PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/movie-artist-association-elections-tention0614e572-0d31-46cf-941f-dd262f072dc7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/movie-artist-association-elections-tention0614e572-0d31-46cf-941f-dd262f072dc7-415x250-IndiaHerald.jpgమూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు ఆదివారం 'మా' క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ కార్యవర్గ సమావేశంలో సభ్యులు పలు సూచనలు చేశారు. వచ్చే నెలలో పండుగలు ఎక్కువగా ఉండటంతో అక్టోబరులో మా ఎన్నికలు నిర్వహించాలి అసోసియేషన్‌ సభ్యులు కోరారు.కరోనా పరిస్థితుల దృష్ట్యా వర్చువల్‌గా నిర్వహించిన ఈ సమావేశంలో నటుడు మోహన్‌ బాబు ప్రశ్నల వర్షం కురిపించాMovie artist association elections tention{#}Elections;sunday;Varsham;Coronavirus;CBN;Telugu;Cinema'మా' ఎన్నికల తేదీపై వీడని ఉత్కంఠ!'మా' ఎన్నికల తేదీపై వీడని ఉత్కంఠ!Movie artist association elections tention{#}Elections;sunday;Varsham;Coronavirus;CBN;Telugu;CinemaSun, 22 Aug 2021 16:33:00 GMTమూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ ఎన్నికలపై తెలుగు రాష్ట్రాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలపై ఒక నిర్ణయానికి వచ్చేందుకు ఆదివారం 'మా' క్రమశిక్షణా సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు అధ్యక్షతన అసోసియేషన్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌ కార్యవర్గ సమావేశంలో సభ్యులు పలు సూచనలు చేశారు. వచ్చే నెలలో పండుగలు ఎక్కువగా ఉండటంతో అక్టోబరులో మా ఎన్నికలు నిర్వహించాలి అసోసియేషన్‌ సభ్యులు కోరారు.

కరోనా పరిస్థితుల దృష్ట్యా వర్చువల్‌గా నిర్వహించిన ఈ సమావేశంలో నటుడు మోహన్‌ బాబు ప్రశ్నల వర్షం కురిపించారు. మా కోసం గతంలో ఓ భవనం కొనుగోలు చేసి అమ్మేశారని మోహన్‌ బాబు గుర్తు చేశారు. అధిక ధరతో భవనాన్ని కొనుగోలు చేసి.. అతి తక్కువ ధరకే దాన్ని ఎందుకు అమ్మేశారని ఆయన ప్రశ్నించారు. అసోసియేషన్‌ భవనం అమ్మకంపై ఎవరైనా మాట్లాడారా? అని నిలదీశారు. అసోసియేషన్‌ భవనం విషయం తనను ఎంతో కలచివేస్తోందని మోహన్‌ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అతి త్వరలో ఎన్నికలు పెడతారని భావిస్తున్నానని ఆయన అన్నారు.

వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని ప్రకాశ్‌రాజ్‌ కోరారు. సెప్టెంబర్‌ 12న ఎన్నికలు జరపాలని ఆయన సూచించారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన మురళీ మోహన్‌ త్వరలోనే ఎన్నికలు నిర్వహిస్తామని బదులిచ్చారు. కానీ మా ఎన్నికలు ఎప్పుడు అన్న దానిపై అసోసియేషన్‌ సమావేశం స్పష్టత ఇవ్వలేదు. ఎన్నికల తేదీలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో.. వారం రోజుల్లో తేదీ నిర్ణయిస్తామని కృష్ణంరాజు, మురళీమోహన్‌లు తెలిపారు. మా ఎన్నికలను అక్టోబరులోనే జరపాలని మెజారిటీ సభ్యులు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు ప్రకాశ్‌ రాజ్‌ మద్దతుదారులు ఏమో సెప్టెంబర్‌ 12న ఎన్నికలు జరపాలని పట్టు బట్టారు. దీంతో అనిశ్చిత పరిస్థితి నెలకొంది.

డీఆర్సీ కమిటీ ఎలా చెబితే అలా చేస్తామని నరేష్‌ అన్నారు. సభ్యులు అక్టోబరులోనే మా ఎన్నికలు జరపాలంటున్నారని ఆయన తెలిపారు. ఎన్నికలు ఎంత త్వరగా నిర్వహిస్తే అంత మేలని కొందరు సభ్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే వచ్చే నెలలో పండుగలు ఎక్కువగా ఉన్న దృష్ట్యా అక్టోబరులో ఎన్నికలు జరపాలని మెజారిటీ సభ్యులు సూచించారు. ఈ రెండు అభిప్రాయాలను క్రమ శిక్షణా సంఘం పెద్దల దృష్టికి తీసుకెళ్లి.. త్వరలో ఎన్నికల తేదీని నిర్ణయిస్తామన్నారు. అక్టోబరులోనే మా ఎన్నికల నిర్వహణకు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని అసోసియేషన్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది.





అక్కడ కూడా గీతతో విజయ్..?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>