WomenMOHAN BABUeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/women/70/woman-977e5b0c-bacf-422e-aa22-d12b379e7fb5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/women/70/woman-977e5b0c-bacf-422e-aa22-d12b379e7fb5-415x250-IndiaHerald.jpgమానవతా విలువల్లో ఎదిగేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సమాజంలో మానవతా విలువలు, తగ్గిపోయాయి. ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా ఈ లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదని చెప్పవచ్చు. మన ఇంట్లో ఉండే ఆడపిల్లతో మనం రాఖీ కట్టించుకుంటాం. కానీ బయటి ఆడపిల్లలు ఎందుకు ఆ విధంగా చూస్తున్నాం. సమాజం మారాలి. మనమూ మారాలి.Woman {#}ramya;Culture;Manadesam;kusuma jagadish;Murder.;ramya krishnan;students;Hyderabad;Wife;Manamఇంట్లో సోదరితో రాఖీ కట్టించుకుని.. బయట సోదరిని నరికేస్తున్నారు..?ఇంట్లో సోదరితో రాఖీ కట్టించుకుని.. బయట సోదరిని నరికేస్తున్నారు..?Woman {#}ramya;Culture;Manadesam;kusuma jagadish;Murder.;ramya krishnan;students;Hyderabad;Wife;ManamSun, 22 Aug 2021 10:14:00 GMTఅమ్మాయి, అబ్బాయి ఒక చోట కలిసి కనబడితే దాన్ని తాళి తోనొ, రాఖీ తోనో బందించాల్సిన అవసరం లేదని, మానవ బంధం, మనిషి అనే సంబంధం దాని కంటే ఉన్నతమైనది అంటూ హైదరాబాద్ లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉన్న  నియోకర్సర్ సంస్థ విద్యార్థులు మానవబంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థినీ విద్యార్థులు అందరూ సామూహికంగా ప్రతిజ్ఞ చేశారు. అనంతరం వారు 'మానవత్వ బంధనం,  మనం సాటి మనుషులం అని రాసి ఉన్న కంకణాన్ని కట్టారు. ఈ సందర్భంగా నియోకర్సర్ జనరల్ సెక్రటరీ జగదీష్ మాట్లాడుతూ ఆడ మగ మధ్య బంధం సోదరి సోదర బంధమో, భార్య భర్తల బంధమో, పై బంధాలు లేని సహజీవన బంధమో అయి ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు.

వాటన్నింటి కంటే సాటి మనిషి అనే బంధమే గొప్పదని అన్నారు. ఇంట్లో రాఖీ కట్టించుకొని రోడ్డు మీద అమ్మాయిని ఏడిపించే సంస్కృతి పోవలన్నారు. ఇంట్లో అయినా, బయట అయినా మహిళలు సాటి మనిషిగా చూసే అలవాటు పెరగాలని ఆకాంక్షించారు. మనదేశంలో మానవత్వం మంట గలుస్తుందని, రోడ్డుమీద ఆకతాయిలు పేట్రేగిపోయి అమ్మాయిలను హత్య చేస్తున్న ఆపే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస మానవ విలువలు ఉన్నా ఇలాంటి ఘటనలను ఆపేందుకు ప్రయత్నాలు జరుగుతాయని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రమ్య హత్య ఇందుకు నిదర్శనమని తెలిపారు. అబ్బాయిలు, అమ్మాయిలను సాటి మనిషిగా చూసే పరిస్థితి వచ్చినప్పుడు  మనదేశం అంతర్జాతీయంగా మానవతా విలువల్లో ఎదిగేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ప్రస్తుత సమాజంలో మానవతా విలువలు, తగ్గిపోయాయి. ఆడపిల్లలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా, ఎన్ని కేసులు పెట్టినా ఈ లైంగిక దాడులు మాత్రం ఆగడం లేదని చెప్పవచ్చు. మన ఇంట్లో ఉండే ఆడపిల్లతో మనం రాఖీ కట్టించుకుంటాం. కానీ బయటి ఆడపిల్లలు ఎందుకు  ఆ విధంగా చూస్తున్నాం. సమాజం మారాలి. మనమూ మారాలి.



ఫ్లాష్‌బ్యాక్‌: ఇందిరాగాంధీ మెచ్చిన మన తెలుగు కుర్ర ఐఏఎస్‌ !

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MOHAN BABU]]>