MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/chiranjeevi72099ac3-b527-4259-84a9-d4ffcb38c7a6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_actors/chiranjeevi72099ac3-b527-4259-84a9-d4ffcb38c7a6-415x250-IndiaHerald.jpgమెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో హిట్ , సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ లోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు. అయితే మెగాస్టార్ చిరంజీవి సాధించిన కొన్ని ఇండస్ట్రీ హిట్స్ గురించి మనం మాట్లాడుకుందాం. పసివాడి ప్రాణం : చిరంజీవి , విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 1987 లో విడుదలైంది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత. చక్రవర్తి ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టి నెంబర్ వన్ గా నిలిచింది. యముడChiranjeevi{#}Allu Aravind;Ilayaraja;Nagma;Vijayashanti;lahari;m m keeravani;sonali bendre;vani viswanath;vijaya baapineedu;Pasivadi Pranam;choudary actor;Sridevi Kapoor;mani sharma;Industry;aarti agarwal;Rayalaseema;Manam;chakravarthy;Telugu;Chiranjeevi;Cinemaమెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ రికార్డు మూవీస్..!మెగాస్టార్ చిరంజీవి ఇండస్ట్రీ రికార్డు మూవీస్..!Chiranjeevi{#}Allu Aravind;Ilayaraja;Nagma;Vijayashanti;lahari;m m keeravani;sonali bendre;vani viswanath;vijaya baapineedu;Pasivadi Pranam;choudary actor;Sridevi Kapoor;mani sharma;Industry;aarti agarwal;Rayalaseema;Manam;chakravarthy;Telugu;Chiranjeevi;CinemaSun, 22 Aug 2021 11:51:00 GMTమెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో హిట్ , సూపర్ హిట్ సినిమాలతో తెలుగు ఇండస్ట్రీ లోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగాడు. అయితే  మెగాస్టార్ చిరంజీవి సాధించిన కొన్ని ఇండస్ట్రీ హిట్స్ గురించి  మనం మాట్లాడుకుందాం.

పసివాడి ప్రాణం : చిరంజీవి , విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 1987 లో విడుదలైంది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత. చక్రవర్తి ఈ సినిమాకు స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమా అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టి నెంబర్ వన్ గా నిలిచింది.

యముడికి మొగుడు: 1987 లో విడుదలైన ఈ సినిమా లో చిరంజీవి కి జంటగా విజయశాంతి నటించింది. కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అల్లు అరవింద్ నిర్మాత. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో కొత్త రికార్డులను సృష్టించింది.

జగదేకవీరుడు అతిలోకసుందరి: 1990 లో విడుదలైన ఈ సినిమా లో చిరంజీవి కి జంటగా శ్రీదేవి నటించింది. కె రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అశ్వనీదత్ నిర్మాత. ఈ సినిమాకు ఇళయరాజా స్వరాలు సమకూర్చాడు. ఈ సినిమా తెలుగు బాక్సాఫీస్ పై దండయాత్ర చేసి సరికొత్త రికార్డులను నమోదు చేసింది.

గ్యాంగ్ లీడర్: 1991 లో విడుదలైన ఈ సినిమా లో చిరంజీవి పక్కన విజయశాంతి హీరోయిన్ గా నటించింది. విజయ బాపినీడు దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమాకు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మాత. బప్పి లహరి స్వరాలు సమకూర్చారు. ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో సరికొత్త రికార్డును సృష్టించింది.

ఘరానా మొగుడు: 1992లో విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి తరపున నగ్మా , వాణి విశ్వనాథ్ హీరోయిన్ లుగా నటించారు. కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి వరప్రసాద్ నిర్మాత. ఎం ఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. ఈ సినిమాతో చిరంజీవి సరికొత్త రికార్డులను తెలుగు ఇండస్ట్రీలో సృష్టించాడు.

ఇంద్ర: 2002 లో విడుదలైన ఈ సినిమా లో చిరంజీవి కి జంటగా సోనాలి బింద్రే , ఆర్తి అగర్వాల్ హీరోయిన్ లుగా నటించారు. బి.గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అశ్వనీదత్ నిర్మాత. ఈ సినిమాకు మణిశర్మ స్వరాలు సమకూర్చాడు. రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా అప్పటి వరకు ఉన్న తెలుగు సినిమా రికార్డులను బద్దలు కొట్టి కొత్త రికార్డులను సృష్టించింది.

 ఇలా చిరంజీవి ఈ సినిమాలతో ఇండస్ట్రీలో కొత్త రికార్డును సృష్టించాడు.



చిరు వాయిస్ ఓవర్ అందించిన సినిమాలు ఇవే!!

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>