PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/iasac089bfd-4156-435b-aa54-0b780fbc597f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/iasac089bfd-4156-435b-aa54-0b780fbc597f-415x250-IndiaHerald.jpgపీవీఆర్కే ప్రసాద్.. మన తెలుగు ఐఏఎస్‌.. పీవీ నరసింహారావు సీఎంగా ఉన్న సమయంలో ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో.. ఇందిరాగాంధీ ‘కమ్యూనిటీ వెల్స్’ అనే పథకం నిర్వహించేవారు. దీని ద్వారా చిన్న, సన్నకారు రైతులయిన వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పనులు లేనిరోజుల్లో సామాజిక, సామూహిక పనులు చేపట్టేవారు. వేసవికాలంలో వాళ్ళ చేత చెరువుల మరమ్మత్తులు, కొత్త చెరువుల త్రవ్వకం, స్కూలు భవనాల నిర్మాణం, రోడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టేవారు. వాటిద్వారా వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేవారు. అయితే.. చెరువులు నిరIAS{#}Prime Minister;Nalgonda;prasad;Mohandas Karamchand Gandhi;CM;Teluguఫ్లాష్‌బ్యాక్‌: ఇందిరాగాంధీ మెచ్చిన మన తెలుగు కుర్ర ఐఏఎస్‌ !ఫ్లాష్‌బ్యాక్‌: ఇందిరాగాంధీ మెచ్చిన మన తెలుగు కుర్ర ఐఏఎస్‌ !IAS{#}Prime Minister;Nalgonda;prasad;Mohandas Karamchand Gandhi;CM;TeluguSun, 22 Aug 2021 10:14:00 GMTపీవీఆర్కే ప్రసాద్.. మన తెలుగు ఐఏఎస్‌.. పీవీ నరసింహారావు సీఎంగా ఉన్న సమయంలో ఆయన నల్గొండ జిల్లా కలెక్టర్‌గా పని చేశారు. ఆ సమయంలో.. ఇందిరాగాంధీ ‘కమ్యూనిటీ వెల్స్’ అనే పథకం నిర్వహించేవారు. దీని ద్వారా చిన్న, సన్నకారు రైతులయిన వ్యవసాయ కూలీలకు వ్యవసాయ పనులు లేనిరోజుల్లో సామాజిక, సామూహిక పనులు చేపట్టేవారు. వేసవికాలంలో వాళ్ళ చేత చెరువుల మరమ్మత్తులు, కొత్త చెరువుల త్రవ్వకం, స్కూలు భవనాల నిర్మాణం, రోడ్ల నిర్మాణం వంటి పనులు చేపట్టేవారు. వాటిద్వారా వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించేవారు.


అయితే.. చెరువులు నిర్మింపజేసినా, సాగునీటి చెరువుల్లో పూడిక తీయించినా ఆ చెరువుల క్రింద ఆయకట్టులో అధికభాగం పెద్ద రైతులదే ఉండేది.. ఆ పనులవల్ల ప్రయోజనం పొందేది కూడా వాళ్ళే. వ్యవసాయ కూలీలకు కూలీ మాత్రమే లభించేంది. అందుకే పీవీఆర్కే ప్రసాద్‌.. నిబంధనలు ఉల్లంఘించి.. ఇదే పథకం కింద చిన్న సన్నకారు రైతుల పొలాల్లో బావులు తవ్వించేవాళ్లు. ఆయన చేసింది మంచి పనే అయినా రూల్స్ ఉల్లంఘించం వల్ల విషయం పై వరకూ వెళ్లింది. చివరకు ప్రధాని ఇందిరాగాంధీ వరకూ వెళ్లింది.


ఒకరోజు ఆనాటి సీఎం పీవీ ప్రసాద్‌ను పిలిపించుకున్నారు. SFDA పథకాన్ని ప్రసాద్ అమలు చేస్తున్న తీరు గురించి ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ప్రస్తావించారని చెప్పారు. ప్రధానికి నువ్వు చాలా నచ్చేశావని పీవీ అన్నారు. ఇది ఏపీలోనే కాదు.. రాష్ట్రమంతా జరగాలి.. అందుకే.. ‘మిలియన్‍ వెల్స్’ (పదిలక్షల బావులు) త్రవ్వించే పథకం అమలు చేయాలని ప్రధానమంత్రి చెప్పారని పీవీ ప్రసాద్‌కు చెప్పారు... ప్రసాద్.. చాలా గర్వంగా ఉంది. నీకు అభినందనలయ్యా అని ప్రసాద్‌ను మెచ్చుకున్నారట.


అంతే కాదు.. అప్పటికప్పుడు ఆయన్ను నీకు అభ్యంతరం లేకపోతే.. నా ప్రైవేట్‍ సెక్రటరీగా ఉంటావా అని అడిగారట. అలా పీవీ ఆర్కే ప్రసాద్.. మాజీ ప్రధానికి అప్పట్లో ఆంతరంగిక కార్యదర్శి అయ్యారు. ఇదీ.. ఇందిరాగాంధీ మెచ్చిన మన కుర్ర ఐఏఎస్‌ కథ.





ఫ్లాష్‌బ్యాక్‌: ఇందిరాగాంధీ మెచ్చిన మన తెలుగు కుర్ర ఐఏఎస్‌ !

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>