BreakingGarikapati Rajesheditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mangalagiria12c7501-8e14-4795-853e-d6a8aa54f968-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/mangalagiria12c7501-8e14-4795-853e-d6a8aa54f968-415x250-IndiaHerald.jpgమంగ‌ళ‌గిరి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యంలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఆల‌యం ద‌క్షిణ గాలిగోపురం ఉన్న‌వైపు గోడ కూలిపోయింది. ఆ స‌మ‌యంలో భ‌క్తులెవ‌రూ లేక‌పోవ‌డం పెద్ద ప్ర‌మాదం త‌ప్పిన‌ట్లైంద‌ని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సాధార‌ణంగా గోడ కూలిన‌వైపు భ‌క్తులు పెద్ద‌గా రాదు. అది కూడా మంచిదైంద‌ని అధికారులన్నారు. గోడ‌కూల‌డానికి కార‌ణాలేంట‌ని దేవాదాయ‌శాఖ ఉన్న‌తాధికారులు నివేదిక పంపించ‌మ‌ని ఆల‌య ఈవోకు ఆదేశాలు జారీచేసిన‌ట్లు తెలుస్తోంది. పురాత‌న‌కాలం నాటి క‌ట్ట‌డం కావ‌డంతోపాటు ఇటీవ‌ల కురుస్తున్న వ‌ర్షాmangalagiri{#}Naniమంగ‌ళ‌గిరి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో ప్ర‌మాదం?మంగ‌ళ‌గిరి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో ప్ర‌మాదం?mangalagiri{#}NaniMon, 23 Aug 2021 08:44:10 GMT

మంగ‌ళ‌గిరి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామివారి ఆల‌యంలో పెను ప్ర‌మాదం త‌ప్పింది. ఆల‌యం ద‌క్షిణ గాలిగోపురం ఉన్న‌వైపు గోడ కూలిపోయింది. ఆ స‌మ‌యంలో భ‌క్తులెవ‌రూ లేక‌పోవ‌డం పెద్ద ప్ర‌మాదం త‌ప్పిన‌ట్లైంద‌ని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. సాధార‌ణంగా గోడ కూలిన‌వైపు భ‌క్తులు పెద్ద‌గా రాదు. అది కూడా మంచిదైంద‌ని అధికారులన్నారు. గోడ‌కూల‌డానికి కార‌ణాలేంట‌ని దేవాదాయ‌శాఖ ఉన్న‌తాధికారులు నివేదిక పంపించ‌మ‌ని ఆల‌య ఈవోకు ఆదేశాలు జారీచేసిన‌ట్లు తెలుస్తోంది. పురాత‌న‌కాలం నాటి క‌ట్ట‌డం కావ‌డంతోపాటు ఇటీవ‌ల కురుస్తున్న వ‌ర్షాల‌కు గోడ నాని కూలిపోయివుండ‌వ‌చ్చంటున్నారు. పూర్తిస్థాయిలో నివేదిక అందిన తర్వాతే స్పందిస్తామ‌ని దేవాదాయ శాఖ అధికారులంటున్నారు. దేశ‌వ్యాప్తంగా ప్ర‌ఖ్యాతి గాంచిన మంగ‌ళ‌గిరి ల‌క్ష్మీన‌ర‌సింహ‌స్వామి ఆల‌యంలో పాల‌క‌మండ‌లి ప‌నితీరు ఎలావుందో దీన్నిబ‌ట్టి అర్థ‌మ‌వుతోందంటూ భ‌క్తులు విమ‌ర్శిస్తున్నారు. ఇదొక్క సంఘ‌ట‌నే అయితే స‌రిపెట్టుకోవ‌చ్చ‌ని, గ‌తంలో కూడా ఇటువంటి ఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్ప‌టికీ స‌రిదిద్దుకునే చ‌ర్య‌లు మాత్రం లేవంటున్నారు. ద‌క్షిణ భార‌త‌దేశంలోనే అతి పెద్ద‌దైన గాలిగోపురం క‌లిగిన దేవాల‌యంలో ఇటువంటి సంఘ‌ట‌న జ‌ర‌గ‌డం దుర‌దృష్ట‌కర‌మ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.



మెగాస్టార్ నమ్మకాన్ని ఆ డైరెక్టర్ నిలబెట్టుకుంటాడా ?

తిరుమ‌ల‌: శ్రీ‌వారి ఆదాయం ఎంతంటే..?

నో థర్డ్ వేవ్.. ఊపిరిపీల్చుకోండి కానీ!

కరోనా కట్టడికి కేసీఆర్ కీలక నిర్ణయం ఫలిస్తుందా ?

తెలంగాణలో ష‌ర్మిల పార్టి క‌థ కంచికేనా..?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>