్లోనూ ఆత్మస్థైర్యం నింపుతున్నారు. కార్యకర్తలకు ఆపద వచ్చిందని తెలిస్తే చాలు.. వెంటనే అక్కడికి వెళ్లిపోవడం లోకేష్‌ స్పెషల్‌ అని చెప్పాలి. కార్యకర్తలకే కాకుండా ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరిగినా, వారిపై అఘాయిత్యాలు చోటుచేసుకున్నా లోకేష్‌ సీరియస్‌గా స్పందిస్తున్నారు. బాధితులు రాషLokesh speed rise in politics{#}Dookudu;Kanna Lakshminarayana;Lokesh;Lokesh Kanagaraj;YCP;Party;Telugu Desam Party;police;Teluguలోకేష్‌ రాటు తేలారా? తేల్చారా?లోకేష్‌ రాటు తేలారా? తేల్చారా?Lokesh speed rise in politics{#}Dookudu;Kanna Lakshminarayana;Lokesh;Lokesh Kanagaraj;YCP;Party;Telugu Desam Party;police;TeluguMon, 23 Aug 2021 20:34:00 GMTతెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ ఆహార్యంలోనే కాదు వ్యవహారంలోనూ మార్పు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది. గతంలో కన్నా ఇప్పుడు మరింత కాన్ఫిడెన్స్‌గా ఆయన కనిపిస్తున్నారు. అంతేకాదు కార్యకర్తల్లోనూ ఆత్మస్థైర్యం నింపుతున్నారు. కార్యకర్తలకు ఆపద వచ్చిందని తెలిస్తే చాలు.. వెంటనే అక్కడికి వెళ్లిపోవడం లోకేష్‌ స్పెషల్‌ అని చెప్పాలి. కార్యకర్తలకే కాకుండా ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు అన్యాయం జరిగినా, వారిపై అఘాయిత్యాలు చోటుచేసుకున్నా లోకేష్‌ సీరియస్‌గా స్పందిస్తున్నారు. బాధితులు రాష్ట్రంలో ఏ మూలన ఉన్నా అక్కడికి వెళ్లి వారిని, వారి కుటుంబ సభ్యులను పరామర్శిస్తున్నారు. బాధితులకు న్యాయం జరిగేవరకు తెలుగుదేశం పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇస్తున్నారు. ఈ సందర్భంగా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు, ప్రభుత్వాన్ని విమర్శించే తీరు, ఆరోపణలు తీవ్రస్థాయిలో ఉంటున్నాయి. అధికార వైసీపీపై, ఆ పార్టీ నాయకులపై ఒంటికాలి మీద లేచి వార్నింగ్‌ల మీద వార్నింగ్‌లు ఇస్తున్నారు లోకేష్. ఆయన కనబరుస్తున్న దూకుడుతో తెలుగు తమ్ముళ్లలో జోష్‌ పెంచింది. లోకేష్‌పై నమ్మకం మరింత అధికమైందని పార్టీ కార్యకర్తలు అంటున్నారు.

ఇక ఇటీవల గుంటూరులో యువకుడి ఉన్మాదత్వానికి బలైన రమ్యశ్రీ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఆయన్ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దీంతో లోకేశ్‌ పొలిటికల్‌ కెరీర్‌లో తొలిసారిగా అరెస్ట్‌ అయ్యారు. అసలు అప్పుడు లోకేష్‌ను అరెస్ట్‌ చేయాల్సినంత సీన్‌ ఏ మాత్రం లేనప్పటికీ.. కేవలం ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్షంలో లోకేష్‌ రోజురోజుకు దూకుడు పెంచుతుండటాన్ని చూసి అధికార పార్టీకి భయాందోళన అధికమైందనీ, అందుకే ఆయన్ను అదిమి పెట్టేందుకు వైసీపీ పెద్దలు పోలీసులను పావులా వాడుకున్నారన్న విమర్శలు తీవ్రస్థాయిలోనే వ్యక్తమవుతున్నాయి.

మొత్తంమీద మునుపటి కంటే నారా లోకేష్‌ దూకుడు పెంచినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ప్రభుత్వాన్ని, ప్రత్యర్థులను టార్గెట్‌ చేస్తూ మాటల తూటాలు పేలుస్తుండటం.. ఆ పార్టీ కార్యకర్తల్లో జోష్‌ నింపుతోంది. మహిళలపై అత్యాచారాలు జరిగితే బుల్లెట్‌ కంటే జగన్‌ ముందుంటారంటూ ఎన్నికలకు ముందు వైసీపీ నాయకులు అన్న మాటలను లోకేష్‌ ఇప్పుడే పదేపదే ప్రస్తావిస్తున్నారు. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతుంటే జ'గన్' పేలడం లేదు ఎందుకు అని పంచ్‌ డైలాగులు విసురుతున్నారు. ను ప్రత్యర్థి పార్టీ నాయకులే రాటు తేల్చారనే రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో మృదువుగా కనిపిస్తూ సున్నితంగా మాట్లాడే లోకేష్‌.. ఇప్పుడు పంచ్‌ డైలాగులు పేలుస్తున్నారు. మొత్తంగా ప్రత్యర్థి పార్టీ నాయకులే లోకేష్‌ను రాజకీయంగా రాటు తేల్చారన్న చర్చ టీడీపీలోనే కాకుండా రాజకీయ వర్గాల్లో జోరుగా జరుగుతోంది.



కోర్టును ఒప్పిస్తాం విశాఖపట్నం తరలిస్తాం,మంత్రి బొత్సా

తాలిబన్లకు ఒక్క అవకాశం ఇస్తే.... ?

లోకేష్‌ రాటు తేలారా? తేల్చారా?

రాజశేఖర్ కూతురు మూవీ గురించి ఆసక్తికరమైన అప్డేట్..!

స్టూడెంట్స్ కి గుడ్ న్యూస్.. నెలకి 7,800/- స్కాలర్ షిప్..

కోహ్లీకి షాక్.. ఆర్సీబీ నాలుగో దెబ్బ.. ఆ ప్లేయర్ ఔట్?

మాన్ సూన్ ట్రిప్ కోసం 5 బెస్ట్ ప్లేసస్ ఇవే

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త..!

జగన్ ఇప్పుడు పాదయాత్ర చేస్తే?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>