LifeStyleSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/rakhi-festival125a7ac9-69b3-49dd-914e-6e3d7e09bdcc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/rakhi-festival125a7ac9-69b3-49dd-914e-6e3d7e09bdcc-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ఈ రోజు రాఖీ పౌర్ణమి సందర్భంగా పండుగ వాతావరణం నెలకొంది. ఈ పండుగను కుల, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జరుపుకోవడం విశేషం. తమ సోదరులకు సోదరీమణులు ‘రాఖీ పౌర్ణమి’ సందర్భంగా రాఖీలు కడుతుండటం మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే రాఖీ కట్టినందుకుగాను బ్రదర్స్ సిస్టర్స్‌కు ఏవైనా గిఫ్ట్స్ ఇస్తుంటారు. జీవితాంతం చెల్లె లేదా అక్కకు రక్షణగా ఉంటామని హామీ ఇస్తూ ఉంటారు. మొత్తంగా అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటిగా భావించే రాఖీ పండుగ ఆల్రెడీ వచ్చేసింది. కాగా, ఈ రోజున రక్షా బంధనం కట్టుకున్న తర్వాత ఈ పనులు చేస్తే చాలా మంచిrakhi festival{#}festival;Manamరాఖీ పౌర్ణమి రోజు ఇలా చేస్తే అంతా శుభమే?రాఖీ పౌర్ణమి రోజు ఇలా చేస్తే అంతా శుభమే?rakhi festival{#}festival;ManamSun, 22 Aug 2021 12:00:00 GMTపండుగ వాతావరణం నెలకొంది. ఈ పండుగను కుల, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జరుపుకోవడం విశేషం. తమ సోదరులకు సోదరీమణులు ‘రాఖీ పౌర్ణమి’ సందర్భంగా రాఖీలు కడుతుండటం మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే రాఖీ కట్టినందుకుగాను బ్రదర్స్ సిస్టర్స్‌కు ఏవైనా గిఫ్ట్స్ ఇస్తుంటారు. జీవితాంతం చెల్లె లేదా అక్కకు రక్షణగా ఉంటామని హామీ ఇస్తూ ఉంటారు. మొత్తంగా అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటిగా భావించే రాఖీ పండుగ ఆల్రెడీ వచ్చేసింది. కాగా, ఈ రోజున రక్షా బంధనం కట్టుకున్న తర్వాత ఈ పనులు చేస్తే చాలా మంచి జరుగుతుందట.

అవేంటంటే.. రాఖీ పండుగ సందర్భంగా అన్నదానం చేస్తే చాలా మంచిదని శాస్త్రం చెప్తోంది. అన్ని దానాల్లోకెల్లా అన్నదానం గొప్పది అని పెద్దలు అంటుంటారు. ఈ క్రమంలో పర్వదినాన పది మందికి అన్నం పెడితే పుణ్యం లభిస్తుందని పెద్దల వాక్కు. ఈ రోజున ఎవరైతే అన్నం దానం చేస్తోరో, అవసరమైన వారికి కొంత డబ్బు దానం చేస్తారో వారికి ఇక లైఫ్‌లాంగ్ డబ్బుకు కొదవ ఉండదని పెద్దలు చెప్తుంటారు. ‘రాఖీ పౌర్ణమి’ రోజు చంద్రుడితో పాటు నవ గ్రహాల పూజలు చేస్తే దోష నివారణ జరుగుతుందట. ముఖ్యంగా ఈ రోజున చంద్రుడు‌తో పాటు నవగ్రహాలను పూజిస్తే జాతకంలో ఎటువంటి దోషాలున్నా ఇట్టే తొలిగిపోతాయట. నవగ్రహాల శాంతి‌తో చేపట్టిన పనులు నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెప్తారు పెద్దలు. పేరెంట్స్, సోదర సోదరీమణులు, టీచర్స్ బ్లెస్సింగ్స్ తీసుకోవడం, పెద్దవారి పట్ల వినయ విధేయతలు చూపించడం ద్వారా వారి జీవితంలో సత్ఫలితాలు ఉంటాయని పెద్దలు వివరిస్తున్నారు.

రక్షా బంధనం అంటే కేవలం అన్నా చెల్లెలు మాత్రమే కాదు అందరి అనురాగాలు, ప్రేమనుబంధాలు, మానవ సంబంధాలు, అనుబంధాలకు సంబంధించిన పండుగ అని పెద్దలు పేర్కొంటున్నారు. నేటి పరిస్థితులలో రాఖీ బంధన్ అనే పండుగ చాలా ముఖ్యమైనది. మహిళల పట్ల గౌరవాన్ని నిలిపేందుకుగాను ఇది సాయపడుతుందని పెద్దలు అంటున్నారు.


చిరు వాయిస్ ఓవర్ అందించిన సినిమాలు ఇవే!!

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>