PoliticsN.Harieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ekyc-problems-in-prakasham-districteedcda69-eb82-4317-bb0f-f4159cdb607e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ekyc-problems-in-prakasham-districteedcda69-eb82-4317-bb0f-f4159cdb607e-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ కార్డు కలిగినవారు నిర్ణీత గడువులోగా ఈకేవైసీ చేయించుకోకుంటే రేషన్‌ కోటా కట్‌ అన్న ప్రభుత్వ ప్రకటన పేదలను పరుగులు తీయిస్తోంది. కరోనా విపత్తు సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా ఆధార్‌ కార్డులు పట్టుకుని పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. నాలుగేళ్ల కిందట ప్రజాసాధికార సర్వే చేపట్టిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ వివరాలను నమోదు చేసింది. ప్రకాశం జిల్లాలో 10,06,337 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో 29,19,683 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 25,54,664 మంది ఈకేవైసీ పూర్తి చేEKYC problems in prakasham district{#}Prakasam;Survey;Coronavirus;Governmentప్రకాశంలో ఈకేవైసీ పరేషాన్‌!ప్రకాశంలో ఈకేవైసీ పరేషాన్‌!EKYC problems in prakasham district{#}Prakasam;Survey;Coronavirus;GovernmentSun, 22 Aug 2021 17:21:00 GMTఆంధ్రప్రదేశ్‌లో రేషన్‌ కార్డు కలిగినవారు నిర్ణీత గడువులోగా ఈకేవైసీ చేయించుకోకుంటే రేషన్‌ కోటా కట్‌ అన్న ప్రభుత్వ ప్రకటన పేదలను పరుగులు తీయిస్తోంది. కరోనా విపత్తు సమయంలో ప్రజలు గుంపులు గుంపులుగా ఆధార్‌ కార్డులు పట్టుకుని పట్టణాలకు పరుగులు తీస్తున్నారు. నాలుగేళ్ల కిందట ప్రజాసాధికార సర్వే చేపట్టిన అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఈకేవైసీ వివరాలను నమోదు చేసింది. ప్రకాశం జిల్లాలో 10,06,337 రేషన్ కార్డులు ఉన్నాయి. ఈ కార్డుల్లో 29,19,683 మంది సభ్యులు ఉన్నారు. వీరిలో ఇప్పటి వరకు 25,54,664 మంది ఈకేవైసీ పూర్తి చేయించుకున్నారు. మొత్తం 4.20 లక్షల మంది ఈకేవైసీకి దూరం కాగా 55 వేల మంది గత వారం రోజులుగా నమోదు చేసుకున్నారు. ఇంకా చేయించుకోవాల్సినవారు 3,65,019 ఉండటంతో వివరాలు నమోదు కాని వారు పోస్టాఫీసులు, బ్యాంకుల్లోని ఆధార్‌ కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. ఒక బియ్యం కార్డులో ముగ్గురు, నలుగురు సభ్యులుంటే ఒకరిద్దరే ఈకేవైసీ పూర్తి చేసుకున్నారు. ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడంతో చాలా మంది నమోదుకు దూరమయ్యారు. కొన్ని కార్డుల్లో సభ్యులంతా చేయించుకోని వారు కూడా ఉన్నారు. వారంతా ఇప్పుడు విధిగా చేయించుకోకుంటే కార్డు రద్దు కానుంది. దీంతో పిల్లలను తీసుకుని వచ్చి పెద్దలు ఆయా కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు.

ఆన్‌లైన్‌లో భూముల నమోదు నుంచి సంక్షేమ పథకాల అమలు, బ్యాంకులు, అన్ని రకాల ధృవీకరణ పత్రాలకు ఇది తప్పని సరైంది. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు కుటుంబంలోని ఒక సభ్యుడు వేలిముద్ర వేయకున్నా వారికి వచ్చే నెల నుంచి సరుకుల పంపిణీ నిలిచిపోనుంది. దీంతో వేకువజాము నుంచే పోస్టాఫీసులు, బ్యాంకుల్లోని ఆధార్‌ కేంద్రాల వద్ద కుటుంబసభ్యులతో సహా బారులు తీరుతున్నారు. రోజూ వందల సంఖ్యలో కార్డుదారులు రావడంతో ఆధార్‌ కేంద్రాలు కిటకిటలాడుతున్నాయి. ప్రస్తుతం కొవిడ్‌ బాధితుల సంఖ్య పెరుగుతూ ఉంది. అయితే ఈకేవైసీ నమోదు కేంద్రాల వద్ద ఎలాంటి భౌతిక దూరం లేకపోవడంతో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం ప్రజారోగ్యంపై ప్రభావం చూపుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈకేవైసీ చేయించుకోవాలన్న నిబంధన ఉండటంతో అందరూ పరుగులు తీస్తున్నారు. కార్డులోని సభ్యులు ఈకేవైసీ చేయించుకోని పక్షంలో వచ్చే నెల నుంచి రేషన్‌ రాదని, అలాగే ప్రభుత్వం  అందించే వివిధ పథకాలకు అనర్హులుగా గుర్తిస్తారని తెలియజేస్తుండడంతో వందలాది మంది రేషన్‌ కార్డుదారులు అవస్థలు పడుతున్నారు. గ్రామ సచివాలయ సిబ్బంది కానీ, వార్డు వాలంటీర్లు కానీ వీరికి ఏమాత్రం సేవలు అందించ లేకపోతుండటంతో ఆధార్‌ అప్‌డేషన్‌ కోసం వ్యయ ప్రయాసల కోర్చి మీసేవా కేంద్రాల  వద్ద బారులు తీరుతున్నారు. ఇప్పటికైనా సచివాలయాల్లో ఆధార్‌ అప్‌డేట్‌ చేసేలా చర్యలు తీసుకోవటంతోపాటు వలంటీర్లు క్రమపద్ధతిలో ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసి తిప్పలు తప్పించాలని ప్రజలు కోరుకుంటున్నారు.



అక్కడ కూడా గీతతో విజయ్..?

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.Hari]]>