MoviesRATNA KISHOREeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-2f4bfe1d-8ebf-4a1a-8c13-1cd7106811c3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-2f4bfe1d-8ebf-4a1a-8c13-1cd7106811c3-415x250-IndiaHerald.jpgఉత్త‌రాంధ్ర నాయ‌కుల‌తో పాటు మ‌రో మంచి స్నేహితుడు తూగో లీడ‌ర్ క‌న్న‌బాబు. ఆయ‌న కూడా ఈయ‌న‌కు ఎంతో చేరువ. ఒక‌నాటి ఈనాడు స్టాఫ‌ర్ ఇప్ప‌టి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి. రాజ‌కీయంలో ఎంత బిజీగా ఉన్నా క‌న్న‌బాబు కూడా చిరుకు ఎంతో ప్రాధాన్యం ఇస్తారు. ఇక తెలంగాణ‌లోనూ మంచి మంచి బంధాలే ఉన్నాయి చిరుకు. కేటీఆర్ కూడా మీరు చెప్పండి నేను చేస్తాను అన్న మాట త‌రుచూ ఆయ‌న విష‌య‌మై వినిపిస్తారు. ఎన్టీఆర్ త‌రువాత ఏదో ఒక పార్టీ ముద్ర అన్న‌ది ప‌డ‌కుండా తెలుగు చిత్ర సీమ‌ను ఇంత‌గా పార్టీల‌కు అతీతంగా అంద‌రికీ ద‌గ్గ‌ర చేసిన లీడ‌ర్ కూchiru {#}BOTCHA SATYANARAYANA;eenadu;KTR;Reddy;NTR;Party;Congress;Telugu;Chiranjeevi;Cinemaబ‌ర్త్ డే బోయ్ చిరు : ఆ ఇద్ద‌రూ అంటే భ‌లే ఇష్టంబ‌ర్త్ డే బోయ్ చిరు : ఆ ఇద్ద‌రూ అంటే భ‌లే ఇష్టంchiru {#}BOTCHA SATYANARAYANA;eenadu;KTR;Reddy;NTR;Party;Congress;Telugu;Chiranjeevi;CinemaSun, 22 Aug 2021 11:12:00 GMTవేర్వేరు పార్టీ నేత‌లు
వేర్వేరు జిల్లాల ప్ర‌తినిధులు
వారిద్ద‌రూ అయినా వారంటే
ఆయ‌న‌కు ఎంతో ఇష్టం

ఒక గంటా శ్రీ‌ను మ‌రొక‌రు బొత్స

ఉత్త‌రాంధ్ర రాజ‌కీయాల్లో చెర‌గ‌ని ముద్ర వేసిన, వేస్తున్న ఆ ఇద్ద‌రూ అంటే చిరుకు ఇష్టం. పీఆర్పీలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన గంటా శ్రీ‌ను, కాంగ్రెస్ లో ఉన్న‌ప్పుడు అనుబంధం పెంచుకున్న బొత్స ఈ ఇద్ద‌రూ ఇప్ప‌టికీ చిరుతోనే ఉంటారు. ఇండ‌స్ట్రీ పెద్ద‌గా జ‌గ‌న్ సైతం చిరును గౌర‌విస్తారు. రాజ‌శేఖ‌ర్ రెడ్డి సైతం చిరు పై ప్ర‌త్యేక గౌర‌వ‌మే క‌నబ‌రిచేవారు. టీడీపీలోనూ వైసీపీలోనూ ఆయ‌నకు ఇప్ప‌టికీ మంచి అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా గంటా శ్రీ‌ను కానీ బొత్స స‌త్య‌నారాయ‌ణ కానీ వేర్వేరుగా రాజ‌కీయాలు ఇప్పుడు న‌డుపుతున్నా చిరంజీవి విష‌య‌మై వారు ప్ర‌త్యేక అభిమానం చూపి, ఉత్త‌రాం ధ్ర‌లో సినిమా ప‌రిశ్ర‌మ అభివృద్ధికి ఏం చేయాలో చెప్పండి చేస్తాం అనే ముందుకు వ‌స్తారు. ఆనాడు టీడీపీలో గంటా మంత్రిగా ఉన్నా ఇప్పుడు వైసీపీలో బొత్స ఉన్నా  చిరు హ‌వాకు మాత్రం అస్స‌లు అడ్డే లేదు. పీఆర్పీలో కూడా బొత్స ఉంటే బాగుండు అన్న భావ‌న ఆ రోజు వ‌చ్చింది.

ఉత్త‌రాంధ్ర‌లోతిరుగులేని నేత  అయిన బొత్స ఉంటే పీఆర్పీ సీన్ మ‌రోలా ఉండేద‌న్న మాట కూడా చాలా కాలం వినిపించింది.కాంగ్రెస్ లో పీఆర్పీ విలీనం త‌రువాత బొత్స - చిరు స్నేహం మ‌రింత బ‌ల‌ప‌డింద‌ని చెప్ప‌డం వాస్త‌వం. ఇక చిరు - గంటా శ్రీ‌ను బంధం గురించి వేరుగా రాయ‌క్క‌ర్లేదు. ఆయ‌న‌కు ఏ చిన్న క‌ష్టం వ‌చ్చినా వెంటనే స్పందించి వెంటే ఉండే గుణం, స్నేహం చిరు సొంతం. ఇటీవ‌ల జరిగిన శ‌స్త్ర చికిత్స  అనంత‌రం కోలుకుంటున్న గంటా శ్రీ‌నును చిరు ప‌ల‌క‌రించి, ధైర్యం చెప్పి వ‌చ్చారు. అంతేకాకుండా ఏ చిన్న సాయం కావాల‌న్నా త‌న‌ను సంప్ర‌దించాల‌ని కోరారు. ముఖ్యంగా ఉత్త‌రాంధ్ర అంటే మ‌రో మ‌మ‌కారం చిరంజీవికి. ఎందుకంటే ఈ ప్రాంతం నుంచి వ‌చ్చిన వారంతా క‌ష్ట‌జీవుల ప్ర‌తినిధులు. వారికి శ్ర‌మ విలువ బాగా తెల్సు.. వారు కాలాన్ని వృథా చేయ‌రు. ఉద్య‌మాల నేల ఇది..మ‌నం వీరిని ఇంకాస్త ఎక్కువ‌గా ప్రేమించాలి అని త‌రుచూ అంటుంటారు చిరు. ఈ ఒక్క నేల అనే కాదు సామాన్య కుటుంబాల నుంచి వ‌చ్చి ఎదిగిన ప్ర‌తి ఒక్క‌రినీ ఇలానే చూసుకున్నారు చిరు.



ఉత్త‌రాంధ్ర నాయ‌కుల‌తో పాటు మ‌రో మంచి స్నేహితుడు తూగో లీడ‌ర్ క‌న్న‌బాబు. ఆయ‌న కూడా ఈయ‌న‌కు ఎంతో చేరువ. ఒక‌నాటి ఈనాడు స్టాఫ‌ర్ ఇప్ప‌టి వ్య‌వ‌సాయ శాఖ మంత్రి. రాజ‌కీయంలో ఎంత బిజీగా ఉన్నా క‌న్న‌బాబు కూడా చిరుకు ఎంతో ప్రాధాన్యం  ఇస్తారు. ఇక తెలంగాణ‌లోనూ మంచి మంచి బంధాలే ఉన్నాయి చిరుకు. కేటీఆర్ కూడా మీరు చెప్పండి నేను చేస్తాను అన్న మాట త‌రుచూ ఆయ‌న విష‌య‌మై వినిపిస్తారు. ఎన్టీఆర్ త‌రువాత ఏదో ఒక పార్టీ ముద్ర అన్న‌ది ప‌డ‌కుండా తెలుగు చిత్ర సీమ‌ను ఇంత‌గా పార్టీల‌కు అతీతంగా అంద‌రికీ ద‌గ్గ‌ర చేసిన లీడ‌ర్ కూడా చిరంజీవే! నో డౌట్ ఇన్ ఇట్. త‌మ్ముడికీ బీజేపీకీ ఉన్న బంధాల  రీత్యా అవ‌స‌రం  అయితే మోడీని సైతం క‌ల‌వ‌గ‌ల‌రు చిరు. చిత్ర ప‌రిశ్ర‌మ కోసం ఉత్త‌రాంధ్ర‌లో చిత్ర పరిశ్ర‌మ అభివృద్ధికి బొత్స‌నూ, గంటా శ్రీ‌నును ఏక‌తాటిపైకి తీసుకు వ‌చ్చి అభివృద్ధి ప‌నులు చేయించ‌గ‌ల స‌త్తా కూడా చిరుకే సొంతం.





ఈ ఎమర్జెన్సీ వ్యాక్సిన్.. ఎన్ని డోసులు తీసుకోవాలంటే..!

వైరల్ : సూది లేకుండా ఇంజక్షన్.. వీడియో చూస్తే అవాక్కే?

వివాదంగా మారిన ''బుల్లెట్ బండి'' సాంగ్ ?

డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయారా...? కంగారు వద్దు అండీ..?

కరోనా కోరల్లో చిక్కుకున్న 10 రాష్ట్రాలివే ?

బంగారం కొనే వాళ్లకు స్మాల్ వార్నింగ్...?

బ్రేకింగ్: తెలంగాణాలో పాయల్ రాజ్ పుత్ పై కేసు నమోదు...?

బుల్లిపిట్ట: హ్యాకర్ల బారిన పడకుండా ఉండాలంటే..ఇలా చేస్తే సరి..?

మా అసోసియేషన్ కు మంచు విష్ణు గుడ్ న్యూస్.. !



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RATNA KISHORE]]>